AP Financial Crisis: ఏపీలో మునుపెన్నడు లేని విధంగా ఆర్థిక సంక్షోభం: యనమల
AP Financial Crisis: ఏపీలో మునుపెన్నడు లేని విధంగా ఆర్థిక సంక్షోభం కొనసాగుతోందని మాత్రి మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు..
AP Financial Crisis: ఏపీలో మునుపెన్నడు లేని విధంగా ఆర్థిక సంక్షోభం కొనసాగుతోందని మాత్రి మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు (Yanamala Rama Krishnudu) అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్ పాలనలో రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం నెలకొందని అన్నారు. జగన్ మొండితనం అహంభావంతోనే ఈ సంక్షోభం జరుగుతోందని ఆరోపించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం నిజాలను తొక్కి పెడుతోందని దుయ్యబట్టారు. బహిరంగ మార్కెట్ రుణాలతో సహా రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం 3 ఏళ్లలో టీడీపీ (TDP) హయాం కంటే రూ.86,865 కోట్లు అధికమన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులు కూడా కలిపితే రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం రూ.1,25,995 కోట్లు ఎక్కువ వచ్చిందని అన్నారు. ఆదాయం అనేక రాష్ట్రాల కన్న ఏపీ ఎంతో మెరుగ్గా ఉందని, పనితీరులో, వివిధ శాఖల పురోగతిలో మాత్రం దారుణంగా ఉందని యనమల ఆరోపించారు.
ఏపీపై కోవిడ్ ప్రభావం తక్కువే..
కరోనా విషయానికొస్తే ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీపై కోవిడ్ ప్రభావం తక్కువే ఉందన్నారు. ఇక ప్రత్యేక్ష నగదు బదిలీలో ఏపీ ర్యాంకు 19వ స్థానంలో ఉందని, ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ చేసిన మల్టీ డైమన్షనల్ పావర్టీ ఇండెక్స్ ప్రకారం.. ఏపీ 20వ స్థానంలో ఉందని అన్నారు.
ఇవి కూడా చదవండి: