AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బంగారాన్ని మించి.. ప్రపంచాన్ని శాసించనున్న రెడ్ గోల్డ్ .. ఉత్పత్తిలో టాప్ దేశాలు ఇవే..

Copper: మన వంటింట్లో పూజా సామాగ్రిగా కనిపించే రాగి.. నేడు ప్రపంచ దేశాల మధ్య రసవత్తరమైన పోటీకి కేంద్రబిందువైంది. కేవలం విద్యుత్ వైర్లకే పరిమితం కాకుండా.. ఆకాశంలో ఎగిరే ఫైటర్ జెట్ల నుండి, పర్యావరణానికి మేలు చేసే సోలార్, విండ్ పవర్ ప్లాంట్ల వరకు ప్రతిచోటా ఇప్పుడు రాగి అనివార్యంగా మారింది.

బంగారాన్ని మించి.. ప్రపంచాన్ని శాసించనున్న రెడ్ గోల్డ్ .. ఉత్పత్తిలో టాప్ దేశాలు ఇవే..
Top 7 Copper Producing Countries
Krishna S
|

Updated on: Feb 24, 2026 | 5:20 PM

Share

ఆధునిక ప్రపంచంలో రాగి కేవలం ఒక లోహం మాత్రమే కాదు.. భవిష్యత్ ఇంధన అవసరాలకు వెన్నెముకగా మారింది. ఇది విద్యుత్‌ను చాలా వేగంగా సరఫరా చేస్తుంది. పైగా బ్యాక్టీరియాని దరిచేరనివ్వదు. అందుకే ఇప్పుడు సోలార్ పవర్, విండ్ ఎనర్జీ వంటి రంగాల్లో దీనికి విపరీతమైన డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలో 2025 ఏడాదికి గాను ప్రపంచవ్యాప్తంగా రాగి ఉత్పత్తిలో టాప్ 7 దేశాల ఏవి అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

చిలీ: రాగి సామ్రాజ్యానికి రారాజు

ప్రపంచ రాగి ఉత్పత్తిలో 23 శాతం వాటాతో చిలీ మొదటి స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. 2025లో ఈ దేశం ఏకంగా 5.3 మిలియన్ మెట్రిక్ టన్నుల రాగిని ఉత్పత్తి చేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద గని అయిన ఎస్కోండిడా ఇక్కడే ఉండటం విశేషం.

కాంగో: సంచలన వృద్ధి

డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో అనూహ్య వృద్ధిని నమోదు చేస్తూ రెండో స్థానానికి చేరుకుంది. 2024లో 3.3 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉత్పత్తితో ప్రపంచ మార్కెట్‌లో 11 శాతం వాటాను కైవసం చేసుకుంది. 2023తో పోలిస్తే ఇక్కడ ఉత్పత్తి గణనీయంగా పెరగడం విశేషం.

పెరూ: స్వల్ప తగ్గుదల

గతంలో రెండో స్థానంలో ఉన్న పెరూ, ఈ ఏడాది 2.6 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉత్పత్తితో మూడో స్థానానికి పరిమితమైంది. సెర్రో వెర్డే గనిలో నిర్వహణ పనులు మరియు ఉత్పత్తి తగ్గుదల దీనిపై ప్రభావం చూపింది.

చైనా: శుద్ధి చేసిన రాగిలో ఆధిపత్యం

ఉత్పత్తిలో 1.8 మిలియన్ మెట్రిక్ టన్నులతో నాలుగో స్థానంలో ఉన్నప్పటికీ, శుద్ధి చేసిన రాగి విషయంలో చైనాదే అగ్రపీఠం. ప్రపంచ ఉత్పత్తిలో 44 శాతం వాటా చైనాదే కావడం గమనార్హం. అలాగే ఈ దేశం వద్ద అత్యధికంగా 190 మిలియన్ మెట్రిక్ టన్నుల నిల్వలు ఉన్నాయి.

ఇండోనేషియా: కొత్త మైలురాయి

ఇండోనేషియా ఈ ఏడాది 1.1 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉత్పత్తితో ఐదో స్థానానికి ఎగబాకింది. అమెరికా, రష్యాలను వెనక్కి నెట్టి ఈ ఘనత సాధించింది. ఇక్కడి గ్రాస్‌బర్గ్ కాంప్లెక్స్ దేశంలోనే అతిపెద్ద గనిగా కొనసాగుతోంది.

యునైటెడ్ స్టేట్స్

అమెరికాలో రాగి ఉత్పత్తి క్రమంగా తగ్గుతోంది. 2024లో 1.1 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉత్పత్తి నమోదైంది. అరిజోనా రాష్ట్రం దేశీయ ఉత్పత్తిలో 70 శాతం వాటాను అందిస్తోంది.

రష్యా: పెరుగుతున్న ఉత్పత్తి

రష్యా తన ఉత్పత్తిని 930,000 మెట్రిక్ టన్నులకు పెంచుకుని ఏడో స్థానంలో నిలిచింది. సైబీరియాలోని ఉడోకాన్ గని ద్వారా 2028 నాటికి ఉత్పత్తిని మరింత పెంచాలని రష్యా లక్ష్యంగా పెట్టుకుంది.

పర్యావరణ హితమైన సౌర, పవన శక్తి వైపు ప్రపంచం మళ్లుతున్న తరుణంలో రాగికి డిమాండ్ మరింత పెరగనుంది. ప్రస్తుతానికి చిలీ అగ్రస్థానంలో ఉన్నప్పటికీ, కాంగో వంటి ఆఫ్రికన్ దేశాలు ఇస్తున్న పోటీ మార్కెట్ సమీకరణాలను మారుస్తోంది.

Follow Us