Visakha Steel Plant: కేంద్రంపై విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల వినూత్న నిరసన.. ఆ మంత్రుల నెంబర్లు ప్రకటించి..
Visakha Steel Plant: వైజాగ్ స్టీల్ ప్లాంట్(Vizag Steel Plant) 40వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఆనందోత్సాహాల నడుమ జరుపుకోవాల్సిన..
Visakha Steel Plant: వైజాగ్ స్టీల్ ప్లాంట్(Vizag Steel Plant) 40వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఆనందోత్సాహాల నడుమ జరుపుకోవాల్సిన ఉక్కుకార్మికులు(Employees) ఆందోళనల మధ్య జరుపుకుంటున్నారు. స్టీల్‌ప్లాంట్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. కేంద్రంపై ఎస్ఎమ్ఎస్ ల పోరాటానికి శ్రీకారం చుట్టింది. ‘‘STOP SALE OF VIZAG STEEL PLANT’’ అనే స౦దేశాన్ని కేంద్ర ఉక్కుశాఖమ౦త్రి రామ్ దాస్, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లకు SMS ల ద్వారా, ఈ మెయిల్ ద్వారా పంపాలని ఉక్కు పోరాట కమిటీ పిలుపునిచ్చి౦ది. వాటికోస౦ మంత్రులకు సంబంధించిన 9848544469, 9473199323 ఫోన్ నెంబర్లు, nsitharaman@nic.in, ram.chandra@sansad.nic.in మెయిల్ ఐడీలను ప్రకటించి౦ది. ఈనెల 21 వరకు మెసేజ్‌లు, మెయిల్స్ ద్వారా తమ డిమాండ్ లను మ౦త్రులకు ప౦పాలని కార్మికులకు, ప్రజలను ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ప్రతినిధులు కోరుతున్నారు. ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ పిలుపునకు అటు కార్మికుల నుంచి ఇటు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఉదయం నుంచి విశాఖ వాసులు ఎస్ఎంఎస్ ల ద్వారా, ఈమెయిల్స్ ద్వారా తమ డిమాండ్ ను కేంద్ర పెద్దలకు పంపిస్తున్నారు.
Also read:
13 బంతుల్లో తుఫాన్ ఇన్నింగ్స్.. బంతితోనూ ప్రత్యర్ధికి చెమటలు పట్టించిన ధోని శిష్యుడు.. ఎవరో తెలుసా.!
Cricket: 77 బంతుల్లో 155 పరుగులు.. ఇద్దరు వికెట్ కీపర్ల పెను విధ్వంసం.. 6గురి బౌలర్ల ఊచకోత.!