AP Crime: చిచ్చు రేపిన ఆర్థిక విభేదాలు.. మనస్తాపంతో భర్త ఆత్మహత్య.. భర్త మృతిని తట్టుకోలేక..
మత్స్యకార కుటుంబానికి చెందిన అతను సీమెన్ గా ఉద్యోగం చేస్తున్నాడు. భార్య, కుమారుడితో కలిసి ఆనందంగా జీవిస్తున్నాడు. అయితే భార్యాభర్తల మధ్య ఆర్థిక విషయంలో మనస్పర్థలు తలెత్తాయి....
మత్స్యకార కుటుంబానికి చెందిన అతను సీమెన్ గా ఉద్యోగం చేస్తున్నాడు. భార్య, కుమారుడితో కలిసి ఆనందంగా జీవిస్తున్నాడు. అయితే భార్యాభర్తల మధ్య ఆర్థిక విషయంలో మనస్పర్థలు తలెత్తాయి. సీమెన్ గా ఉద్యోగం చేసిన రోజుల్లో తన భార్యకు ఇచ్చిన డబ్బు లెక్కల విషయం వారి మద్య చిచ్చు రేపింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురై.. ఆత్మహత్య(Suicide) చేసుకున్నాడు. భర్త ఆత్మహత్య చేసుకోవడాన్ని జీర్ణించుకోలేని భార్య గొంతు కోసుకుని బలవన్మరణ యత్నానికి పాల్పడింది. శ్రీకాకుళం(Srikakulam) జిల్లాలో జరిగిన ఈ ఘటన కంటతడి పెట్టించింది. ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం పుక్కళ్లవానిపేట గ్రామానికి చెందిన కేశవరావు.. సీ మెన్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఐదేళ్ల క్రితం అతని సమీప బంధువుల కుటుంబానికి చెందిన సుజాతను వివాహం చేసుకున్నాడు. వారికి ఒక కుమారుడు సంతానం.
కేశవరావు సీ మెన్ గా ఉద్యోగానికి వెళ్లిన రోజుల్లో.. భార్య సుజాతకు డబ్బులు పంపిస్తుండేవాడు. ఆ నగదును సుజాత వడ్డీలకు ఇస్తూ.. వ్యాపారం నిర్వహించేది. ఈ క్రమంలో వారిద్దరి మధ్య ఆర్థిక లావాదేవీల విషయంలో ఘర్షణ జరిగింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన కేశవరావు.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసిన భార్య సుజాత.. భర్త మృతిని తట్టుకోలేక కత్తితో గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన కుటుంబసభ్యులు సుజాతను ఆస్పత్రికి తరలించారు.
Also Read
భర్తపై భార్య అమానుషం.. ప్రియుడితో కలిసి అత్యంత దారుణంగా.. చివరికి..
AP CM Jagan: ఈ నెల 20వ తేదీన వైఎస్సార్ కడప, విశాఖపట్నం జిల్లాల్లో పర్యటించనున్న సీఎం జగన్
13 బంతుల్లో అర్థ సెంచరీ !! తుఫాన్ ఇన్నింగ్స్‌తో చెలరేగిన నరైన్ !! వీడియో