వందల రోగాలకు ఇదొక్కట్టే మందు! ఉదయాన్నే ఒక్కషాట్ చాలు..
19 June 2026
Jyothi Gadda
ఈ రోజుల్లో మారుతున్న జీవనశైలి, కలుషిత ఆహారం వల్ల ప్రతి ఒక్కరూ ఏదో ఒక ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నారు. అయితే, వీటన్నింటికీ వంటిట్లోనే లేదా ప్రకృతి సిద్ధంగా లభించే ఒకే ఒక్క పరిష్కారం గోధుమ గడ్డి రసం.
గోధుమ గడ్డిలో దాదాపు 70 శాతం క్లోరోఫిల్ ఉంటుంది. ఇది శరీరంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచడానికి అద్భుతంగా సహాయపడుతుంది. అందుకే దీనిని గ్రీన్ బ్లడ్ అని కూడా అంటారు.
ప్రకృతి మనకు ప్రసాదించిన అద్భుతమైన ఔషధాలలో గోధుమ గడ్డి (Wheatgrass) ఒకటి. ఇది కాలేయాన్ని (Liver) శుభ్రపరిచి, రక్తంలో పేరుకుపోయిన హానికరమైన వ్యర్థాలను, టాక్సిన్స్‌ను బయటకు పంపుతుంది.
ఇందులో విటమిన్-ఎ, సి, ఇ, కె లతో పాటు బి-కాంప్లెక్స్ మరియు ఐరన్, కాల్షియం, మెగ్నీషియం వంటి కీలక ఖనిజాలు ఉంటాయి. ఇవి శరీరానికి కావలసిన పోషకాలను అందించి, వ్యాధినిరోధక శక్తిని (Immunity) బలోపేతం చేస్తాయి.
అలాగే, ఇందులో క్యాలరీలు తక్కువగా ఉండి, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది మెటబాలిజాన్ని పెంచి, శరీరంలోని అదనపు కొవ్వును కరిగించి బరువు తగ్గడానికి తోడ్పడుతుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
కడుపు ఉబ్బరం, గ్యాస్, అసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలతో బాధపడేవారికి గోధుమ గడ్డి రసం చక్కటి ఔషధం. ఇందులో ఉండే ఎంజైములు మనం తినే ఆహారాన్ని సులభంగా జీర్ణం అయ్యేలా చూస్తాయి. కడుపులోని అల్సర్లను తగ్గిస్తుంది.
గోధుమ గడ్డిని ఇంట్లోనే చిన్న కుండీలలో సులభంగా పెంచుకోవచ్చు. ఏడు రోజుల పాటు పెరిగిన గడ్డిని కట్ చేసి, కొద్దిగా నీళ్లు పోసి మిక్సీ పట్టి రసం తీసుకోవాలి.
ఈ రసాన్ని ఉదయాన్నే పరగడుపున తాగడం వల్ల పూర్తి స్థాయి ప్రయోజనాలు అందుతాయి. రుచి కోసం ఇందులో కొద్దిగా నిమ్మరసం లేదా తేనె కలుపుకోవచ్చు. ప్రారంభంలో తక్కువ పరిమాణంలో (30 ml) తీసుకుంటూ క్రమంగా పెంచడం మంచిది.