పేగు బంధాన్ని మరిచిన కుమారుడు.. వృద్ధాప్యంలో ఉన్న తల్లిపై విచక్షణా రహితంగా..

జీవితమంతా కన్న కొడుకు కోసమే ధార బోసింది. కుమారుడి అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడింది. తాను కష్టాలు పడ్డా.. కొడుకు సుఖంగా ఉండాలని కలలుకంది. పుత్రుడికి పెళ్లి చేసి...

పేగు బంధాన్ని మరిచిన కుమారుడు.. వృద్ధాప్యంలో ఉన్న తల్లిపై విచక్షణా రహితంగా..
Attack Mother
Follow us
Ganesh Mudavath

|

Updated on: Feb 18, 2022 | 5:07 PM

జీవితమంతా కన్న కొడుకు కోసమే ధార బోసింది. కుమారుడి అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడింది. తాను కష్టాలు పడ్డా.. కొడుకు సుఖంగా ఉండాలని కలలుకంది. పుత్రుడికి పెళ్లి చేసి ఓ ఇంటి వాడిని చేసింది. ఇక తన కష్టాలన్నీ తీరిపోయాయనుకున్న తరుణంలో కుమారుడి రూపంలో అవి మరింత ఎక్కువయ్యాయి. కన్నతల్లిని భారంగా భావించిన కొడుకు.. ఆ తల్లితో క్రూరంగా ప్రవర్తించాడు. కనీసం నిలబడలేని స్థితిలో ఉన్న మాతృమూర్తిపై విచక్షణా రహితంగా దాడి చేశాడు. అనంతరం ఇంటి నుంచి గెంటేశాడు. ఈ ఘటన దృశ్యాలను వీడియో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వృద్ధాప్యంలో తోడుగా ఉంటాడనుకున్న తనయుడే.. తనను ఇలా వేధిస్తుండటంతో ఆ తల్లి మౌనంగా రోదిస్తోంది.

గుంటూరు జిల్లా(Guntur District) తాడేపల్లి మండలం బ్రహ్మానందపురంలో దారుణం జరిగింది. వృద్ధురాలైన తల్లిపై కుమారుడు విచక్షణా రహితంగా దాడి చేశాడు. అనంతరం ఇంటి నుంచి గెంటేశాడు. విషయం తెలుసుకున్న స్థానికులు.. కుమారుడు శేషు తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వృద్ధాప్యం లో దగ్గరుండి చూసుకోవాల్సిన కన్న కొడుకే.. తల్లిని చితకబాదటంతో ఆవేదనకు లోనయ్యారు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్థానికుల ఫిర్యాదుతో సంఘటనాస్థలానికి చేరుకున్న తాడేపల్లి పోలీసులు.. శేషును అదుపులోకి తీసుకున్నారు.

Also Read

Baby Ghost Shark: శాస్త్రజ్ఞుల కంట పడిన అరుదైన దెయ్యం షార్క్ చేప.. పరిశోధన చేయాల్సి ఉందన్న సైంటిస్టులు

Krishna District: పేరుకే బ్యూటీషియన్.. ఆమె ఇంట్లోని ఫ్రిజ్‌లో కనిపించింది చూసి పోలీసులు షాక్

Undavalli Arun Kumar: ఏపీకి అన్యాయం జరిగిందని ప్రధాని మోదీనే చెప్పారు.. ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు..