భర్తపై భార్య అమానుషం.. ప్రియుడితో కలిసి అత్యంత దారుణంగా.. చివరికి..

జీవితాంతం తోడుంటానని పెళ్లినాట చేసిన ప్రమాణాలను ఆ మహిళ మరిచింది. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని తాళి కట్టిన భర్తను అంతమొందించింది(Murder). అనంతరం ప్రియుడితో..

భర్తపై భార్య అమానుషం.. ప్రియుడితో కలిసి అత్యంత దారుణంగా.. చివరికి..
Husband Murder
Follow us
Ganesh Mudavath

|

Updated on: Feb 18, 2022 | 8:26 PM

జీవితాంతం తోడుంటానని పెళ్లినాట చేసిన ప్రమాణాలను ఆ మహిళ మరిచింది. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని తాళి కట్టిన భర్తను అంతమొందించింది(Murder). అనంతరం ప్రియుడితో కలిసి మృతదేహాన్ని ఇంటి పశువుల పాకలో పూడ్చిపెట్టింది. అసలు విషయం బయటపడటంతో.. తమ మధ్య జరిగిన ఘర్షణలో ప్రమాదవశాత్తు గోడకు తల తగలడంతో గాయమై ప్రాణాలు కోల్పోయాడని కట్టుకథ అల్లింది. పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టగా తానే హత్య చేసినట్లు ఒప్పుకుంది. చివరకు పోలీసులకు చిక్కి కటకటాలపాలైంది. గుంటూరు(Guntur) జిల్లా నగరం మండలం పూడివాడ శివారు కాసానివారిపాలెం గ్రామానికి చెందిన కర్రి వెంకటేశ్వరరావు.. రేపల్లె మండలం బండికాయలమోటుకు చెందిన ఆదిలక్ష్మిని 18 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు.

ఆదిలక్ష్మికి బాపట్ల మండలం మూలపాలేనికి చెందిన బెజ్జం రాజేష్‌తో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. విషయం తెలుసుకున్న భర్త.. భార్య ఆదిలక్ష్మితో గొడవ పడ్డాడు. భార్య వ్యవహారం నచ్చక పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ పెట్టాడు. అయినప్పటికీ ఆదిలక్ష్మిలో మార్పు రాలేదు. తమ వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్న భర్తను అడ్డు తొలగించేందుకు ప్రియుడితో కలిసి పన్నాగం పన్నింది. వెంకటేశ్వరరావు హత్యకు నెల రోజుల క్రితమే పథకం రచించింది. ముందస్తు ప్లాన్ ప్రకారం కృష్ణా జిల్లా పామర్రు నుంచి కొంగలమందు తీసుకొచ్చింది. 8 న రాత్రి ఆదిలక్ష్మి భోజనంలో కలిపి భర్తకు పెట్టింది. మృతిచెందాక శవాన్ని గోనె సంచిలో కుక్కి ఇంట్లో ఒక మూలన పెట్టింది. విషయాన్ని రాజేష్‌కు చెప్పింది. ఈ నెల 9 న రాత్రి ఇంటి వెనుక ఉన్న పశువుల పాకలో ప్రియుడితో కలిసి గొయ్యి తవ్వి మృతదేహాన్ని పాతిపెట్టింది.

Also Read

టిప్‌టాప్‌గా బీటెక్ స్టూడెంట్.. బ్యాగ్ చెక్ చేసిన పోలీసుల ఫ్యూజులు ఔట్

AP CM Jagan: ఈ నెల 20వ తేదీన వైఎస్సార్‌ కడప, విశాఖపట్నం జిల్లాల్లో పర్యటించనున్న సీఎం జగన్

UPI: ఇకపై ఆ దేశంలోనూ యూపీఐ సేవలు.. భారత్‌ వెలుపల యూపీఐ ఉపయోగిస్తున్న తొలి దేశం..