Undavalli Arun Kumar: ఏపీకి అన్యాయం జరిగిందని ప్రధాని మోదీనే చెప్పారు.. ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు..
Undavalli Arun Kumar on AP Bifurcation: మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఏపీ విభజనపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయంపై పార్లమెంట్ సాక్షిగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ
Undavalli Arun Kumar on AP Bifurcation: మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఏపీ విభజనపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయంపై పార్లమెంట్ సాక్షిగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Narendra Modi) రెండుసార్లు వ్యాఖ్యానించారంటూ పేర్కొన్నారు. జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక హోదా తొలగించేటప్పుడు, ఆతర్వాత 2022 బడ్జెట్ సమావేశాల్లో మోదీ.. ఏపీ విభజన (AP Bifurcation) రోజు బ్లాక్ డే అంటూ పేర్కొన్నారని అరుణ్ కుమార్ గుర్తుచేశారు. ఈ మేరకు శుక్రవారం అరుణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. ఏపీ విభజన తీరుపై ఇప్పుడు కూడా స్పందించాల్సిన అవసరం ఉందని అరుణ్ కుమార్ (Undavalli Arun Kumar) సూచించారు. 2018లో మోదీ చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబును కలిసి చర్చించినట్లు తెలిపారు. దీనిపై చర్చ జరగాలని కోరాలని సూచించానని.. గుర్తుచేశారు. ఆ తర్వాత జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. దీనిపై లేఖ రాసినట్లు అరుణ్ కుమార్ పేర్కొన్నారు. దీనిపై చంద్రబాబు స్పందించలేదని.. మీరైనా దీనిగురించి పార్లమెంట్‌లో మాట్లాడాలని సీఎం జగన్‌కు గుర్తుచేశానని తెలిపారు.
మోదీ, అమిత్ షా ఏపీ విభజనపై ఏం మాట్లాడారో దీనిపై సుప్రీం కోర్టులో కేసు కూడా వేసినట్లు అరుణ్ కుమార్ తెలిపారు. దీని గురించి కోర్టుకు కీలక ఆధారాలు సమర్పించినట్లు తెలిపారు. దీనిపై చంద్రబాబు, జగన్ ప్రభుత్వాలు ఏం చేయలేదని విమర్శించారు. దీనిపై మళ్లీ అర్జెంట్ హీయరింగ్ కింద పిటిషన్ వేసినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయం ఎక్కడా జరగలేదని తెలిపారు. ఈ దారుణ విభజనపై ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా మాట్లాడారని.. ఏపీ రాజకీయ నాయకులు ఇప్పటికైనా మాట్లాడాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా, ఏపీ విభజన, పోలవరం అంశాలపై సుధీర్ఘ చర్చ జరగాల్సిన అవసరం ఉందని అరుణ్ కుమార్ సూచించారు.
ఇంకా.. అరుణ్ కుమార్ ఏం మాట్లాడారో ఈ వీడియో చూడండి..