AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Swiggy Delivery Boys: స్విగ్గీ డెలివరీ బాయ్స్ నిరసనలతో ఈ ప్రాంతాల్లో నిలిచిన ఫుడ్ డెలివరీ..

ఏ చిన్న ఫుడ్‌ ఐటమ్‌ కావాలన్న స్పాట్‌లో గుర్తుకొచ్చేది.. ఆన్‌లైన్‌ బుకింగ్‌. అది కూడా నిమిషాల్లోనే మన ఇంటి వాకిట్లోకి వచ్చేస్తుంది ఫుడ్‌.

Swiggy Delivery Boys: స్విగ్గీ డెలివరీ బాయ్స్ నిరసనలతో ఈ ప్రాంతాల్లో నిలిచిన ఫుడ్ డెలివరీ..
Swiggy Delivery Boys
Ram Naramaneni
| Edited By: Ravi Kiran|

Updated on: Nov 29, 2021 | 5:59 PM

Share

ఏ చిన్న ఫుడ్‌ ఐటమ్‌ కావాలన్న స్పాట్‌లో గుర్తుకొచ్చేది.. ఆన్‌లైన్‌ బుకింగ్‌. అది కూడా బుక్ చేసిన నిమిషాల్లోనే మన ఇంటి వాకిట్లోకి వచ్చేస్తుంది ఫుడ్‌. యాప్స్‌లో ఫుడ్ బుకింగ్ అనేది ఇప్పుడు సాధారణంగా మారిపోయింది. కరోనా సమయంలో ఆన్‌లైన్‌ ఫుడ్ డెలివరీ ప్రాధాన్యత చాలా పెరిగింది. అలాంటి ఫుడ్‌ డెలివరీ చేసే బాయ్స్‌ కూడా ఆందోళన బాట పట్టబోతున్నారు. ముందస్తు హెచ్చరికగా నల్లబ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఐనా యాజమాన్యాల్లో మార్పు రాని పక్షంలో డిసెంబర్‌ 5 నుంచి సమ్మెకు దిగాలని నిర్ణయించారు.

కనీసం డెలివరీ ఛార్జీలను పెంచాలంటూ స్విగ్గీ ఫుడ్‌ డెలివరీ బాయ్స్‌ నిర్ణయించారు. ఇవాళ్టీ నుంచి నల్లబ్యాడ్జీలతో ఫుడ్‌ డెలివరీ చేస్తున్నారు. ఇప్పటికే యాజమన్యాలకు నోటీసులు ఇచ్చిన తెలంగాణ గిగ్‌ అండ్‌ ప్లాట్‌ఫార్మ్‌ వర్కర్స్‌ యూనియన్‌.. పలు డిమాండ్లు పరిష్కరించాలని కోరుతోంది. ఇవాళ్టీ నుంచి నల్లబ్యాడ్జీలతో ఫుడ్‌ డెలివరీ చేస్తున్న బాయ్స్‌.. తమ డిమాండ్‌ నెరవేరని పక్షంలో డిసెంబర్‌ 5 నుంచి నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చారు. సమస్యలపై చర్చించేందుకు స్విగ్గీ యాజమాన్యానికి వారం రోజుల గడువు ఇచ్చింది యూనియన్‌. పెట్రోల్‌ ధరలు మంట పుట్టిస్తున్న డెలివరీ ఛార్జీల్లో ఎలాంటి మార్పు లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్విగ్గీ డెలివరీ బాయ్స్ నిరసనలతో కొన్ని ప్రాంతాల్లో నిలిచిన ఫుడ్ డెవివరీ నిలిచిపోయింది. గచ్చిబౌలి, కొండాపూర్, నానక్ రాం గూడ, కోకాపేట్, మణికొండ ప్రాంతాల్లో ముందుగానే స్విగ్గీ బాయ్స్ సమ్మెకు దిగారు. మెల్లమెల్లగా అన్ని ప్రాంతాలకు విస్తరిస్తామంటున్నారు.

కనీస డెలివరీ చార్జీలు పెంచాలని స్విగ్గీ ఫుడ్ డెలివరీ బాయ్స్ ప్రధానంగా డిమాండ్‌ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో పెట్రోల్‌ ధరలు భారీగా పెరిగినా యాజమాన్యం చెల్లించే ఛార్జీల్లో మార్పు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పెట్రోల్‌ ధరలకు అనుగుణంగా కనీస ఛార్జీని 35 రూపాయలకు పెంచాలని, కస్టమర్‌ డోర్‌ స్టెప్‌ డెలివరీ ఛార్జీని 5 రూపాయలు ఇవ్వాలని, ప్రతి కిలోమీటర్‌కు చెల్లించే మొత్తాన్ని 6 రూపాయల నుంచి 12 రూపాయలకు పెంచాలని డిమాండ్‌ చేస్తున్నారు. యూనియన్‌ ఆధ్వర్యంలో ఆందోళన బాట పట్టడంతో దిగొచ్చిన యాజమాన్యం మినిమమ్‌ గ్యారంటీ అమౌంట్‌ ఇస్తామంటూ బేరసారాలకు వస్తోందని వాపోతున్నారు. డిమాండ్లను పక్కదారి పట్టించేదుకే ఈ విధంగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

స్విగ్గీ డెలివరీ బాయ్స్ డిమాండ్స్:

1. డెలివరీ కనీస చార్జి రూ. 35గా ప్రకటించాలి 2. బ్యాచ్‌ ఆర్డర్‌ చెల్లింపులను రూ. 20కి పెంచాలి 3. కస్టమర్‌ డోర్‌ స్టెప్‌ డెలివరీ చార్జీ రూ.5లను పునరుద్ధరించాలి 4. ప్రతి కిలోమీటర్‌కు చెల్లించే మొత్తాన్ని రూ. 6 నుంచి రూ. 12కు పెంచాలి 5. ప్రతినెలా ఇచ్చే రేటింగ్‌ ఇన్సెంటివ్స్‌ను మళ్లీ ప్రవేశపెట్టాలి 6. డెలివరీ పరిధిని తగ్గించడానికి సూపర్‌ జోన్స్‌ తీసేయాలి

Also Read: Osmania University: ఓయూలో సమాధి కలకలం.. టెన్షన్‌లో విద్యార్థులు

బార్‌లో యాక్షన్ హీరో.. డ్రంక్ అండ్ డ్రైవ్‌ తనిఖీల్లో ‘స్వాతిముత్యం’లో కమల్ హాసన్