AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bheemla Nayak : సెన్సార్ పూర్తి చేసుకున్న పవర్ స్టార్ ‘భీమ్లానాయక్’..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రానా నటిస్తున్న భీమ్లానాయక్ సినిమా కోసం అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Bheemla Nayak : సెన్సార్ పూర్తి చేసుకున్న పవర్ స్టార్ 'భీమ్లానాయక్'..
Pawan Kalyan Rana Bheemla N
Rajeev Rayala
|

Updated on: Feb 19, 2022 | 1:15 PM

Share

Bheemla Nayak : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రానా నటిస్తున్న భీమ్లానాయక్ సినిమా కోసం అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. మలయాళం లో సూపర్ హిట్ అయిన అయ్యపనుమ్ కోషియం సినిమాకు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో పవన్ కు జోడీగా టాలెంటెడ్ హీరోయిన్ నిత్యామీనన్ నటిస్తుండగా.. రానా సరసన సంయుక్త మీనన్ నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది ఈ సినిమా. ఫిబ్రవరి 25న తెలుగు, హిందీ భాషలలో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది భీమ్ల నాయక్. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, పాటలు, గ్లిమ్ప్స్ ఈ సినిమా అంచనాలను భారీగా పెంచేశాయి.

తాజాగా భీమ్లానాయక్ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ మూవీకి సెన్సార్ బోర్డు U/A  సర్టిఫికెట్ ఇచ్చింది. ఈమేరకు ఓ పోస్టర్ ను విడుదల చేశారు మేకర్స్. పవన్ కళ్యాణ్ బైక్ పై వస్తున్న స్టిల్ ను రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గరపడుతుండడంతో అభిమానులలో మరింత క్యూరియాసిటీ పెరిగిపోతుంది.  భీమ్లా నాయక్ గురించి ప్రతి చిన్న అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ట్రైలర్‏ను రేపు (ఫిబ్రవరి 19న) రిలీజ్ చేయాలని భావిస్తున్నారట మేకర్స్. అంతేకాదు.. ఫిబ్రవరి 21న భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించాలని సన్నాహాలు చేస్తున్నారట.

మరిన్ని ఇక్కడ చదవండి :

Viral Photo: బోసి నవ్వులు.. చక్కనైన చెక్కిళ్లు.. ఈ క్యూట్ బుజ్జాయి ఎవరో చెప్పండి? అబ్బాయిల డ్రీమ్ గర్ల్!

Son Of India Review: చెడును స‌హించ‌ని స‌న్నాఫ్ ఇండియా.. తగ్గని డైలాగ్ కింగ్ ఎనర్జీ..

Anupama Parameswaran: అందాల ముద్దుగుమ్మ సీతాకోక చిలుకగా మారితే.. ఆకట్టుకుంటున్న అనుపమ పరమేశ్వరన్ న్యూలుక్..

ఎముకలు కొరికే చలిలో నడిరోడ్డుపై ప్రయాణీకులు
ఎముకలు కొరికే చలిలో నడిరోడ్డుపై ప్రయాణీకులు
మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే..
మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే..
జీతం రూ.8 వేలు.. జీఎస్టీ మాత్రం రూ.13 కోట్లు.. అసలు మ్యాటర్
జీతం రూ.8 వేలు.. జీఎస్టీ మాత్రం రూ.13 కోట్లు.. అసలు మ్యాటర్
సింహం గర్జిస్తుంది.. 'మోగ్లీ' సినిమా న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది
సింహం గర్జిస్తుంది.. 'మోగ్లీ' సినిమా న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది
బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య యుద్ధంలో.. వందేళ్ల రాజకీయం!
బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య యుద్ధంలో.. వందేళ్ల రాజకీయం!
6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే
6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..
బాలయ్య 'అఖండ 2' రిలీజ్ టీజర్ చూశారా? గూస్‌బంప్స్ అంతే
బాలయ్య 'అఖండ 2' రిలీజ్ టీజర్ చూశారా? గూస్‌బంప్స్ అంతే