Mutton Bone Soup: అబ్బ.. మటన్ బోన్ సూప్.. ఈ లాభాలు తెలిస్తే తెపాళ్ల లేపాల్సిందే..
మన సాంప్రదాయక వంటకాల్లో మటన్ బోన్ సూప్ (ఎముకల చారు లేదా బొక్కల చారు) ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. ఈ సూప్‌ను పూర్వీకులు సైతం మంచి ఆరోగ్యం కోసం వినియోగించారు. దీని తయారీకి ముఖ్యంగా మేక లేదా గొర్రె కాళ్ల ఎముకలు.. ఇంకా శరీర భాగాల్లోని ఎముకలను ఉపయోగించాలి.

నాన్‌వెజ్ ప్రియులు మటన్, చికెన్ అనగానే లొట్టలేసుకుంటూ మరి తింటారు.. వాస్తవానికి నాన్‌వెజ్ లో ఎన్నో రకాలున్నాయి.. వీటిని పలు రకాలుగా వండుకోని తింటారు. మటన్ విషయానికి వస్తే.. మటన్.. మటన్ లివర్, పాయ, తిల్లీ, తలకాయ, నల్లా.. ఇలా అన్ని స్పేషలే.. ఇంకా.. బోన్స్ (ఎముకలు) కూడా మంచి పోషకాలతో నిండి ఉంటాయి.. మటన్ బోన్ సూప్ (Mutton Bone Soup) ఎముకలను బలోపేతం చేసే కాల్షియం, కీళ్ల ఆరోగ్యానికి అవసరమైన కొల్లాజెన్, రోగనిరోధక శక్తిని పెంచే పోషకాల గని.. ఇది శరీర నొప్పులను తగ్గించి, జలుబు/ఫ్లూ నుండి తక్షణ ఉపశమనం అందిస్తుంది.. ఇంకా శారీరక శక్తిని అందిస్తుంది.
మన సాంప్రదాయక వంటకాల్లో మటన్ బోన్ సూప్ (ఎముకల చారు లేదా బొక్కల చారు) ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. ఈ సూప్‌ను పూర్వీకులు సైతం మంచి ఆరోగ్యం కోసం వినియోగించారు. దీని తయారీకి ముఖ్యంగా మేక లేదా గొర్రె కాళ్ల ఎముకలు.. ఇంకా శరీర భాగాల్లోని ఎముకలను ఉపయోగించాలి. ఎందుకంటే ఇవి అధిక పోషకాలను అందిస్తాయి. అయితే.. నడుము పూసలు లేదా పక్కటెముకలను కూడా ఉపయోగించవచ్చు..
మన పూర్వీకులు విషజ్వరం నుండి కోలుకున్నప్పుడు, శస్త్రచికిత్స తర్వాత వేగంగా కోలుకోవడానికి, ఎముకలు విరిగినప్పుడు అవి త్వరగా మానడానికి బోన్ సూప్‌ను ఇచ్చేవారు. ఇది తేలికగా జీర్ణమయ్యే ఆహారంగా, శారీరక పునరుద్ధరణకు తోడ్పడుతుంది. బోన్ సూప్‌లో మెగ్నీషియం, పొటాషియం వంటి ముఖ్యమైన ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. అనారోగ్యం నుండి కోలుకుంటున్న వారు, ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన వారు, ఎముకలు విరిగి ప్లేట్లు లేదా రాడ్లు వేయించుకున్న వారు, మోకాలి లేదా తుంటి మార్పిడి చేయించుకున్న వారికి ఇది అత్యంత ప్రయోజనకరమైనది. పిల్లలు, పెద్దలు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, వృద్ధులు అందరూ ఈ సూప్‌ను తీసుకోవచ్చు.
బోన్ సూప్ అందించే పది ప్రధాన ఆరోగ్య ప్రయోజనాలు..
ఎముకల పటుత్వం: ఇది ఎముకలను బలపరుస్తుంది. పిల్లలు దీనిని తాగడం వల్ల ఎత్తు పెరుగుతారు. పాల దంతాలు ఊడి శాశ్వత దంతాలు త్వరగా రావడానికి కూడా సహాయపడుతుంది. వృద్ధులలో ఎముక పెళుసుదనాన్ని తగ్గించి, చిన్న దెబ్బలకే తుంటి లేదా మణికట్టు ఎముకలు విరగకుండా కాపాడుతుంది.
చర్మ సౌందర్యం: చర్మాన్ని కాంతివంతంగా, నిగనిగలాడేలా చేస్తుంది. మొటిమలు, పొక్కులు, గుల్లలు, సెగ్గడ్డలు, గజ్జి, తామర వంటి చర్మ సమస్యలను నివారిస్తుంది.
కేశ సౌందర్యం: వెంట్రుకలను నిగనిగలాడేలా, నల్లగా, ఒత్తుగా, మహిళల్లో పొడుగ్గా పెరగడానికి సహాయపడుతుంది. చుండ్రును నివారించి, వెంట్రుకలు రాలకుండా కాపాడుతుంది.
గోళ్ళ ఆరోగ్యం: గోళ్ళు పుచ్చిపోవడాన్ని (ముఖ్యంగా మధుమేహం ఉన్నవారిలో) నివారిస్తుంది. చేతివేళ్లు, కాలి వేళ్ళ గోళ్ళ సౌందర్యాన్ని పరిరక్షిస్తుంది.
కండపుష్టి: క్రీడాకారులు, బౌన్సర్లు, సిక్స్ ప్యాకర్లు, బరువులు ఎత్తేవారికి అవసరమైన కండపుష్టిని అందిస్తుంది.
కీళ్ళ ఆరోగ్యం: మోకాళ్ళలో గుజ్జు తగ్గిపోవడం వల్ల వచ్చే నొప్పులను తగ్గిస్తుంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్, గౌట్ వల్ల కలిగే కీళ్ళ నొప్పులను నివారించడంలో క్రియాశీలక పాత్ర పోషిస్తుంది.
గుండె ఆరోగ్యం: గుండె కండరాల పనితీరును మెరుగుపరుస్తుంది. కరోనరీ ధమని ద్వారా గుండె కండరాలకు రక్త ప్రసరణను పెంచి, గుండెపోటును నివారిస్తుంది.
బరువు తగ్గడం: అధిక బరువు లేదా స్థూలకాయం ఉన్నవారు బోన్ సూప్ తాగడం ద్వారా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
నిద్ర మెరుగుదల: నిద్రలేమి సమస్యతో బాధపడేవారికి సహజసిద్ధంగా నిద్ర పట్టేలా చేస్తుంది. నిద్రమాత్రలు లేదా మద్యంపై ఆధారపడకుండా మంచి నిద్రను ప్రోత్సహిస్తుంది.
జీర్ణశక్తి మెరుగుదల: జీర్ణశక్తిని పెంపొందిస్తుంది. జఠర రసము, క్లోమ రసము, పైత్యరసము వంటి జీర్ణరసాల ఉత్పత్తిని పెంచి, జీర్ణ ప్రక్రియను క్రమబద్ధీకరిస్తుంది. ఇది ఆకలిని కూడా పెంచే అపటైజర్‌గా పనిచేస్తుంది.
ఈ ఆరోగ్య ప్రయోజనాలను పొందడానికి, వారానికి కనీసం ఒకసారి ఎముకల (బోన్) సూప్ తాగాలని నిపుణులు చెబుతున్నారు.
బోన్ సూప్ ఇలా తయారు చేసుకోండి..
ముందుగా మటన్ ఎముకలను (బోన్ మ్యారోతో ఉన్నవి) నీటితో బాగా శుభ్రం చేసుకోవాలి. ప్రెజర్ కుక్కర్‌లో సన్నగా తరిగిన ఉల్లిపాయ, టొమాటో, అల్లం-వెల్లుల్లి పేస్ట్, పసుపు, గరం మసాలా తగినంత ఉప్పు వేసి మగ్గనివ్వాలి.. ఆ తర్వాత శుభ్రం చేసిన ఎముకలు వేయ్యాలి. అనంతరం తగినన్ని నీళ్లు పోసి, కుక్కర్ మూత పెట్టి, మీడియం మంటపై 20-25 నిమిషాల పాటు లేదా 4-5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. ఆ తర్వాత.. మిరియాల పొడి.. కొత్తిమీర చల్లి.. వేడి తగ్గిన తర్వాత.. సర్వ్ చేసుకోవాలి..
గమనిక: ఈ వార్తా కథనం కేవలం అవగాహన కోసం మాత్రమే.. ఏమైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
