Imran Khan: భారత్‌కు వ్యతిరేకంగా మాట్లాడే ధైర్యం ఏ దేశానికి లేదు.. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భావోద్వేగ వ్యాఖ్యలు!

భారతదేశం ఆత్మగౌరవ దేశమని. ఏ సూపర్ పవర్ కూడా ఆ దేశానికి నిబంధనలతో నియంత్రించలేదన్నారు. భారత్‌పై కుట్రలు చేసే ధైర్యం ఏ అగ్రరాజ్యానికి లేదని ఇమ్రాన్ స్పష్టం చేశారు.

Imran Khan: భారత్‌కు వ్యతిరేకంగా మాట్లాడే ధైర్యం ఏ దేశానికి లేదు.. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భావోద్వేగ వ్యాఖ్యలు!
Imran Khan
Follow us

|

Updated on: Apr 09, 2022 | 8:39 AM

Pakistan PM Imran Khan: వివాదాస్పద అవిశ్వాస తీర్మానం సందర్భంగా పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ శుక్రవారం రాత్రి జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా మరోసారి భారతదేశాన్ని(India) ప్రశంసిస్తూ.. అమెరికా(America)పై విరుచుకుపడ్డారు. అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌కు ఒక రోజు ముందు, ఇమ్రాన్ ఖాన్ దేశాన్ని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో భారతదేశం ఆత్మగౌరవ దేశమని. ఏ సూపర్ పవర్ కూడా ఆ దేశానికి నిబంధనలతో నియంత్రించలేదన్నారు. భారత్‌పై కుట్రలు చేసే ధైర్యం ఏ అగ్రరాజ్యానికి లేదని ఇమ్రాన్ స్పష్టం చేశారు. మన విదేశాంగ విధానం స్వేచ్ఛగా ఉండాలని అన్నారు. పాక్ విదేశాంగ విధానం భారత్‌లా ఉండాలని మరోసారి అన్నారు.

ఇమ్రాన్ ఖాన్ మరోసారి అమెరికా పేరు చెప్పి కుట్ర పన్నారని ఆరోపించారు. సీక్రెట్ కోడ్ కారణంగా కుట్ర లేఖను ప్రజల ముందు ఉంచలేనని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. ఇమ్రాన్‌ ఖాన్‌ను క్షమించలేనని లేఖలో రాశారని ఆయన అన్నారు. భారత్‌ను ఉద్దేశించి ఇమ్రాన్ ఖాన్ భావోద్వేగానికి లోనయ్యారు. నేను భారతదేశానికి వ్యతిరేకిని కాదు. అలాగే ఉక్రెయిన్ యుద్ధంలో భారత్‌ను ఎవరూ భయపెట్టలేరని అన్నారు. సార్వభౌమ దేశమైన భారతదేశానికి ఏ శక్తి షరతు విధించలేదన్నారు. భారతదేశంలో మనకు చాలా గౌరవం ఉందని అన్నారు. కశ్మీర్ సమస్య, ఆర్‌ఎస్‌ఎస్ కారణంగా సంబంధాలు ఖచ్చితంగా క్షీణించాయని అన్నారు. దిగుమతి చేసుకున్న ప్రభుత్వాన్ని అంగీకరించబోమని ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. అలాగే ఆదివారం సాయంత్రం వీధుల్లో బైఠాయించి నిరసనకు పిలుపునిచ్చారు.

నేను అమెరికాకు వ్యతిరేకిని కానని, అయితే కుట్రలకు వ్యతిరేకమని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. పాకిస్తాన్‌పై అమెరికా కుట్ర పన్నిందని అన్నారు. మా రాయబారి అమెరికా రాయబారితో మాట్లాడారు. షహబాజ్ షరీఫ్‌కు అన్నీ తెలుసునని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. డబ్బు తీసుకుంటాం కాబట్టి మమ్మల్ని గౌరవించడం లేదని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. ప్రతిపక్ష నేతలు డాలర్లకు అత్యాశతో ఉన్నారన్నారు. ఇప్పుడు సమాజం తన మతాన్ని రక్షించుకోవాలా వద్దా అని నిర్ణయించుకోవాలని కోరారు.

26 ఏళ్ల క్రితం పీటీఐ పార్టీని స్థాపించానని.. సుప్రీంకోర్టు నిర్ణయంతో నిరాశ చెందానని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. కోర్టు తీర్పు వెలువరించే ముందు సాక్ష్యాధారాలు చూసి ఉండాల్సింది. మరి విదేశీ కుట్ర విషయంలో కోర్టు ఎందుకు నోరు మెదపలేదు. పాకిస్థాన్‌లో ప్రజాస్వామ్యం హాస్యాస్పదంగా మారిందని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. ప్రతిపక్షాలను అమ్మేసారు. ఎంపీలను బహిరంగంగా కొనుగోలు చేస్తున్నారని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. పాకిస్థాన్ తనను తాను కాపాడుకోవాలని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. అలాగే మన రాయబారిని అమెరికా బెదిరించిందని, ఇది మన 22 కోట్ల మంది ప్రజలను అవమానించడమేనని అన్నారు. నేను ఎవరి కీలుబొమ్మను కాలేను అని ఇమ్రాన్ ఖాన్ స్పష్టం చేశారు.

Read Also…. Hindi Controversy: దేశం ఏకం కాదు.. విడిపోతుంది.. అమిత్ షా హిందీ వ్యాఖ్యలపై తమిళనాడు పార్టీల ఆగ్రహం