Railway News: తుక్కు అమ్మకాల్లోనూ భారీ ఆదాయం.. అరుదైన రికార్డును సృస్టించిన దక్షిణ మధ్య రైల్వే..
South Central Railway: ఆదాయ ఆర్జన విషయంలో దక్షిణ మధ్య రైల్వే మునుపెన్నడూ లేని విధంగా దూసుకుపోతోంది. కరోనా (Corona) విపత్కర పరిస్థితులను సైతం తట్టుకొని అరుదైన రికార్డులను...
Railway News: ఆదాయ ఆర్జన విషయంలో దక్షిణ మధ్య రైల్వే మునుపెన్నడూ లేని విధంగా దూసుకుపోతోంది. కరోనా (Corona) విపత్కర పరిస్థితులను సైతం తట్టుకొని అరుదైన రికార్డులను సృష్టిస్తోంది. ఇప్పటికే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సరుకు రవానాలో గొప్ప మైలు రాయిని అధిగమించిన విషయం తెలిసిందే. 2021-22 సంవత్సరంలో (2021 ఏప్రిల్ నుంచి 2022 మార్చి 17వ తేదీ వరకు) సరుకు రవాణాలో 112.51 మిలియన్ టన్నుల (ఎమ్‌టీల) లోడిరగ్ నిర్వహించడం ద్వారా రికార్డు స్థాయిలో రూ.10,000 కోట్ల ఆదాయాన్ని ఆర్జించి రికార్డు సృష్టించింది. ఇక మిషన్ ఎలక్ట్రిఫికేషన్ కూడా దూసుకుపోతోంది.
ఇదిలా ఉంటే దక్షిణ మధ్య రైల్వే తాజాగా మరో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. 2021-2022 ఆర్థిక ఏడాదిలో తుక్కు అమ్మకం ద్వారా రికార్డు స్థాయిలో ఆదాయాన్ని ఆర్జించింది. తుక్కు అమ్మకాల ద్వారా ఏకంగా రూ. 315 కోట్లు లభించడం విశేషం. దక్షిణ మధ్య రైల్వేలోని సికింద్రాబాద్ డివిజన్ మునుపెన్నడూ లేని విధంగా వేలం అమ్మకం ద్వారా మార్చి 2022లో ఒక్క రోజు రికార్డు స్థాయిలో రూ.5.71 కోట్లు పొందింది. దక్షిణ మధ్య రైల్వే ‘మిషన్ జీరో స్క్రాప్’ దిశగా గణనీయమైన పురోగతి సాధిస్తూ 2021-22 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో రూ. 315.05 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం 2020-21లో నిర్వహించిన తుక్కు అమ్మకం ద్వారా వచ్చిన ఆదాయాన్ని (రూ.308 కోట్లు) కూడా జోన్ అధిగమించింది.
దక్షిణ మధ్య రైల్వే తన వనరులను సముచితంగా ఉపయోగించుకుంటూ తుక్కు పదార్థాలను సేకరించిన వేంటనే తగిన కృషి చేస్తూ ఈ వేలం ద్వారా అమ్మకాలను చేపట్టింది. దక్షిణ మధ్య రైల్వేలోని సికింద్రాబాద్ డివిజన్ మునుపెన్నడూ లేని విధంగా మార్చి 2022లో ఒక్క రోజు వేలం అమ్మకంలో అత్యధికంగా రూ. 5.71 కోట్లను ఆర్జించింది. దక్షిణ మధ్య రైల్వే తుక్కు రహిత హోదా సాధించడంలో భారతీయ రైల్వేలో మార్గదర్శకంగా నిలిచింది.
ఇందుకు గుర్తింపుగా జోన్ గత 10 సంవత్సరాల నుంచి నిరాటంకంగా మెటీరియల్ నిర్వహణ రంగంలో రైల్వే బోర్డు వారి ఎఫీషియెన్సీ షీల్డ్ అవార్డును కైవసం చేసుకుంటోంది. ఇదే తరహా పద్ధతిలో వర్క్‌షాపులలో, లోకో షెడ్లలో, రైల్వే యూనిట్లలో, రైల్వే పరిసరాలలో తుక్కును తొలగిస్తూ ఆర్థిక వనరుల పెంపునకు దోహదపడే తగిన చర్యలు తీసుకున్నారు. దీనికి అదనంగా, భారత ప్రభుత్వ ‘స్వచ్ఛ భారత్ అభియాన్’ కార్యక్రమాన్ని ప్రోత్సాహించడంలో కూడా ఈ ప్రాజెక్టు భాగస్వామ్యంగా ఉంది.
భారతీయ రైల్వే వారి ఈ`ప్రొక్యూర్‌మెంట్ సిస్టం (ఐఆర్‌ఈపిఎస్) పోర్టల్‌లో ఆన్‌లైన్‌లో నిర్వహించే ఈ`వేలం ద్వారా దక్షిణ మధ్య రైల్వే తుక్కు అమ్మకం చేపట్టింది. దీంతో పారదర్శకత ఏర్పడడమే కాకుండా బిడ్డింగ్‌లో పోటీ కూడా పెరుగుతుంది. తుక్కు అమ్మకాల ద్వారా సంస్థకు ఆదాయం భారీగా పెరగడంపై దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ (ఇన్‌చార్జి) అరుణ్ కుమార్ జైన్ ఉద్యోగులను అభినందించారు. భవిష్యత్తులోనూ ఇదే కృషిని కొనసాగిస్తే మరిన్ని లక్ష్యాలను అధిగమించవచ్చని తెలిపారు. ఈ వేలం ప్రక్రియలో చెల్లింపు విధానం సజావుగా ఉంటుందని, రైల్వేతో పాటు బిడ్డర్ల సమయం, శ్రమ ఆదా అవుతుందని అరుణ్ తెలిపారు.
Also Read: Ashok Galla : ఈ కుర్ర హీరో మహేష్ బాబు నుంచి నేర్చుకుంది అదేనట.. ఆసక్తికర విషయం చెప్పిన అశోక్..
Sreemukhi: ఒంపు సొంపుల వయ్యారాలతో చూపు తిప్పుకోనివ్వకుండా బబ్లీ బ్యూటీ యాంకర్ శ్రీముఖి..
Perni Nani: ఏపీలో కొత్త మంత్రులపై క్లారిటీ ఇచ్చిన మంత్రి పేర్ని నాని.. ప్రమాణస్వీకారం ఎప్పుడంటే?