బడి మాన్పించారని మనోవేదనకు గురైంది.. ఆఖరుకు ఏం చేసిందంటే..?
ఆమెకు చదువంటే ఎంతో ఇష్టం. రోజూ క్రమం తప్పకుండా పాఠశాలకు వెళ్లేది. తరగతిలో ఎంతో చురుకుగా ఉంటూ అన్ని విషయాలలో ముందుండేది. అయితే కొంత కాలం క్రితం ఆమె తల్లి అనారోగ్యానికి గురైంది....
ఆమెకు చదువంటే ఎంతో ఇష్టం. రోజూ క్రమం తప్పకుండా పాఠశాలకు వెళ్లేది. తరగతిలో ఎంతో చురుకుగా ఉంటూ అన్ని విషయాలలో ముందుండేది. అయితే కొంత కాలం క్రితం ఆమె తల్లి అనారోగ్యానికి గురైంది. తల్లికి సపర్యలు చేసేందుకు బాలికను బడి మాన్పించాడు. దీంతో తనకు చదువుకోవాలని ఉందని, బడికి పంపించాలని బాలిక పలుమార్లు తల్లిదండ్రులను కోరింది. అయినా వారు తల్లికి ఆరోగ్యం కుదుటపడే వరకు పంపించేది లేదని చెప్పారు. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన బాలిక.. ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి(Kirlampudi) కి చెందిన బాలిక.. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతోంది. బాలిక తల్లి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఆమెకు సపర్యలు చేసేందుకు బాలికను బడి మాన్పించారని స్థానికులు, బంధువులు తెలిపారు. తనకు చదువుకోవాలని ఉందని, బడికి వెళ్తానని బాలిక మారాం చేయడంతో.. అమ్మ ఆరోగ్యం కుదుటపడిన తరువాత పంపిస్తామని తండ్రి చెబుతూ వచ్చారు.
ఈ క్రమంలో బుధవారం మరోసారి బడికి పంపాలని బాలిక తన తల్లిదండ్రులను కోరింది. కొన్నిరోజుల పాటు ఇంటి పనులు చూసుకోవాలని చెప్పడంతో తీవ్ర మనోవేదనకు గురైంది. ఇక తనను బడికి పంపించరేమోనని, శాశ్వతంగా చదువు మాన్పించేస్తారని తీవ్రంగా బాధపడింది. దీంతో తీవ్ర మనస్తాపంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరి వేసుకుంది. కుటుంబ సభ్యులు గమనించి.. బాలికను కాకినాడలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బాలిక చనిపోయింది. బాలిక కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్నట్లు కిర్లంపూడి పోలీసులు తెలిపారు.
ఇవీచదవండి.
భార్యను కొట్టి చంపిన భర్త.. ఆత్మహత్యగా చిత్రీకరిస్తుండగా.. కట్ చేస్తే..
IND vs WI 2nd T20, LIVE Score: ఆచితూచి ఆడుతోన్న బ్యాట్స్‌మెన్.. వెస్టిండిస్ స్కోర్ ఎంతంటే..
Rashmika Mandanna: అతడే నా భర్త అని తేల్చి చెప్పేసిన రష్మిక !! వీడియో