AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: నగరం‎లో పెరుగుతున్న కో లివింగ్ కల్చర్.. తస్మాత్ జాగ్రత్త.. ఈ పరిస్థితులు ఎదురవ్వొచ్చు..

కో లివింగ్ ఈ పదం చాలా అరుదుగా వింటుంటాము. కానీ ఇప్పుడు ఈ కో లివింగ్ కల్చర్ హైదరాబాద్ నగరంలో శరామామూలుగా మారింది. పెళ్లి కాకుండానే రిలేషన్ షిప్‎లో అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి ఓకే హాస్టల్ లేదా ప్లాట్ తీసుకొని ఉండటాన్ని కో లివింగ్ అంటారు. మన సంస్కృతి, సాంప్రదాయాలకు కాస్త భిన్నంగా అనిపించినా ప్రస్తుతం ఈ కో లివింగ్ కల్చర్ ట్రెండ్‎గా మారింది. అసలు ఈ కో లివింగ్ హాస్టల్స్‎కు ఎలాంటి అనుమతులు ఉంటాయి? వాటి పర్యవేక్షణ ఎవ్వరిది.? అనే అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Hyderabad: నగరం‎లో పెరుగుతున్న కో లివింగ్ కల్చర్.. తస్మాత్ జాగ్రత్త.. ఈ పరిస్థితులు ఎదురవ్వొచ్చు..
Co Living Culture
Peddaprolu Jyothi
| Edited By: |

Updated on: May 20, 2024 | 1:02 PM

Share

కో లివింగ్ ఈ పదం చాలా అరుదుగా వింటుంటాము. కానీ ఇప్పుడు ఈ కో లివింగ్ కల్చర్ హైదరాబాద్ నగరంలో శరామామూలుగా మారింది. పెళ్లి కాకుండానే రిలేషన్ షిప్‎లో అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి ఓకే హాస్టల్ లేదా ప్లాట్ తీసుకొని ఉండటాన్ని కో లివింగ్ అంటారు. మన సంస్కృతి, సాంప్రదాయాలకు కాస్త భిన్నంగా అనిపించినా ప్రస్తుతం ఈ కో లివింగ్ కల్చర్ ట్రెండ్‎గా మారింది. అసలు ఈ కో లివింగ్ హాస్టల్స్‎కు ఎలాంటి అనుమతులు ఉంటాయి? వాటి పర్యవేక్షణ ఎవ్వరిది.? అనే అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ నగరంలో కో లివింగ్ హాస్టళ్లు రోజురోజుకు పెరుగుతున్నాయి. అమీర్‎పేట్, ఎస్‎ఆర్ నగర్, మాదాపూర్, గచ్చిబౌళి, కేపీహెచ్‎బీ, రాయదుర్గం వంటి ఏరియాలో ఈ కో లివింగ్ కల్చర్ కాస్త ఎక్కువగా కనబడుతుంది. ముంబాయి, ఢిల్లీ, కోల్‎కత్తా, బెంగళూరు వంటి రాష్ట్రాల్లో ఈ తరహా లివింగ్ స్టైల్ ఉండేది. క్రమేపీ అది తెలుగు రాష్ట్రాలకు సైతం పాకింది. సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఇద్దరు మేజర్లు కలిసి ఉండడంలో లీగల్‎గా ఎలాంటి తప్పులేదని చెబుతున్నా.. ఈ కో లివింగ్ రిలేషన్స్ ద్వారా కొన్ని అబ్యూజ్, క్రైమ్స్‎కు దారి తీసే అవకాశాలు కూడా లేకపోలేదు.

కో లివింగ్ అంటూ యువత పెడుదోవ పడుతున్నారని అంటున్నారు సామాజిక వేత్తలు. ఇతర రాష్ట్రాల్లో ఉన్న కల్చర్‎ను హైదరాబాద్‎కు సైతం తీసుకువచ్చారని.. అమ్మాయిలు, అబ్బాయిలు ఓకే రూమ్‎లో ఉన్నంత సేపు ఎలాంటి సమస్యలు ఉండవు కానీ.. వారి మధ్య మనస్పర్ధలు వచ్చిన్పపుడు ఇద్దరి కలిసి ఉన్న ఫోటోలు, వీడియోలతో బెదిరింపులకు దిగడం వంటి ఘటనలు సైతం తెరపైకి వస్తున్నాయని అంటున్నారు. తల్లిదండ్రులకు తెలియకుండా యువత ఇలాంటి కో లివింగ్ రిలేషన్స్‎లో ఉంటున్నారని అది మంచిది కాదని అంటున్నారు సామాజికవేత్తలు. కో లివింగ్ హాస్టలు హైదరాబాద్ నగరంలో పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయని, సాధారణమైన హాస్టల్స్‎కు ఎలాంటి అనుమతులు, నిబంధనలు ఉంటాయో వీటికి కూడా అవే వర్తిస్తాయని అంటున్నారు న్యాయ నిపుణులు. పిల్లల కదలికలపై పేరెంట్స్ కూడా ఓ కన్నేయాలని సజెస్ట్ చేస్తున్నారు. కో లివింగ్ కల్చర్ ప్రస్తుతం నగరంలో చర్చనీయాంశంగా మారింది. కో లివింగ్ కల్చర్‎ను కొందరు సమర్ధిస్తే మరికొందరు మత్రం తస్మాత్ జాగ్రత్త అంటూ హెచ్చరిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..