IRCTC Tirupati Tour: తిరుమల వెళ్లే వారికి ఐఆర్‌సీటీసీ అదిరిపోయే టూర్‌ ప్యాకేజీ

IRCTC Tirupati Tour: ప్రయాణికుల కోసం ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ఎన్నో టూర్‌ ప్యాకేజీలను తీసుకువస్తుంటుంది. వివిధ..

IRCTC Tirupati Tour: తిరుమల వెళ్లే వారికి ఐఆర్‌సీటీసీ అదిరిపోయే టూర్‌ ప్యాకేజీ
Follow us
Subhash Goud

|

Updated on: Feb 18, 2022 | 12:51 PM

IRCTC Tirupati Tour: ప్రయాణికుల కోసం ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ఎన్నో టూర్‌ ప్యాకేజీలను తీసుకువస్తుంటుంది. వివిధ ప్రదేశాలను తిప్పుతూ ప్రత్యేక టూర్‌ను ఏర్పాటు చేస్తుంటుంది. యాత్రికులకు ఈ టూర్‌ ప్యాకేజీ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇక ఐఆర్‌సీటీసీ హైదరాబాద్‌ నుంచి తిరుపతికి మరో టూర్‌ను ప్రవేశపెట్టింది. తిరుపతి శ్రీవారి దర్శనం కల్పిస్తోంది. తిరుపతి బాలాజీ దర్శనం (Tirupati Balaji Darshanam) పేరుతో ఈ టూర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ టూర్‌ ఫిబ్రవరి 5 నుంచే ప్రారంభం కాగా, ఫిబ్రవరి 26 వరకు ఉంటుంది. ఫిబ్రవరి 19, 24,26 తేదీల్లో ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. ఈ టూర్‌ ప్యాకేజీలో ఒక రాత్రి, రెండు రోజుల టూర్‌ ఉంటుంది. విమానంలో తిరుపతికి తీసుకెళ్లి అక్కడ ప్రత్యేక దర్శనాన్ని కల్పిస్తుంది. ఈ టూర్‌ ప్యాకేజీలో తిరుపతితో పాటు కాణిపాకం, శ్రీనివాసమంగాపురం, శ్రీకాళహస్తి, తిరుచానూరు కూడా ఉంది.

ఈ టూర్‌లో వెళ్లే ప్రయాణికులు ఉదయం 9.50 గంటలకు హైదరాబాద్‌ నుంచి విమానంలో బయలుదేరి ఉదయం 11.10 గంటలకు తిరుమల విమానాశ్రయంకు చేరుకుంటారు. అక్కడి నుంచి పర్యాటకులను హోటల్‌కు తీసుకెళ్తారు. హోటల్‌లో కొంత విశ్రాంతి తీసుకున్న తర్వాత అక్కడి నుంచి కాణిపాకం, శ్రీనివాసమంగాపురం, తిరుచానూరు ఆలయాల సందర్శిస్తారు. ఇక రాత్రి తిరుపతిలో బస ఉంటుంది. ఇక రెండో రోజు శ్రీవారి ప్రత్యేక దర్శనం ఉంటుంది. మధ్యాహ్నం భోజనం తర్వాత శ్రీకాళహస్తి బయలుదేరుతారు. అక్కడ దర్శనం తర్వాత తిరుమల ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అదే రోజు సాయంత్రం తిరుమల నుంచి విమానంలో బయలుదేరి రాత్రికి హైదరాబాద్‌ చేరుకుంటారు.

టూర్‌ ప్యాకేజీ ధర:

ఇక ఈ టూర్‌ ప్యాకేజీ ప్రారంభ ధర రూ.11,125 నుంచి రూ.12,905 వరకు ఉంటుంది. ఇందులో సింగిల్‌, డబుల్‌, ట్రిపుల్‌ ఆక్యుపెన్సీ ధరలు ఉన్నాయి.

రెండో డోసుల వ్యాక్సిన్‌ సర్టిఫికేట్‌ తప్పనిసరి

కరోనా మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని ఐఆర్‌సీటీసీ అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. కరోనా నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. ఈ టూర్‌ వెళ్లే వారు రెండు డోసుల వ్యాక్సిన్‌ తీసుకోవడం తప్పనిసరి. ఇందు కోసం రెండు డోసులు పూర్తయినట్లు సర్టిఫికేట్‌ చూపించాల్సి ఉంటుంది. లేదా 72 గంటల ముందు ఆర్‌టీ-పీసీఆర్‌ (RT-PCR) పరీక్ష చేయించుకుని నెగిటివ్‌ రిపోర్టును అందించాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి:

Tirumala: ప్రధాని నుంచి సామాన్యుడి వరకు అందరికీ ఒకే రకమైన భోజనం.. టీటీడీ సంచలన నిర్ణయం

TTD: టీటీడీకి కళ్లు చెదిరే విరాళం ఇచ్చిన చెన్నై భక్తురాలు.. ఎన్ని కోట్లు ఇచ్చిందో తెలుసా..