Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cricket: 77 బంతుల్లో 155 పరుగులు.. ఇద్దరు వికెట్ కీపర్ల పెను విధ్వంసం.. 6గురి బౌలర్ల ఊచకోత.!

Pakistan Super League: టీ20 మ్యాచ్‌ల మజా వేరేలా ఉంటుందని చెప్పాలి. బ్యాటర్లు బౌండరీల వర్షం కురిపిస్తే.. బౌలర్లు కేవలం ప్రేక్షక పాత్ర పోషిస్తారు...

Cricket: 77 బంతుల్లో 155 పరుగులు.. ఇద్దరు వికెట్ కీపర్ల పెను విధ్వంసం.. 6గురి బౌలర్ల ఊచకోత.!
Peshawar Zalmi
Follow us
Ravi Kiran

|

Updated on: Feb 18, 2022 | 12:04 PM

టీ20 మ్యాచ్‌ల మజా వేరేలా ఉంటుందని చెప్పాలి. బ్యాటర్లు బౌండరీల వర్షం కురిపిస్తే.. బౌలర్లు కేవలం ప్రేక్షక పాత్ర పోషిస్తారు. ప్రతీ మ్యాచ్‌లోనూ ఇదే తంతు జరుగుతుంది. ఇదిలా ఉంటే.. తాజాగా పాకిస్తాన్ సూపర్ లీగ్‌(Pakistan Super League)లో పెషావర్ జల్మి, ఇస్లామాబాద్ యునైటెడ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇద్దరు వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్లు పెను విధ్వంసం సృష్టించారు. ఇద్దరూ సూపర్ ఫాస్ట్ అర్ధ సెంచరీలతో అదరగొట్టారు. మరి అదేంటో చూసేద్దాం పదండి..

పాకిస్తాన్ సూపర్ లీగ్‌లోని 24వ మ్యాచ్‌లో పెషావర్, ఇస్లామాబాద్ జట్లు తలబడ్డాయి. ఇందులో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పెషావర్ జల్మి జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. 20 ఏళ్ల వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ మొహమ్మద్ హారిస్ ఓపెనర్‌గా బరిలోకి దిగిన అర్ధ సెంచరీతో అదరగొట్టాడు. 218 స్ట్రైక్‌రేట్‌తో 32 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లతో 70 పరుగులు చేశాడు. ఆ జట్టులో అతడే టాప్ స్కోరర్. యాసిర్ ఖాన్(35), షోయబ్ మాలిక్(38) కూడా రాణించడంతో పెషావర్ జట్టు భారీ స్కోర్ సాధించగలిగింది. ఇస్లామాబాద్ యునైటెడ్ బౌలర్లలో అష్రఫ్ 3 వికెట్లు తీయగా.. మక్సూద్ 2 వికెట్లు, డిలాంగ్, డాసన్, జాహిర్ ఖాన్ చెరో వికెట్ పడగొట్టారు.

ఇక 207 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించే క్రమంలో బరిలోకి దిగిన ఇస్లామాబాద్ యునైటెడ్‌కు ఓపెనర్లు అర్ధ సెంచరీ భాగస్వామ్యాన్ని అందించారు. అయితే మిడిల్ ఆర్డర్‌లో వచ్చిన వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్ ఆజామ్ ఖాన్ మెరుపు ఇన్నింగ్స్‌తో అలరించాడు. 45 బంతుల్లో 85 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు, 7 సిక్సర్లు ఉన్నాయి. దాదాపుగా జట్టును గెలుపు తీరాలకు చేర్చే ప్రయత్నం చేసిన ఆజామ్ ఖాన్.. రియాజ్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి ఔట్ అయ్యాడు. దీనితో పెషావర్‌ విజయం ఖరారు అయింది. ఇస్లామాబాద్ జట్టు నిర్ణీత ఓవర్లలో 196 పరుగులు చేయడంతో పెషావర్ 10 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది. కాగా, మహమ్మద్ హారిస్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

Also Read:

తగ్గేదేలే.! ఈ ఫోటోలో పాము దాగుంది.. కనిపెడితే కిక్కే.. కిక్కు.. చాలామంది ఫెయిల్ అయ్యారు!

13 బంతుల్లో తుఫాన్ ఇన్నింగ్స్.. బంతితోనూ ప్రత్యర్ధికి చెమటలు పట్టించిన ధోని శిష్యుడు.. ఎవరో తెలుసా.!