Siraj Meets CM Revanth Reddy: ఇంటి స్థలంతోపాటు, ప్రభుత్వ ఉద్యోగం.. సిరాజ్‌కు ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చిన సీఎం రేవంత్..

Mohammed Siraj meets CM Revanth Reddy: టీమిండియా పేసర్ మహమ్మద్ సిరాజ్ నేడు తెలంగాణ ముఖ్యమమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. టీ20 ప్రపంచ కప్ సాధించినందుకు సిరాజ్‌ను సీఎం అభినందించారు. ఆ తర్వాత సిరాజ్ టీమిండియా జెర్సీని సీఎం రేవంత్ రెడ్డికి బహుకరించాడు. కాగా, ఈ కార్యక్రమంలో రేవంత్‌ రెడ్డితో పాటు మంత్రి కోమటి రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, టీమిండియా మాజీ క్రికెటర్ అజారుద్దీన్ కూడా పాల్గొన్నారు.

Siraj Meets CM Revanth Reddy: ఇంటి స్థలంతోపాటు, ప్రభుత్వ ఉద్యోగం.. సిరాజ్‌కు ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చిన సీఎం రేవంత్..
Siraj & Revanth Reddy
Follow us
Venkata Chari

|

Updated on: Jul 09, 2024 | 4:16 PM

Mohammed Siraj meets CM Revanth Reddy: టీమిండియా పేసర్ మహమ్మద్ సిరాజ్ నేడు తెలంగాణ ముఖ్యమమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. టీ20 ప్రపంచ కప్ సాధించినందుకు సిరాజ్‌ను సీఎం అభినందించారు. ఆ తర్వాత సిరాజ్ టీమిండియా జెర్సీని సీఎం రేవంత్ రెడ్డికి బహుకరించాడు. కాగా, ఈ కార్యక్రమంలో రేవంత్‌ రెడ్డితో పాటు మంత్రి కోమటి రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, టీమిండియా మాజీ క్రికెటర్ అజారుద్దీన్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. సిరాజ్‌ మియాకు హైదరాబాద్‌లో ఇంటిస్థలంతోపాటు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈమేరకు స్థలం చూడాలని అధికారులను ఆయన ఆదేశించారు.

ఇటీవల, టీమిండియా ఐసీసీ టీ20 ప్రపంచ కప్ విజయం తర్వాత హైదరాబాద్‌లో అడుగుపెట్టిన భారత పేసర్ మహ్మద్ సిరాజ్‌కు హైదరాబాద్‌లో క్రికెట్ అభిమానుల నుంచి ఘన స్వాగతం లభించింది. బాణసంచా కాల్చడంతో దేశభక్తి గీతాలతో అభిమానులు 30 ఏళ్ల హైదరాబాద్ పేసర్‌కు స్వాగతం పలికారు.

కాగా, భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) నుంచి రూ.125 కోట్ల బహుమతిలో వాటాను సిరాజ్ కూడా అందుకోనున్నారు. మహ్మద్ సిరాజ్ సహా 15 మంది ఆటగాళ్లలో ఒక్కొక్కరికి రూ.5 కోట్లు అందనున్నాయి. ఫైనల్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాను 7 పరుగుల తేడాతో ఓడించి టీ20 ప్రపంచకప్‌ను భారత్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..