Super Mechanic Contest 2021: శ్రామికశక్తితోనే ఆత్మనిర్భర్ భారత్.. సూపర్ మెకానిక్ కాంటెస్ట్ ఈవెంట్‌లో కేంద్రమంత్రి
Super Mechanic Contest: సమాజంలో మంచి టాలెంట్ ఉన్నవారు ఎందరో ఉన్నారు. అలాంటివారు తమ ప్రతిభను బయట పెట్టలేకపోతున్నారు. మన శరీరంలో ఏదైనా ఆనారోగ్యం సంభవిస్తే దానిని
Super Mechanic Contest: సమాజంలో మంచి టాలెంట్ ఉన్నవారు ఎందరో ఉన్నారు. అలాంటివారు తమ ప్రతిభను బయట పెట్టలేకపోతున్నారు. మన శరీరంలో ఏదైనా ఆనారోగ్యం సంభవిస్తే దానిని బాగు చేసేందుకు వైద్యులు ఎంత అవసరమో.. మన వాహనంలో కూడా ఏదైనా సమస్య ఉంటే దానిని పరిష్కరించేందుకు మెకానిక్ కూడా అంతే అవసరం. ఎంతో మంది ప్రతిభగల మెకానిక్‌ల కోసం టీవీ9 నెట్‌వర్క్, క్యాస్ట్రల్ సంస్థ సంయుక్తంగా నిర్వహించిన సూపర్ మెకానిక్‌గా కాంటెస్ట్ నిర్వహించింది. దేశవ్యాప్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఎంతో ఆదరణ లభించింది. మెకానిక్ రంగంలో నైపుణ్యాలను పెంచడమే లక్ష్యంగా టీవీ9 నెట్ వర్క్, కాస్ట్రో నిర్వహించిన సూపర్ మెకానిక్ కాంటెస్ట్ నాలుగో ఎడిషన్ గతేడాది అక్టోబర్‌లో ప్రారంభమైంది. #SeekhengeJeetengeBadhenge థీమ్‌తో నిర్వహించిన ఈ కాంటెస్ట్‌లో ఏకంగా 1.41లక్షల మంది మెకానిక్‌లు రిజిస్ట్రేషన్ చేసుకొని తమ ప్రతిభను చూపించారు.
టీవీ9 నెట్ వర్క్, కాస్ట్రో నిర్వహించిన సూపర్ మెకానిక్ కాంటెస్ట్ లో వివిధ రౌండ్లు, సెషన్ల తర్వాత మొత్తం 50 మంది మెకానిక్‌లు ఫైనల్ రౌండ్ పోటీలకు అర్హత సాధించి.. టైటిల్ కోసం పోటీపడ్డారు. మెకానిక్‌ల ఫైనల్ పోటీలను ఢిల్లీ NCR లో జరిగే గ్రాండ్ ఫినాలే నిర్వహించి శుక్రవారం విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పాల్గొని విజేతలకు బహుమతులు అందించారు. కాస్ట్రోల్, టీవీ9 నెట్‌వర్క్ సంయుక్తంగా నిర్వహిస్తోన్న ఈ కార్యక్రమంపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రశంసలు కురిపించారు. ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ ప్రపంచ నైపుణ్యాల కేంద్రంగా అవతరించిందని తెలిపారు. నైపుణ్యం కలిగిన, శక్తివంతమైన శ్రామికశక్తి లేకుండా ఆత్మ నిర్భర్ భారత్‌ను సాధించలేమని పేర్కొన్నారు.
నైపుణ్యాలు & పరిశోధనల అభివృద్ధిలో భాగంగా విద్యా – పరిశ్రమల అనుసంధానానికి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుందన్నారు. 21వ శతాబ్దంలో యువత ప్రపంచానికి నాయకత్వం వహించేలా భారత ప్రభుత్వం విద్యావ్యవస్థను రూపకల్పన చేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీవీ9 నెట్‌వర్క్, కాస్ట్రో ప్రతినిధులు పాల్గొన్నారు. కాగా మెకానిక్స్ క్యాస్ట్రోల్ ఇండియా సూపర్ మెకానిక్ కాంటెస్ట్ గురించి మరింత సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
Today, Hon’ble Education Minister Shri @dpradhanbjp attended ‘TV9 Network Super Mechanic Contest’ event and congratulated all the participants & winners of the contest. #SeekhengeJeetengeBadhenge pic.twitter.com/cuCxduzbu2
— Ministry of Education (@EduMinOfIndia) April 8, 2022
Also Read: