AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IRCTC Recruitment: రైల్వేలో ఉన్నత ఉద్యోగమే మీ లక్ష్యమా.. ఇదే మంచి అవకాశం

ఇలా ఎదురు చూస్తున్నవారందరికీ ఇండియన్ రైల్వే క్వాటరింగ్ అండ్ టూరింగ్ కార్పొరేషన్ లిమిటెట్ శుభవార్త చెప్పింది. రైల్వేలో ఉన్నత స్థాయి ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఐఆర్ సీటీసీలో జనరల్ మేనేజర్ ఉద్యోగాలకు అర్హుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. మీకు తగిన అర్హతలు ఉంటే వెంటనే దరఖాస్తు చేసుకోండి.

IRCTC Recruitment: రైల్వేలో ఉన్నత ఉద్యోగమే మీ లక్ష్యమా.. ఇదే మంచి అవకాశం
Indian Railways
Madhu
|

Updated on: Oct 12, 2024 | 8:25 AM

Share

రైల్వే లో ఉద్యోగం సాధించాలని చాలా మంది యువత కలలు కంటారు. దాన్ని సాకారం చేసుకోవడానికి చాలా కష్ట పడతారు. రైల్వేలో జీతాలు, బోనస్ లు, వసతులు చాలా బాగుంటాయి. దేశంలో ఎక్కడి కైనా తిరిగే అవకాశం లభిస్తుంది. దీనిలో చిన్న ఉద్యోగం వస్తే చాలు జీవితంలో స్థిరపడిపోవచ్చు. ఇలా ఎదురు చూస్తున్నవారందరికీ ఇండియన్ రైల్వే క్వాటరింగ్ అండ్ టూరింగ్ కార్పొరేషన్ లిమిటెట్ శుభవార్త చెప్పింది. రైల్వేలో ఉన్నత స్థాయి ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఐఆర్ సీటీసీలో జనరల్ మేనేజర్ ఉద్యోగాలకు అర్హుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. మీకు తగిన అర్హతలు ఉంటే వెంటనే దరఖాస్తు చేసుకోండి. ఐఆర్ సీటీసీ.కామ్ లో ఉద్యోగాలకు సంబంధించిన అన్ని వివరాలు అందుబాటులో ఉన్నాయి.

పోస్టుల వివరాలు..

  • డెప్యూటీ జనరల్ మేనేజర్ / ఫైనాన్స్ (కార్పొరేట్ కార్యాలయం, న్యూఢిల్లీ) -1
  • డెప్యూటీ జనరల్ మేనేజర్ / ఫైనాన్స్ (వెస్ట్ జోన్, ముంబై) -1.

అర్హతలు..

పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారికి ఈ కింద తెలిపిన అర్హతలు ఉండాలని ఐఆర్ సీటీసీ వెల్లడించింది. రైల్వేలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, అటానసమస్ బాడీలలో పనిచేస్తూ ఏదైనా విభాగంలో డిగ్రీ చేసిన వారు అర్హులు.అలాగే పీఎస్ ఐ టీ అభ్యర్థులు మాత్రం చార్టెర్డ్ అకౌంటెండ్, కాస్ట్ అండ్ మేనేజ్ మెంట్ అకౌంటెంట్ చేసి ఉండాలి.

అనుభవం..

దరఖాస్తు దారులకు కావాల్సిన అనుభవాన్ని కూాడా ఐఆర్ సీటీసీ నిర్దేశించింది. అకౌంట్స్, ఫైనాన్స్, టాక్సేషన్ డిపార్టమెంట్లలో కనీసం 12 ఏళ్ల వర్కింగ్ పోస్టు అనుభవం తప్పనిసరిగా ఉండాలి.

వయో పరిమితి..

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారి నోటిఫికేషన్ ముగింపు తేదీ నాటికి 55 ఏళ్ల వయస్సు ఉండాలి.

ఎంపిక విధానం..

ఉద్యోగాల ఎంపిక విధానం నిబంధనల ప్రకారం జరుగుతుంది. ముందుగా దరఖాస్తు దారుల అప్లికేషన్లను పరిశీలించి, షార్ట్ లిస్టు తీస్తారు. అర్హతలు, అనుభవం, చదువు ఆధారంగా అభ్యర్థులను ఇంటర్వ్యూలకు పిలుస్తారు. ఈ సందర్భంగా కొన్ని విషయాలకు వెయిటేజీ లభిస్తుంది. ఏపీఏఆర్ లు, విద్య, ఉద్యోగ అనుభవం, ప్రొఫైల్, వ్యక్తిత్వం, జనరల్ అవేర్ సెస్ తదితర విషయాలను పరిశీలిస్తారు. వీటిని బట్టి మార్కులు కేటాయిస్తారు. ఇంటర్వ్యూ చేసిన రోజే అభ్యర్థులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. కాబట్టి అన్ని రకాల పత్రాలను ఆరోజూ తీసుకురావాలి.

దరఖాస్తుకు అవసరమైన పత్రాలు..

ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వారు తమ అప్లికేషన్ తో పాటు ఈ కింద తెలిపిన సర్టిఫికెట్ల జిరాక్సు లను తప్పనిసరిగా పంపించాలి. వాటినే సంబంధించి అధికారులు పరిశీలించి, అభ్యర్థులను షాట్ లిస్ట్ చేస్తారు.

  • పదో తరగతి, 12వ తరగతి, బర్త్ సర్టిఫికెట్లు
  • స్పెషలైజేషన్ / స్ట్రీమ్, మార్క్ షీట్ తో డిగ్రీ సర్టిఫికెట్
  • స్పెషలైజేషన్ / స్ట్రీమ్, మార్క్ షీట్ తో డిగ్రీ/ పీజీ డిప్లమో సర్టిఫికెట్
  • ప్రస్తుతం సంస్థ అపాయిట్ మెంట్ లెటర్, జాయినింగ్ ఆర్దర్
  • మూడు నెలల జీతం రశీదులు, నాలుగేళ్ల ఏపీఏఆర్ లు, ఏసీఆర్ లు, అప్రైజల్ రిపోర్టుల కాపీలు, అనుభవ ధ్రువీకరణ కాపీలు
  • తాజా విజిలెన్స్, డీఅండ్ఏఆర్ క్లియరెన్స్

చిరునామా..

హెచ్ ఆర్ / పర్సనల్ డిపార్ట్ మెంట్, జీజీఎం / హెచ్ ఆర్ డీ, ఐఆర్ సీటీసీ కార్పొరేషన్ కార్యాలయం, 12వ అంతస్తు, స్టేట్స్ మన్ హౌస్, బరాఖంబా రోడ్డు, న్యూఢిల్లీ 110001 అనే చిరునామాకు దరఖాస్తులను పంపించాలి.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.