ఇంటర్మీడియట్ బోర్డు వద్ద సేమ్ సీన్.. టెన్షన్..

హైదరాబాద్ ఇంటర్మీడియట్ బోర్డు వద్ద ఉద్రిక్తత కొనసాగుతోంది. ఇంటర్ ఫలితాల్లో అవకతవకలు జరిగాయంటూ ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నాకు దిగారు. భారీగా స్టూడెంట్స్ రావడంతో పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. విద్యార్థుల నిరసనల నేపథ్యంలో బోర్డు కార్యాలయం లోపలికి ఎవ్వరికీ అనుమతి ఇవ్వడం లేదు. కార్యాలయానికి తాళాలు వేసి సెక్యూరిటీని కట్టుదిట్టం చేశారు పోలీసులు. ఫలితాల్లో అవకతవకలు జరిగాయని.. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆందోళనకు దిగడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఇప్పటివరకూ ఇంటర్ పరీక్షల్లో 16 […]

ఇంటర్మీడియట్ బోర్డు వద్ద సేమ్ సీన్.. టెన్షన్..
Follow us

| Edited By:

Updated on: Apr 22, 2019 | 11:48 AM

హైదరాబాద్ ఇంటర్మీడియట్ బోర్డు వద్ద ఉద్రిక్తత కొనసాగుతోంది. ఇంటర్ ఫలితాల్లో అవకతవకలు జరిగాయంటూ ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నాకు దిగారు. భారీగా స్టూడెంట్స్ రావడంతో పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. విద్యార్థుల నిరసనల నేపథ్యంలో బోర్డు కార్యాలయం లోపలికి ఎవ్వరికీ అనుమతి ఇవ్వడం లేదు. కార్యాలయానికి తాళాలు వేసి సెక్యూరిటీని కట్టుదిట్టం చేశారు పోలీసులు. ఫలితాల్లో అవకతవకలు జరిగాయని.. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆందోళనకు దిగడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.

ఇప్పటివరకూ ఇంటర్ పరీక్షల్లో 16 మంది విద్యార్థులు ఫెయిల్ అయిన కారణంగా ఆత్మహత్యలు చేసుకున్నారని అధికారికంగా చెప్తున్నప్పటికీ.. 20 మందికి పైగానే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే.. ఇంటర్ బోర్డుపై వచ్చిన అపోహలను తాము తొలగిస్తామని ప్రభుత్వం చెప్పడం చూస్తే ఈ సమస్యను ఎంత తేలికగా తీసుకున్నారో తెలుస్తుంది. దీంతో.. ఇంటర్ బోర్టు కార్యదర్శి అశోక్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు విద్యార్థులు.