Hyderabad: MMTS ప్రయాణీకులకు గుడ్‌న్యూస్.. ఈ రూట్లలో రైళ్లను పునరుద్ధరించిన అధికారులు

MMTS Trains: నగరంలోని వివిధ ప్రాంతాల మధ్య ప్రయాణికులకు రవాణా సదుపాయాన్ని అందించే ఎంఎంటీఎస్‌ ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త తెలిపింది. పలు రూట్లలో నిలిచి పోయిన రైళ్ల సర్వీసులను పునరుద్ధరిస్తూ నిర్ణయం తీసుకున్నారు...

Hyderabad: MMTS ప్రయాణీకులకు గుడ్‌న్యూస్.. ఈ రూట్లలో రైళ్లను పునరుద్ధరించిన అధికారులు
Mmts Trains
Follow us

|

Updated on: Apr 09, 2022 | 12:50 PM

MMTS Trains: నగరంలోని వివిధ ప్రాంతాల మధ్య ప్రయాణికులకు రవాణా సదుపాయాన్ని అందించే ఎంఎంటీఎస్‌ ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త తెలిపింది. పలు రూట్లలో నిలిచి పోయిన రైళ్ల సర్వీసులను పునరుద్ధరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా మొత్తం 7 సర్వీసులను తిరిగి ప్రారంభించనున్నారు. పునరుద్ధరించిన సేవలు 11-04-2022 నుంచి అమల్లోకి రానున్నాయి. ఇదిలా ఉంటే గతంలో కరోనా కారణంగా చాలా రోజుల పాటు నిలిచిపోయిన ఎంఎంటీఎస్‌ సేవలు కరోనా తగ్గిన నేపథ్యంలో క్రమంగా పూర్తిగా అందుబాటులోకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా కొత్తగా మరో 7 సేవలను అధికారులు పునరుద్ధరిస్తూ నిర్ణయం తీసుకున్నారు..

పునరుద్ధరించిన సేవలు ఇవే..

* ఫలక్‌నుమా నుంచి లింగంపల్లి వెళ్లే 47156 నెంబర్‌ ట్రైయిన్‌. ఉదయం 11.15 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 12.45 గంటలకు చేరుతుంది.

* ఫలక్‌నుమా నుంచి రామచంద్రపురం వెళ్లే 472218 నెంబర్‌ ఎంఎంటీఎస్‌ రైలు. రాత్రి 09.05 గంటలకు బయలు దేరి, 11.05 గంటలకు చేరుతుంది.

* రామచంద్రపురం నుంచి ఫలక్‌నుమా వెళ్లే 47177 నెంబర్‌ ట్రైయిన్‌ ఉదయం 09.10 గంటలకు బయలు దేరి 11.05 గంటలకు చేరుతుంది.

* లింగంపల్లి నుంచి ఫలక్‌నుమా వెళ్లే 47185 రైలు మధ్యాహ్నం 02.55 గంటలకు బయలు దేరి, సాయంత్రం 04.25 గంటలకు చేరుతుంది.

* లింగంపల్లి నుంచి ఫలక్‌నుమా వెళ్లే 47217 రైలు రాత్రి 07.10 గంటలకు బయలు దేరి, 08.55 గంటలకు చేరుతుంది.

* ఫలక్‌నుమా నుంచి హైదరాబాద్‌ వెళ్లే 47201 నెంబర్‌ ట్రైయిన్‌ సాయంత్రం 04.35 గంటలకు బయలు దేరి 05.50 గంటలకు చేరుతుంది.

* హైదరాబాద్‌ నుంచి లింగం పల్లి వెళ్లే 47119 నెంబర్‌ ఎంఎంటీఎస్‌ రైలు సాయంత్రం 06.05 గంటలకి బయలు దేరి, 06.50 గంటలకి చేరుతుంది.

Mmts

Also Read: Tollywood : సీనియర్ నటుడు బాలయ్య కన్నుమూత .. విషాదంలో టాలీవుడ్

Medical Education in TN: ఆ విద్యార్ధులకు వైద్య విద్యలో 7.5 శాతం రిజర్వేషన్‌ సబబే.. మద్రాసు హైకోర్టు సంచలన తీర్పు

Super Mechanic Contest 2021: శ్రామికశక్తితోనే ఆత్మనిర్భర్‌ భారత్‌.. సూపర్ మెకానిక్ కాంటెస్ట్ ఈవెంట్‌లో కేంద్రమంత్రి