CM KCR: రాజ్‌భవన్ ‘ఎట్ హోం’ కార్యక్రమానికి కేసీఆర్.. ఒకే వేదికపై సీఎం, గవర్నర్..

Telangana CM KCR: తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఆధ్వర్యంలో నిర్వహించనున్న 'ఎట్‌ హోమ్‌' కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ హాజరు..

CM KCR: రాజ్‌భవన్ 'ఎట్ హోం' కార్యక్రమానికి కేసీఆర్.. ఒకే వేదికపై సీఎం, గవర్నర్..
Follow us
Subhash Goud

| Edited By: Ravi Kiran

Updated on: Aug 15, 2022 | 6:49 PM

Telangana CM KCR: తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ‘ఎట్‌ హోమ్‌’ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ హాజరు కానున్నారు. అయితే గత కొన్ని రోజులుగా గవర్నర్‌-కేసీఆర్‌ మధ్య కోల్డ్‌ వార్‌ కొనసాగుతోంది. ఈ రోజు రాత్రి 7 గంటలకు ఎట్‌హోమ్‌ కార్యక్రమం ప్రారంభం కానుంది. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్‌ 6.50 గంటలకు ప్రగతిభవన్‌ నుంచి బయలుదేరనున్నారు. కేసీఆర్‌తో పాటు పలువురు మంత్రులు, అధికారులు కూడా హాజరు కానున్నారు. ఇప్పుడు రాజ్ భవన్ కి సీఎం కేసీఆర్ వెళ్తుండటంపై మరింత ఆసక్తికరంగా మారింది.

గత కొన్ని రోజులుగా గవర్నర్‌ – ముఖ్యమంత్రి కేసీఆర్‌ మధ్య దూరం పెరిగి, రాజ్‌భవన్‌ వైపు కన్నెత్తి చూడని కేసీఆర్‌ ఇటీవల హైకోర్టు కొత్త సీజే ప్రమాణ స్వీకారం సందర్భంగా రాజ్‌భవన్‌కు వెళ్లారు. ఆ సమయంలో గవర్నర్‌ను కేసీఆర్‌ అప్యాయంగా పలకరించారు. ఇప్పుడు గవర్నర్ నిర్వహించే కార్యక్రమానికి హాజరవుతున్నారు.

కాగా, 2020లో జరిగిన ఎట్‌ హోమ్‌ కార్యక్రమానికి హాజరైన సీఎం కేసీఆర్‌.. 2021లో కరోనా కారణంగా నిర్వహించలేదు. ఈ ఏడాదిలో ఇప్పుడు నిర్వహిస్తున్నారు. తనను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, వివిధ కార్యక్రమాలకు పిలవడం లేదంని గవర్నర్‌ ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ప్రభుత్వానికి, గవర్నర్‌కు మధ్య కోల్డ్‌వార్‌ కొనసాగుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి