Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TS Govt Jobs: ఆరోగ్య శాఖలో మరో 371 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌.. అక్టోబరు 14తో ముగుస్తున్న దరఖాస్తు గడువు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు మరో గుడ్‌ న్యూస్‌ చెప్పింది. వైద్యారోగ్య శాఖలో మరో 371 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు తెలంగాణ మెడికల్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు నోటిఫికేషన్‌ కూడా విడుదల చేసింది. మొత్తం పోస్టుల్లో 272 నర్సింగ్‌ ఆఫీసర్ పోస్టులు, 99 స్టాఫ్‌ ఫార్మాసిస్ట్‌ పోస్టులు ఉన్నాయి. కాగా గత నెలలో 2,050 నర్సింగ్‌ పోస్టులకు వైద్య ఆరోగ్య శాఖ నోటిఫికేషన్‌ జారీ చేసిన సంగతి..

TS Govt Jobs: ఆరోగ్య శాఖలో మరో 371 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌.. అక్టోబరు 14తో ముగుస్తున్న దరఖాస్తు గడువు
Telangana Health Dept Jobs
Srilakshmi C
|

Updated on: Oct 12, 2024 | 7:19 AM

Share

హైదరాబాద్‌, అక్టోబర్‌ 12: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు మరో గుడ్‌ న్యూస్‌ చెప్పింది. వైద్యారోగ్య శాఖలో మరో 371 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు తెలంగాణ మెడికల్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు నోటిఫికేషన్‌ కూడా విడుదల చేసింది. మొత్తం పోస్టుల్లో 272 నర్సింగ్‌ ఆఫీసర్ పోస్టులు, 99 స్టాఫ్‌ ఫార్మాసిస్ట్‌ పోస్టులు ఉన్నాయి. కాగా గత నెలలో 2,050 నర్సింగ్‌ పోస్టులకు వైద్య ఆరోగ్య శాఖ నోటిఫికేషన్‌ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆ 2050 పోస్టుల‌కు అద‌నంగా తాజాగా 272 పోస్టుల‌తో అనుబంధ నోటిఫికేష‌న్ జారీ చేసింది. దీంతో మొత్తం పోస్టుల సంఖ్య 2,322కు చేరింది. ఇక ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది కూడా. అక్టోబర్‌ 14వ తేదీతో దరఖాస్తు గడువు ముగియనుంది. నవంబర్‌ 17న ఆన్‌లైన్‌లో రాత పరీక్ష జరగనుంది. ఎంపికైన వారికి నెలకు రూ.36,750 నుంచి రూ.1,06,990 వరకు జీతంగా చెల్లిస్తారు. రాతపరీక్షకు 80 పాయింట్లు, రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రులు, సంస్థల్లో పనిచేసిన కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల సర్వీసుకు 20 పాయింట్ల వెయిటేజీ కేటాయిస్తారు. మొత్తం వంద మార్కులకు నియామక ప్రక్రియ కొనసాగుతుంది.

ఏపీ అగ్రిసెట్‌లో 93 శాతం మంది ఉత్తీర్ణత.. వెబ్‌సైట్‌లో ర్యాంకు కార్డులు డౌన్‌లోడ్‌

ఆచార్య ఎన్‌జి రంగా వ్యవసాయ యూనివర్సిటీ (ఆంగ్రూ) అగ్రిసెట్‌ ప్రవేశ పరీక్షలో 93 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఈ మేరకు వర్సిటీ ఉపకులపతి డాక్టర్‌ ఆర్‌ శారద జయలక్ష్మీదేవి తెలిపారు. మొత్తం 1,556 మంది పరీక్ష రాయగా.. ఇందులో 1,447 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇందులో వచ్చిన ర్యాంకు ఆధారంగా 2024-25 విద్యా సంవత్సరంలో వ్యవసాయ బీఎస్సీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. పంగా రామ వెంకట సుభాష్, మట్టా లావణ్య, రాచకొండ నాగలక్ష్మి 115 చొప్పున మార్కులు సాధించి వ్యవసాయ డిప్లొమా కోర్సులో తొలి మూడు స్థానాల్లో నిలిచారు. సేంద్రియ వ్యవసాయ పరీక్షలో కలగురి రాజేష్‌ 92 మార్కులు, విత్తన సాంకేతిక పాలిటెక్నిక్‌లో మొక్కా మేఘన 95 మార్కులతో ఫస్ట్‌ ర్యాంకులు పొందారు. అధికారిక వెబ్‌సైట్‌లో విద్యార్ధుల ర్యాంకు కార్డులు అందుబాటులో ఉంచారు. కౌన్సెలింగ్ షెడ్యూల్‌కు సంబంధించిన పూర్తి వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవాలని రిజిస్ట్రార్‌ జిమ రామచంద్రరావు సూచించారు.

టీజీపీఎస్సీ ఏఎంవీఐ ఎంపిక జాబితా వెల్లడి

తెలంగాణ రాష్ట్ర రవాణాశాఖలో 113 సహాయ మోటారు వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ (ఏఎంవీఐ) పోస్టులకు సంబంధించిన ఫలితాలను టీజీపీఎస్సీ ప్రకటించింది. ఎంపిక జాబితా వివరాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఇతర వివరాలకు వెబ్‌సైట్‌ను సందర్శించాలని టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్‌నికోలస్‌ అభ్యర్ధులకు సూచించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.