CTET 2024 Exam Date Changed: సీటెట్‌ 2024 పరీక్ష తేదీ మళ్లీ మారిందోచ్‌.. కొత్త పరీక్ష తేదీ ఇదే

సీటెట్​పరీక్ష ప్రతీ యేట రెండు సార్లు నిర్వహిస్తారన్న సంగతి తెలిసిందే. ఈ పరీక్ష మొత్తం రెండు పేపర్లకు ఉంటుంది. మొదటి పేపర్ ఒకటి నుంచి ఐదు తరగతులకు బోధించాలనుకునే వారికి ఉంటుంది. రెండో పేపర్ ఆరు నుంచి తొమ్మిదో తరగతుల వరకు బోధించాలనుకునే వారి కోసం నిర్వహిస్తారు. సీటెట్​ స్కోర్‌కు లైఫ్​లాంగ్​వ్యాలిడిటీ ఉంటుంది..

CTET 2024 Exam Date Changed: సీటెట్‌ 2024 పరీక్ష తేదీ మళ్లీ మారిందోచ్‌.. కొత్త పరీక్ష తేదీ ఇదే
CTET 2024 Exam Date
Follow us
Srilakshmi C

|

Updated on: Oct 12, 2024 | 8:34 AM

న్యూఢిల్లీ, అక్టోబర్‌ 12: సెంట్రల్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్) డిసెంబర్‌-2024 పరీక్ష మళ్లీ మారింది. కొన్ని కారణాల వల్ల పరీక్ష షెడ్యూల్‌లో మళ్లీ మార్పు చోటుచేసుకున్నట్లు సీబీఎస్సీ ప్రకటించింది. ఈ మేరకు కొత్త షెడ్యూల్‌ను సీబీఎస్‌ఈ విడుదల చేసింది. గతంలో ఇచ్చిన ప్రకటన మేరకు డిసెంబర్‌ 15వ తేదీన పరీక్ష జరగాల్సి ఉంది. తాజా మార్పులతో ఒక రోజు ముందుకు పరీక్ష తేదీని మార్చారు. అంటే డిసెంబర్‌ 14 (శనివారం)వ తేదీన పరీక్షను నిర్వహించనున్నారు. అలాగే ఆన్‌లైన్‌లో కాకుండా ఆఫ్‌లైన్‌ విధానంలో ఓఎమ్మార్‌ ఆధారితంగా సీటెట్‌ పరీక్ష నిర్వహించనున్నారు. ఇక దరఖాస్తు తేదీల్లో ఎలాంటి మార్పు చేయలేదని, యథాతథంగానే ఆయా తేదీలలో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది. కొన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో డిసెంబర్ 15వ తేదీన పలు పోటీ పరీక్షలు జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అభ్యర్థుల నుంచి విజ్ఞప్తులు వెల్లువెత్తడంతో ఈ మేరకు పరీక్ష తేదీని మార్చామని సీబీఎస్‌ఈ తన ప్రకటనలో వివరించింది. అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉంటే డిసెంబర్ 15వ తేదీ కూడా పరీక్ష నిర్వహించే అవకాశం ఉన్నట్లు సీబీఎస్సీ స్పష్టం చేసింది. తొలుత డిసెంబర్ 1వ తేదీన సీటెట్‌ పరీక్ష జరగాల్సి ఉంది. అయితే దానిని డిసెంబర్ 15కి మార్చారు. తాజాగా మరోమారు మార్పులు చోటు చేసుకోవడంతో ఆ తేదీ మళ్లీ డిసెంబర్‌ 14వ తేదీకి మారింది.

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతుంది. అక్టోబర్ 16, 2024వ తేదీ వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుంది. జనరల్,OBC కేటగిరీ అభ్యర్థులకు పరీక్ష ఫీజు పేపర్ I లేదా 2 ఏదైనా ఒకదానికి రూ.1000 చెల్లించాలి. పేపర్ I, 2 రెండింటికీ అయితే రూ.1200 చెల్లించాలి. SC/ST/ వికలాంగుల కేటగిరీ అభ్యర్థుల పరీక్ష రుసుము ఏదైన ఒక పేపర్‌కు రూ.500, రెండు పేపర్లకు రూ.600 ఫీజు చెల్లించవల్సి ఉంటుంది.

సీటెట్​పరీక్ష ప్రతీ యేట రెండు సార్లు నిర్వహిస్తారన్న సంగతి తెలిసిందే. ఈ పరీక్ష మొత్తం రెండు పేపర్లకు ఉంటుంది. మొదటి పేపర్ ఒకటి నుంచి ఐదు తరగతులకు బోధించాలనుకునే వారికి ఉంటుంది. రెండో పేపర్ ఆరు నుంచి తొమ్మిదో తరగతుల వరకు బోధించాలనుకునే వారి కోసం నిర్వహిస్తారు. సీటెట్​ స్కోర్‌కు లైఫ్​లాంగ్​వ్యాలిడిటీ ఉంటుంది. ఈ పరీక్షను దేశ వ్యాప్తంగా ఉన్న 20 ప్రధాన భాషల్లో నిర్వహిస్తారు. సీటెట్​స్కోర్ ఆధారంగా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే స్కూళ్లలో ఉపాధ్యాయ నియామకాల్లో పరిగణనలోకి తీసుకుంటారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.