Hyderabad: హైదరాబాద్‌లో ఆకాశ వంతెన.. అందుబాటులోకి రానున్న మరో అద్భుత నిర్మాణం..

భాగ్యనగరంలో మరో అద్భుత నిర్మాణం అందుబాటులోకి రానుంది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండిఏ) త్వరలో ఇన్నర్ రింగ్ రోడ్డు ఉప్పల్ చౌరస్తా వద్ద పాదచారుల రక్షణ కోసం నలువైపుల రోడ్డు దాటేందుకు వీలుగా ఆకాశ వంతెన స్కైవాక్(బోర్డ్ వాక్)ను అందుబాటులోకి తీసుకురానుంది...

Hyderabad: హైదరాబాద్‌లో ఆకాశ వంతెన.. అందుబాటులోకి రానున్న మరో అద్భుత నిర్మాణం..
Uppal Sky Walk
Follow us
Narender Vaitla

|

Updated on: Apr 26, 2023 | 5:27 PM

భాగ్యనగరంలో మరో అద్భుత నిర్మాణం అందుబాటులోకి రానుంది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండిఏ) త్వరలో ఇన్నర్ రింగ్ రోడ్డు ఉప్పల్ చౌరస్తా వద్ద పాదచారుల రక్షణ కోసం నలువైపుల రోడ్డు దాటేందుకు వీలుగా ఆకాశ వంతెన స్కైవాక్(బోర్డ్ వాక్)ను అందుబాటులోకి తీసుకురానుంది. సుమారు రూ.25 కోట్ల వ్యయంతో రూపుదిద్దుకుంటున్న ఉప్పల్ స్కైవాక్ ప్రాజెక్టు పనులు చివరి దశకు చేరుకున్నాయి. రాబోయే వంద సంవత్సరాలకు పైగా ఉపయోగపడేలా ఉప్పల్ స్కైవాక్ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. ఉప్పల్ స్కైవాక్ ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో సుమారు వెయ్యి టన్నులకుపైగా స్ట్రక్చరల్ స్టీల్ వాడారు.

ఉప్పల్ చౌరస్తాలో రోడ్డు దాటే సమయంలో తరచుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతుండడం, ప్రమాదాలలో ఎక్కువ శాతం మహిళలు, పాఠశాల విద్యార్థులు గాయపడుతున్న అంశాలను దృష్టిలో పెట్టుకొని అక్కడ పాదచారుల వంతెన చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగానే వెంటనే స్కై వాక్‌ ప్రాజెక్టు పనుల నిర్మాణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం హెచ్ఎండిఏకు అప్పగించింది. ఈ నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAIL), వైజాగ్ స్టీల్ (విశాఖపట్నం) తోపాటు జిందాల్ స్టీల్ కంపెనీలకు చెందిన స్ట్రక్చరల్ స్టీల్‌ను ఉపయోగించారు.

Uppal1

ఇవి కూడా చదవండి

ప్రాజెక్టులో భాగంగా భాగంగా ప్రజలకు 8 లిఫ్టులు, 6 స్టేర్ కేసులు, 4 ఎస్కిలేటర్లు అందుబాటులో ఉంటాయి. ఈ స్కై వాక్‌ మొత్తం 37 పిల్లర్లు, 660 మీటర్ల పొడవు ఉంటుంది. నిజానికి 2020 ఏడాది చివర్లో ఉప్పల్ స్కైవాక్ ప్రాజెక్టు పనులు మొదలైనప్పటికీ వరుసగా రెండు సంవత్సరాల పాటు కోవిడ్ పరిస్థితుల కారణంగా పనుల్లో జాప్యం జరిగింది. ఉప్పల్ చౌరస్తాలో నలువైపులా ప్రతినిత్యం సుమారు 20 వేలమందికిపైగా పాదచారులు రోడ్డు దాటుతుంటారు. ఉప్పల్ స్కై వాక్ అందుబాటులోకి వస్తే.. ఉప్పల్ చౌరస్తాలో ట్రాఫిక్ సిగ్నల్ ఫ్రీ గా వాహనాల రాకపోకలకు అవకాశం లభిస్తుంది.

Uppal2

Uppal3

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..