Rat in Chutney: ఇంక తినేదెలా..? చట్నీలో ఎలుక స్విమ్మింగ్.. ఇంజినీరింగ్ హాస్టల్లో ఘోరం.. వీడియో
చట్నీలో ఎలుక దర్శనమిచ్చిన ఘటన సంగారెడ్డి జేఎన్టీయూ కళాశాల క్యాంటీన్‌లో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుండటంతో నెటిజన్లు మండిపడుతున్నారు.. కాగా.. చట్నీలో ఎలుకపడిన ఘటనపై అడిషనల్ కలెక్టర్ మాధురి ఆరా తీశారు. విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వసతి, ఫుడ్ సరిగ్గాలేదని కలెక్టర్‌కు వివరించారు.
చట్నీలో ఎలుక దర్శనమిచ్చిన ఘటన సంగారెడ్డి జేఎన్టీయూ కళాశాల క్యాంటీన్‌లో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుండటంతో నెటిజన్లు మండిపడుతున్నారు.. కాగా.. చట్నీలో ఎలుకపడిన ఘటనపై అడిషనల్ కలెక్టర్ మాధురి ఆరా తీశారు. విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వసతి, ఫుడ్ సరిగ్గాలేదని కలెక్టర్‌కు వివరించారు. దాంతోపాటు హాస్టల్ వార్డెన్, ఫుడ్ కాంట్రాక్టర్‌పై పలు ఆరోపణలు చేశారు. అనంతరం.. సుల్తాన్‌పూర్ జేఎన్టీయూ క్యాంపస్‌కు చేరుకున్న ఆమె కిచెన్ అపరిశుభ్రంగా ఉండటం చూసి ప్రిన్సిపాల్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే మెస్ కాంట్రాక్టర్‌ను మార్చాలని కలెక్టర్ ఆదేశించారు. ఘటనపై విచారించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు కలెక్టర్ మాధురి.. తప్పు చేసిన వారి పై కేసులు పెడుతామని తెలిపారు. ఫుడ్ కమిటీ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించామని.. వారానికి ఒకసారి ఫుడ్ చెక్ చేయాలని సంబంధింత అధికారులకు ఆదేశాలిచ్చామని తెలిపారు.
ఇక తవ్వేకొద్దీ.. సంగారెడ్డి జిల్లా సుల్తాన్‌పూర్ JNTU ఇంజనీరింగ్ క్యాంపస్ హాస్టల్ విద్యార్థుల ఆకలి కేకలు బయటకొస్తున్నాయి. నాసిరకం భోజనంతో క్యాంపస్‌లోని విద్యార్థులు ఆకలితో అలమటించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈనెల 3వ తేదీన క్యాంపస్‌లో ఫుడ్ సరిగా పెట్టడం లేదని విద్యార్థులు ధర్నా నిర్వహించారు. అంతేకాదు ఫుడ్ బాగోలేక రోజు పస్తులు ఉంటున్నామని..చివరకు క్లాస్‌లు బహిష్కరించి ఆందోళన చేశామని విద్యార్థులు చెబుతున్నారు.
వీడియో చూడండి..
JNTU ఇంజనీరింగ్ క్యాంపస్‌లాంటి విద్యా సంస్థలో ఇలాంటి దృశ్యాలు కనిపించడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ విషయం తెలిసి మంత్రి దామోదర రాజనర్సింహ సీరియస్ అయ్యారు. ప్రిన్స్‌పాల్‌తో మాట్లాడిన ఆయన భోజన ఏర్పాట్ల విషయంలో నిర్లక్ష్యంపై నిలదీశారు. మంత్రి ఆదేశాలతో ఇప్పుడు మెస్ కాంట్రాక్టర్‌ని మార్చుతున్నట్టు ప్రకటించారు. ఇష్యూ వైరల్ కావడంతో డైరెక్టుగా అడిషనల్ కలెక్టర్ మాధురి రంగంలోకి దిగారు. క్యాంపస్‌ను స్వయంగా పరిశీలించి విచారణకు ఆదేశించారు.
సోషల్ మీడియాలో ఈ ఘటనపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. నిర్వాహకుల నిర్లక్ష్యంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..