AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మాయమాటలు చెప్పి.. కొండపైకి తీసుకెళ్లారు.. ఎవరూ లేని సమయంలో..??

తొమ్మిదో తరగతి చదివే బాలికకు ఇద్దరు యువకులతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా స్నేహంగా మారడంతో వారి మధ్య చనువు ఏర్పడింది. తరచూ వారు కలుసుకునేవారు. ఎప్పటిలానే యువకులిద్దరూ...

మాయమాటలు చెప్పి.. కొండపైకి తీసుకెళ్లారు.. ఎవరూ లేని సమయంలో..??
rape case
Ganesh Mudavath
|

Updated on: Feb 18, 2022 | 4:17 PM

Share

తొమ్మిదో తరగతి చదివే బాలికకు ఇద్దరు యువకులతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా స్నేహంగా మారడంతో వారి మధ్య చనువు ఏర్పడింది. తరచూ వారు కలుసుకునేవారు. ఎప్పటిలానే యువకులిద్దరూ బాలికను ద్విచక్రవాహనంపై కొండపైకి తీసుకెళ్లారు. అక్కడ మద్యం తాగి, బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. అయితే ఒకరు ఈ అత్యాచారం చేయగా.. మరొకరు సహకరించడం గమనార్హం. రాత్రిపూట దిక్కు తోచని స్థితిలో బిక్కుబిక్కుమంటున్న బాలిక తన తల్లిదండ్రులకు ఫోన్ చేసింది. వారు ఫోన్ తీయకపోవడంతో 100 నంబర్ కు కాల్ చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు.. యువకులిద్దరిపై కేసు నమోదు చేశారు. బాలికను ఠాణాకు తరలించారు. కేసును దిశా పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ ఘటన విశాఖ జిల్లా గాజువాక సమీపంలో జరిగింది.

ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ జిల్లా గాజువాక సమీప గంగవరం గ్రామానికి చెందిన ఎం.రాజు, పెదగంట్యాడ సిద్ధేశ్వరం కాలనీలో నివాసముండే గణేశ్ స్నేహితులు. వీరికి పెదగంట్యాడలో తొమ్మిదో తరగతి చదువుతున్న బాలికతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంతో వారు చనువుగా ఉండేవారు. ఈ క్రమంలో యువకులిద్దరూ బాలికకు మాయమాటలు చెప్పి, ద్విచక్రవాహనంపై యారాడ కొండపైకి తీసుకెళ్లారు. అక్కడ పాడుబడిన షెడ్డులో యువకులు మద్యం తాగారు. అనంతరం బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించారు. బాలికపై రాజు అత్యాచారానికి పాల్పడగా.. గణేశ్ సహకరించినట్లు పోలీసులు తెలిపారు.

ఘటన జరిగిన సమయంలో బాలిక తమ కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేసినప్పటికీ.. వారు సమాధానం ఇవ్వలేదు. దీంతో డయల్‌ 100 కు ఫోన్ చేసింది. బాలిక ఫోన్ కాల్ తో రాత్రి గస్తీ నిర్వహిస్తున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లారు. అక్కడే ఉన్న బాలికను పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు. నిందితులిద్దరిపై పోక్సో, అత్యాచారం కేసు నమోదు చేశారు. కేసును దిశా పోలీస్ స్టేషన్‌కు బదలాయించారు. యువకులిద్దరినీ అక్కడికి తరలించారు. వైద్య పరీక్షల కోసం బాలికను కేజీహెచ్‌కు తీసుకెళ్లారు.

Also Read

Nithya Menen: ఆహా కోసం రంగంలోకి దిగనున్న టాలెంటెడ్ హీరోయిన్..ఆ షో కోసమేనా.?

Channi Bhaiyya: కొత్త వివాదానికి తెరలేపిన చన్నీ ‘భయ్యా’ కామెంట్స్.. కాంగ్రెస్ మెడకు చుట్టుకుంటున్నకొత్త రగడ..

Viral Video: పిల్ల అయినా పులి పులే.. తల్లిని వణికించిన బుజ్జి పులి.. నవ్వులు పూయిస్తోన్న వీడియో..