Kishan Reddy: నేను చెప్పిందే ఫైనల్‌.. మూసీ స్టాండ్ సహా పలు విషయాలపై క్లారిటీ ఇచ్చిన కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి..

మూసీ వివాదంపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మూసీ విషయంలో బీజేపీ నేతల్లో ఎలాంటి బేధాభిప్రాయాలు లేవని స్పష్టం చేశారు. అటు.. మూసీ సుందరీకరణకు లక్షన్నర కోట్లు ఎక్కడి నుంచి తెస్తారంటూ రేవంత్‌ ప్రభుత్వం టార్గెట్‌గా ప్రశ్నాస్త్రాలు సంధించారు.

Kishan Reddy: నేను చెప్పిందే ఫైనల్‌.. మూసీ స్టాండ్ సహా పలు విషయాలపై క్లారిటీ ఇచ్చిన కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి..
Kishan Reddy
Follow us

|

Updated on: Oct 12, 2024 | 8:38 AM

మూసీ బ్యూటీఫికేషన్‌ అంశంపై తెలంగాణ బీజేపీ స్టాండ్‌ ప్రకటించింది. మూసీ ప్రక్షాళలపై బీజేపీలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయన్న అనుమానాలకు తెలంగాణ భారతీయ జనతాపార్టీ చీఫ్, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చెక్‌ పెట్టారు. అన్నింటికి మించి పార్టీలో సమన్వయం లేదన్న విమర్శలకు ఫుల్‌స్టాప్‌ పెట్టారు. మూసీ సుందరీకరణపై ప్రెసిడెంట్‌గా తాను చెప్పిందే ఫైనల్‌ అని తేల్చేశారు కిషన్‌రెడ్డి. ఇక.. మూసీ పరివాహక ప్రాంతాల్లో పేదోళ్ల ఇళ్లు కూల్చడాన్ని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మరోసారి ఖండించారు. మూసీ విషయంలో బీజేపీ నేతల్లో ఎలాంటి బేధాభిప్రాయాలు లేవని స్పష్టం చేశారు. తెలంగాణలోని పలు అంశాలకు సంబంధించి చిట్‌ చాట్‌ చేసిన ఆయన.. మూసీ పరివాహక ప్రాంతాల బాధితులకు బీజేపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో ప్రజలు ఎంతో కష్టపడి చిన్నచిన్న స్థలాలు కొనుక్కున్నారని, వారికి ప్రభుత్వమే అన్నీ అనుమతులు ఇచ్చి.. ఇప్పుడు కూలుస్తామని చెప్పడం దారుణమన్నారు.

కూల్చివేతలు అంత ఈజీ కాదని, ఒకవేళ ముందుకెళ్లాలనుకుంటే సీఎం రేవంత్‌రెడ్డే స్వయంగా మూసీ ప్రాంతంలో పర్యటించి ప్రజలను ఒప్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం.. మూసీ మధ్యలో మెట్రో పిల్లర్లు, బస్టాండ్‌ ఉన్నాయని.. వాటిని కూడా కూల్చేస్తారా అని ప్రశ్నించారు. పేదలు కట్టుకున్న ఇళ్లను కూల్చకుండా.. మూసీ రిటర్నింగ్ వాల్ నిర్మించి కూడా సుందరీకరణ చేయెచ్చన్నారు కిషన్‌రెడ్డి అన్నారు.

గంగానదిపై కేంద్ర ప్రభుత్వం అతి తక్కువ ఖర్చుతో శుద్ధి చేస్తున్న విషయాన్ని గుర్తు చేసిన ఆయన.. మరి మూసీ సుందరీకరణకు లక్షన్నర కోట్లు ఎందుకని.. అన్ని నిధులు ఎక్కడి నుంచి తెస్తారని రేవంత్‌ ప్రభుత్వాన్ని క్వశ్చన్‌ చేశారు. సమగ్ర కార్యాచరణ లేకుండా ముందుకెళ్తే పనులు జరగవన్నారు. ప్రజలకు ఇష్టం లేకుండా మూసీ విషయంలో ముందుకెళ్తే బాధితుల కోసం బీజేపీ పోరాటం చేస్తోందని కిషన్‌రెడ్డి హెచ్చరించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నేను చెప్పిందే ఫైనల్‌.. మూసీ స్టాండ్‌పై కిషన్‌ రెడ్డి క్లారిటీ..
నేను చెప్పిందే ఫైనల్‌.. మూసీ స్టాండ్‌పై కిషన్‌ రెడ్డి క్లారిటీ..
మరో 2 రోజుల్లో TGPSC గ్రూప్‌ 1 మెయిన్స్‌ హాల్‌టికెట్లు విడుదల
మరో 2 రోజుల్లో TGPSC గ్రూప్‌ 1 మెయిన్స్‌ హాల్‌టికెట్లు విడుదల
రైల్వేలో ఉన్నత ఉద్యోగమే మీ లక్ష్యమా.. ఇదే మంచి అవకాశం
రైల్వేలో ఉన్నత ఉద్యోగమే మీ లక్ష్యమా.. ఇదే మంచి అవకాశం
బ్రహ్మోత్సవాలు నేటితో ముగింపు.. శాస్రోక్తంగా సాగుతున్న చక్రస్నానం
బ్రహ్మోత్సవాలు నేటితో ముగింపు.. శాస్రోక్తంగా సాగుతున్న చక్రస్నానం
ఇత్తడి విగ్రహాలను, వస్తువులను ఇలా క్లీన్ చేస్తే మెరిసి పోతాయి..
ఇత్తడి విగ్రహాలను, వస్తువులను ఇలా క్లీన్ చేస్తే మెరిసి పోతాయి..
రూ.లక్షకు 14వేలు.. అందరూ ప్రభుత్వ ఉద్యోగులే..!
రూ.లక్షకు 14వేలు.. అందరూ ప్రభుత్వ ఉద్యోగులే..!
విస్కీ, బీర్‌ రెండూ కలిపి తీసుకుంటే ఏమవుతుందో తెలుసా.?
విస్కీ, బీర్‌ రెండూ కలిపి తీసుకుంటే ఏమవుతుందో తెలుసా.?
నేడే దేవరగట్టు కర్రల సమరం.. పకడ్బందీ ఏర్పాట్లు .. భారీ బందోబస్త్
నేడే దేవరగట్టు కర్రల సమరం.. పకడ్బందీ ఏర్పాట్లు .. భారీ బందోబస్త్
‘బాస్’.. మరికొన్ని గంటలే మిగిలింది.. అవకాశం వదలొద్దు.. 
‘బాస్’.. మరికొన్ని గంటలే మిగిలింది.. అవకాశం వదలొద్దు.. 
సీటెట్‌ 2024 పరీక్ష తేదీ మళ్లీ మారిందోచ్‌.. కొత్త తేదీ ఇదే
సీటెట్‌ 2024 పరీక్ష తేదీ మళ్లీ మారిందోచ్‌.. కొత్త తేదీ ఇదే