Amazon Workers: దుర్భర స్థితిలో అక్కడి అమెజాన్‌ ఉద్యోగులు.! తాజా సర్వేలో షాకింగ్‌ నిజాలు..

Amazon Workers: దుర్భర స్థితిలో అక్కడి అమెజాన్‌ ఉద్యోగులు.! తాజా సర్వేలో షాకింగ్‌ నిజాలు..

Anil kumar poka

|

Updated on: May 20, 2024 | 1:29 PM

ఈ-కామర్స్‌​ సంస్థ అమెజాన్‌లో కింది స్థాయి ఉద్యోగులు దుర్భర జీవితం గడుపుతున్నారని ఓ అధ్యయనంలో తెలిసింది. అమెజాన్‌ వేతనాలను గంటకు 15 డాలర్లకు పెంచిన ఐదు సంవత్సరాల తర్వాత, పరిశోధకులు చేసిన సర్వేలో సగం మంది వేర్‌హౌస్‌ వర్కర్లు తాము తిండికి, వసతికి కూడా ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు. అమెరికాలో అమెజాన్‌ ఉద్యోగుల పరిస్థితి మెరుగుపడిందా.. తిండి తింటున్నారా, ఆకలితో ఉంటున్నారా..

ఈ-కామర్స్‌​ సంస్థ అమెజాన్‌లో కింది స్థాయి ఉద్యోగులు దుర్భర జీవితం గడుపుతున్నారని ఓ అధ్యయనంలో తెలిసింది. అమెజాన్‌ వేతనాలను గంటకు 15 డాలర్లకు పెంచిన ఐదు సంవత్సరాల తర్వాత, పరిశోధకులు చేసిన సర్వేలో సగం మంది వేర్‌హౌస్‌ వర్కర్లు తాము తిండికి, వసతికి కూడా ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు. అమెరికాలో అమెజాన్‌ ఉద్యోగుల పరిస్థితి మెరుగుపడిందా.. తిండి తింటున్నారా, ఆకలితో ఉంటున్నారా.. అద్దె, ఇతర చెల్లింపులు చేయగలుగుతున్నారా వంటి అంశాలతో వారి ఆర్థిక శ్రేయస్సుపై యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయిస్ సెంటర్ ఫర్‌ అర్బన్ ఎకనామిక్ డెవలప్‌మెంట్ తాజాగా అధ్యయనాన్ని ప్రచురించింది. ఇందులో 53 శాతం మంది తిండికి కూడా కష్టాలు పడినట్లు తెలిపారు. ఇంటి అద్దెలు, ఇతర చెల్లింపులకు అవస్థలు పడినట్లు 48 శాతం మంది పేర్కొన్నారు.

సియాటిల్‌కు చెందిన వాల్‌మార్ట్ తర్వాత అమెరికాలో రెండవ అతిపెద్ద ప్రైవేట్ కంపెనీ అమెజాన్‌. యూఎస్‌ వేర్‌హౌసింగ్ పరిశ్రమ వర్క్‌ఫోర్స్‌లో అమెజాన్‌ది 29 శాతం వాటా. అమెజాన్‌ వేర్‌హౌస్‌లలో పనిచేసే ఉద్యోగులను సోషల్ మీడియా ప్రకటనల ద్వారా 98 ప్రశ్నలతో ఆన్‌లైన్ సర్వే చేసింది అధ్యయన బృందం. యూఎస్‌ వ్యాప్తంగా 42 రాష్ట్రాల్లోని మొత్తం 1,484 మంది కార్మికుల నివేదికను విడుదల చేసింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.