AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video : చెన్నైలో అభిషేక్ శర్మ, అక్షర్ పటేల్ రచ్చ.. కోచ్‌ను పట్టుకుని ఏమడిగారంటే?

Viral Video : టీమిండియా వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్, యువ సంచలనం అభిషేక్ శర్మ ఇప్పుడు మైదానంలో కంటే బయటే ఎక్కువ సందడి చేస్తున్నారు. టీ20 వరల్డ్ కప్ 2026లో జింబాబ్వేతో జరగనున్న కీలక మ్యాచ్ కోసం టీమిండియా చెన్నై చేరుకుంది.

Viral Video : చెన్నైలో అభిషేక్ శర్మ, అక్షర్ పటేల్ రచ్చ.. కోచ్‌ను పట్టుకుని ఏమడిగారంటే?
Axar Patel Viral Video
Rakesh
|

Updated on: Feb 26, 2026 | 7:10 AM

Share

Viral Video : టీమిండియా వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్, యువ సంచలనం అభిషేక్ శర్మ ఇప్పుడు మైదానంలో కంటే బయటే ఎక్కువ సందడి చేస్తున్నారు. టీ20 వరల్డ్ కప్ 2026లో జింబాబ్వేతో జరగనున్న కీలక మ్యాచ్ కోసం టీమిండియా చెన్నై చేరుకుంది. అయితే మ్యాచ్ టెన్షన్ ఏమీ లేకుండా ఈ ఇద్దరు ఆటగాళ్లు చిల్ అవుతున్న వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జట్టులో వైస్ కెప్టెన్ హోదా ఉన్నా తుది జట్టులో చోటు కోసం ఎదురుచూస్తున్న అక్షర్, ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్న అభిషేక్ శర్మ కలిసి చెన్నై వీధుల్లో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. వీరిద్దరితో పాటు ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్ హేమాంగ్ బదానీ కూడా ఉండటం విశేషం.

వైరల్ అవుతున్న ఈ వీడియోలో అక్షర్ పటేల్ తన పాత కోచ్ హేమాంగ్ బదానీని ఆటపట్టిస్తూ కనిపించాడు. “కోచ్.. చెన్నైకి వచ్చాను, నాకేం తాగిస్తారు? టీ ఇస్తారా లేక కాఫీనా?” అంటూ సరదాగా ఆదేశాలు జారీ చేశాడు. దీనికి బదానీ బదులిస్తూ.. “నేను మీకు ఫిల్టర్ కాఫీ ఇద్దామనుకున్నాను, కానీ మీరు జెన్ జీ (Gen Z) కిడ్స్ కదా.. అందుకే మిమ్మల్ని మోడ్రన్ ప్లేస్‌కు తీసుకువచ్చాను” అంటూ నవ్వుతూ సమాధానమిచ్చారు. ఈ క్రమంలో అభిషేక్ శర్మ తనకు నచ్చిన డ్రింక్ ఆర్డర్ చేస్తూ కనిపించాడు. వీడియో చివర్లో ఇద్దరూ కలిసి అసలు కళ్లు తెరవలేకపోతున్నాం అంటూ నిద్రమత్తులో ఉన్నట్లు జోకులు పేల్చారు.

ఈ వినోదం పక్కన పెడితే, టీ20 వరల్డ్ కప్‌లో వీరిద్దరి ప్రదర్శన ఆందోళనకరంగా ఉంది. ముఖ్యంగా అభిషేక్ శర్మ తన సహజ సిద్ధమైన ఆటను ఆడలేకపోతున్నాడు. ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్‌ల్లో 3 సార్లు డకౌట్ (సున్నాకే అవుట్) అయ్యాడు. ఒక మ్యాచ్‌లో కేవలం 15 పరుగులు మాత్రమే చేశాడు. అంటే 4 మ్యాచ్‌ల్లో కలిపి కేవలం 20 బంతులు మాత్రమే ఎదుర్కొన్నాడు. మరోవైపు అక్షర్ పటేల్ బ్యాటింగ్‌లో పెద్దగా రాణించకపోయినా (3 ఇన్నింగ్స్‌ల్లో 14 పరుగులు), బౌలింగ్‌లో మాత్రం మెరుగ్గా రాణించి 3 మ్యాచ్‌ల్లో 6 వికెట్లు తీశాడు. వైస్ కెప్టెన్ అయినప్పటికీ జట్టు బ్యాలెన్స్ కోసం గత కొన్ని మ్యాచ్‌లుగా అక్షర్ బెంచ్‌కే పరిమితం కావాల్సి వచ్చింది.

జింబాబ్వేతో జరగబోయే మ్యాచ్ కోసం టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్‌లో కొన్ని మార్పులు ఉంటాయని బ్యాటింగ్ కోచ్ సితాంశు కోటక్ సూచన ప్రాయంగా తెలిపారు. దీంతో అక్షర్ పటేల్‌కు ఈ మ్యాచ్‌లో అవకాశం దక్కుతుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. అభిషేక్ శర్మకు మాత్రం మరో అవకాశం ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. మరి చెన్నై ఫిల్టర్ కాఫీ తాగిన ఈ జోడీ, జింబాబ్వేపై పరుగుల వరద పారిస్తుందో లేదో వేచి చూడాలి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
టెన్త్, ఇంటర్‌ అర్హతతో.. భారత సైన్యంలో 25 వేల అగ్నివీర్ ఉద్యోగాలు
టెన్త్, ఇంటర్‌ అర్హతతో.. భారత సైన్యంలో 25 వేల అగ్నివీర్ ఉద్యోగాలు
చెన్నైలో అభిషేక్ శర్మ, అక్షర్ పటేల్ రచ్చ..కోచ్‌ను ఏమడిగారంటే ?
చెన్నైలో అభిషేక్ శర్మ, అక్షర్ పటేల్ రచ్చ..కోచ్‌ను ఏమడిగారంటే ?
లక్ష పెట్టుబడితో ప్రారంభించే ఇన్నోవేటివ్‌ బిజినెస్‌!
లక్ష పెట్టుబడితో ప్రారంభించే ఇన్నోవేటివ్‌ బిజినెస్‌!
బ్యాడ్ లక్కోడికి వెల్కం చెప్పిన గంభీర్.. ఎవరంటే?
బ్యాడ్ లక్కోడికి వెల్కం చెప్పిన గంభీర్.. ఎవరంటే?
తగ్గేదేలే అంటున్న బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ధర ఎంతంతంటే..
తగ్గేదేలే అంటున్న బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ధర ఎంతంతంటే..
RRB రైల్వే రాత పరీక్షల తేదీలు 2026 మారాయ్‌.. కొత్త షెడ్యూల్‌ ఇదే
RRB రైల్వే రాత పరీక్షల తేదీలు 2026 మారాయ్‌.. కొత్త షెడ్యూల్‌ ఇదే
ఫోన్‌ ఇలా వాడుతున్నారా? మీకు పిల్లలు పుట్టడం కష్టమే!
ఫోన్‌ ఇలా వాడుతున్నారా? మీకు పిల్లలు పుట్టడం కష్టమే!
61 పరుగుల తేడాతో లంక చిత్తు..పాయింట్ల పట్టికలో దూసుకెళ్లిన కివీస్
61 పరుగుల తేడాతో లంక చిత్తు..పాయింట్ల పట్టికలో దూసుకెళ్లిన కివీస్
అల్పాహారం ఎగ్గొడితే ఊబకాయం తప్పదా? నమ్మలేని నిజాలు
అల్పాహారం ఎగ్గొడితే ఊబకాయం తప్పదా? నమ్మలేని నిజాలు
ఇంటర్‌ అర్హతతో.. IAF ఉద్యోగాలకు ఓపెన్‌ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ!
ఇంటర్‌ అర్హతతో.. IAF ఉద్యోగాలకు ఓపెన్‌ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ!