రోజూ ఉదయం నిమ్మకాయ నీళ్లు తాగడం ఆరోగ్యానికి నిజంగా మంచిదేనా..?
Krishna
19 June 2026
ఉదయాన్నే నీటిలో నిమ్మరసం కలుపుకుని తాగడం వల్ల కాలేయంలో పిత్త రసం ఉత్పత్తి పెరుగుతుంది. ఇది రోజంతా మనం తినే ఆహారం సులభంగా అరగడానికి, గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు రాకుండా చేయడానికి సహాయపడుతుంది.
జీర్ణక్రియ మెరుగు
నిమ్మకాయలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి, సీజనల్ గా వచ్చే జలుబు, దగ్గు, వివిధ రకాల ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడుతుంది.
రోగనిరోధక శక్తి
రాత్రంతా నిద్రపోవడం వల్ల శరీరం డీహైడ్రేట్‌కు గురవుతుంది. ఉదయాన్నే ఈ నీటిని తాగడం వల్ల శరీరం త్వరగా హైడ్రేట్ అవ్వడమే కాకుండా బాడీలోని వ్యర్థాలు మూత్రం రూపంలో బయటకు వెళ్లిపోతాయి
టాక్సిన్స్ తొలగింపు
నిమ్మరసంలో ఉండే పెక్టిన్ అనే ఫైబర్ ఆకలిని నియంత్రిస్తుంది. క్రమం తప్పకుండా నిమ్మకాయ నీళ్లు తాగడం వల్ల శరీరంలో మెటబాలిజం రేటు పెరిగి, కేలరీలు వేగంగా కరిగి బరువు తగ్గడానికి రూట్ క్లియర్ అవుతుంది.
బరువు తగ్గడం
ఇందులోని విటమిన్ సి శరీరంలోని రక్తాన్ని శుద్ధి చేస్తుంది. దీనివల్ల చర్మంపై ఉండే మొటిమలు, మచ్చలు, ముడతలు తగ్గి.. ముఖం సహజంగా, కాంతివంతంగా మెరుస్తుంది.
చర్మ సౌందర్యం
నిమ్మకాయలోని యాసిడ్ గుణాలు నోట్లోని బ్యాక్టీరియాను నశింపజేస్తాయి. ఉదయాన్నే దీనిని తాగడం వల్ల దుర్వాసన తగ్గి, శ్వాస ఫ్రెష్‌గా మారుతుంది. అయితే పంటి ఎనామిల్ దెబ్బతినకుండా తాగాక మంచి నీళ్లతో పుక్కిలించాలి.
నోటి దుర్వాసన
నిమ్మరసంలోని నెగటివ్ చార్జ్డ్ అయాన్లు జీర్ణవ్యవస్థలోకి ప్రవేశించినప్పుడు శరీరానికి తక్షణ శక్తిని ఇస్తాయి. ఇది ఉదయాన్నే వచ్చే బద్ధకాన్ని వదిలించి, రోజంతా యాక్టివ్‌గా ఉండేలా మూడ్‌ను రిఫ్రెష్ చేస్తుంది.
ఇన్‌స్టంట్ ఎనర్జీ
నిమ్మకాయలో ఉండే సిట్రిక్ యాసిడ్ కిడ్నీలలో కాల్షియం చేరడం వల్ల ఏర్పడే రాళ్లను కరిగించడంలో, కొత్తగా రాళ్లు ఏర్పడకుండా నిరోధించడంలో కీలక పాత్ర పోషిస్తుందని వైద్యులు చెబుతున్నారు.