Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TGPSC Group-1 Hall Tickets: మరో రెండు రోజుల్లో టీజీపీఎస్సీ గ్రూప్‌ 1 మెయిన్స్‌ హాల్‌టికెట్లు విడుదల.. ఎగ్జాం షెడ్యూల్‌ ఇదే

తెలంగాణలో గ్రూప్‌ 1 మెయిన్‌ పరీక్షల నిర్వహనకు టీజీపీఎస్సీ ముమ్మర ఏర్పా్ట్లు చేస్తుంది. ఇప్పటికే హాల్‌ టికెట్ల విడుదలకు రంగం సిద్ధం చేసింది. అక్టోబర్‌ 14వ తేదీ నుంచి హాల్‌ టికెట్లను టీజీపీఎస్సీ వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలని కమిషన్‌ సెక్రటరీ నవీన్‌నికోలస్‌ సూచించారు. పరీక్ష తేదీకి ఒకరోజు ముందు వరకు..

TGPSC Group-1 Hall Tickets: మరో రెండు రోజుల్లో టీజీపీఎస్సీ గ్రూప్‌ 1 మెయిన్స్‌ హాల్‌టికెట్లు విడుదల.. ఎగ్జాం షెడ్యూల్‌ ఇదే
TGPSC Group1 Mains
Follow us
Srilakshmi C

|

Updated on: Oct 12, 2024 | 8:33 AM

హైదరాబాద్‌, అక్టోబర్‌ 12: తెలంగాణలో గ్రూప్‌ 1 మెయిన్‌ పరీక్షల నిర్వహనకు టీజీపీఎస్సీ ముమ్మర ఏర్పా్ట్లు చేస్తుంది. ఇప్పటికే హాల్‌ టికెట్ల విడుదలకు రంగం సిద్ధం చేసింది. అక్టోబర్‌ 14వ తేదీ నుంచి హాల్‌ టికెట్లను టీజీపీఎస్సీ వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలని కమిషన్‌ సెక్రటరీ నవీన్‌నికోలస్‌ సూచించారు. పరీక్ష తేదీకి ఒకరోజు ముందు వరకు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని వెల్లడించారు. గ్రూప్‌-1 ప్రధాన పరీక్షలు హైదరాబాద్‌ కేంద్రంగా(హెచ్‌ఎండీఏ పరిధిలో) మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5గంటల వరకు జరుగుతాయని వివరించారు. కాగా అక్టోబర్‌ 21 నుంచి 27 వరకు మెయిన్స్‌ పరీక్షలు నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు హాల్‌టికెట్లను వెబ్‌సైట్‌లో అభ్యర్థులకు అందుబాటులో ఉంచుతామని కమిషన్ వెల్లడించింది. హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకునే సమయంలో సమస్యలు తలెత్తితే 040-23542185, 040-23542187 నంబర్లను టోల్ ఫ్రీ నంబర్ లేదా కమిషన్ అధికారులను పనిదినాల్లో సంప్రదించవచ్చని అభ్యర్ధులకు సూచించారు. మెయిన్స్‌ పరీక్షలు హైదరాబాద్‌ పరిధిలో జరుగనున్నాయి. మొత్తం 563 గ్రూప్‌1 పోస్టుల భర్తీ ఈ నియామక ప్రక్రియ కొనసాగుతుంది. మొత్తం 7 పేపర్లకు మెయిన్స్‌ పరీక్షలు జరగనున్నాయి. ప్రతి పేపర్‌కు మూడు గంటల వ్యవధిలో పరీక్షలు జరుగుతాయి. ప్రతి పేపర్ 150 మార్కులకు కేటాయిస్తారు.

ఆయా పరీక్ష తేదీల్లో మధ్యాహ్నం 1:30 గంటల తరువాత గేట్లు మూసివేస్తారు. అభ్యర్థులను మధ్యాహ్నం 12:30 నుంచి పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తామని అధికారులు తెలిపారు. తొలిరోజు తమతో తెచ్చుకున్న హాల్‌టికెట్‌తోనే మిగతా పరీక్షలకు రావల్సి ఉంటుందని సూచించారు. హాల్‌టికెట్, ప్రశ్నపత్రాలను తుదిప్రక్రియ ముగిసేవరకు తమతోపాటు భద్రపరచుకోవాలని సూచించారు.

ఇవి కూడా చదవండి

టీజీపీఎస్సీ గ్రూప్‌ 1 మెయిన్‌ పరీక్షల షెడ్యూల్‌ ఇదే..

  • అక్టోబర్‌ 21వ తేదీన జనరల్‌ ఇంగ్లిష్‌ (క్వాలిఫైయింగ్‌ టెస్ట్‌)
  • అక్టోబర్‌ 22వ తేదీన పేపర్‌ 1(జనరల్‌ ఎస్సే)
  • అక్టోబర్‌ 23వ తేదీన పేపర్‌ 2 (హిస్టరీ, కల్చర్‌, జాగ్రఫీ)
  • అక్టోబర్‌ 24వ తేదీన పేపర్‌ 3 (ఇండియన్‌ సొసైటీ, కాన్‌స్టిస్ట్యూషన్‌ అండ్‌ గవర్నెన్స్‌)
  • అక్టోబర్‌ 25వ తేదీన పేపర్‌ 4 (ఎకానమీ, డెవలప్‌మెంట్‌)
  • అక్టోబర్‌ 26వ తేదీన పేపర్‌ 5 (సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్‌)
  • అక్టోబర్‌ 27వ తేదీన పేపర్‌ 6 (తెలంగాణ మూవ్‌మెంట్‌, స్టేట్‌ ఫార్మేషన్‌)

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

విధులు ముగించుకొని వెళ్తున్న పోలీసులు.. దారిలో కనిపించింది చూసి..
విధులు ముగించుకొని వెళ్తున్న పోలీసులు.. దారిలో కనిపించింది చూసి..
చాట్జీపీటీతో జర భద్రం..ఏఐలతో మనసు విప్పితే బతుకు బస్టాండే
చాట్జీపీటీతో జర భద్రం..ఏఐలతో మనసు విప్పితే బతుకు బస్టాండే
ముద్దంటే చేదు.. నాకు ఆ ఉద్దేశం లేదు!
ముద్దంటే చేదు.. నాకు ఆ ఉద్దేశం లేదు!
శ్రీసత్య ఓవర్‌ యాక్షన్.. దెబ్బకు నెంబర్ బ్లాక్ చేసిన స్టార్ హీరో
శ్రీసత్య ఓవర్‌ యాక్షన్.. దెబ్బకు నెంబర్ బ్లాక్ చేసిన స్టార్ హీరో
ఓటములు నేర్పిన పాఠాలు.. ఆరో ప్రయత్నంలో సివిల్స్‌లో ర్యాంకు
ఓటములు నేర్పిన పాఠాలు.. ఆరో ప్రయత్నంలో సివిల్స్‌లో ర్యాంకు
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌