స్క్రూ డ్రైవరే “కత్తి”.. బీజేపీ నేతపై దాడి
హైదరాబాద్ : బీజేపీ నగర ఉపాధ్యక్షుడు అరుణ్ కుమార్‌పై ఆదివారం రాత్రి దాడి జరిగింది. అభిమన్యు అనే వ్యక్తి స్క్రూడ్రైవర్‌తో దాడి చేసి విచక్షణా రహితంగా పొడిచాడు. దాదాపు 20 సార్లు పొడవడంతో అరుణ్ తీవ్రంగా గాయపడ్డారు. ఫిలింనగర్‌లో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. తీవ్రంగా గాయపడిన అరుణ్‌ను వెంటనే సమీపంలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. కాగా దాడికి పాల్పడిన అభిమన్యు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.