Hyderabad: సూపర్ విమెన్… వైన్ షాపులో భర్తను కొట్టారని రఫ్పాడించింది.. వీడియో
మద్యం కొనేందుకు వెళ్లిన తన భర్తపై వైన్ షాపు సిబ్బంది దాడి చేసి తల పగల గొట్టారు. రక్తంతో ఇంటికి వచ్చిన భర్తనుచూసిన భార్య ఆగ్రహంతో రెచ్చిపోయింది. వెంటనే కొంతమందిని తీసుకుని వైన్ షాప్‌కు వెళ్లి సిబ్బందిపై దాడి చేసింది. అడ్డుకునేందుకు వచ్చిన పోలీసులను కూడా హడలెత్తించింది.
వైన్ షాప్ సిబ్బంది తన భర్తను కొట్టారని ఆగ్రహించిన భార్య వారిపై దాడి చేసిన ఘటన హైదరాబాద్ మధురానగర్‌లో జరిగింది. ఓ వ్యక్తి మద్యం కొనేందుకు షాప్‌కు వెళ్లగా.. పేమెంట్ విషయంలో మాటామాటా పెరిగి సిబ్బంది.. అతడితో గొడవకు దిగారు. ఈ క్రమంలో ఆ వ్యక్తి తల పగిలింది. ఇంటికొచ్చిన భర్తను చూసి ఆగ్రహంతో భార్య వైన్ షాప్ వద్దకు వెళ్లి నిలదీసింది. సిబ్బందిపై దాడి చేసి, మందు బాటిళ్లను ధ్వంసం చేసింది. దీంతో పోలీసులు సిబ్బందితో పాటు మహిళపై కేసు నమోదు చేశారు. ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగినట్లు తెలిసింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Published on: May 20, 2024 01:54 PM
వైరల్ వీడియోలు
Latest Videos