AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: ఓ ఇంటిలో గుప్పుమన్న ఘాటైన వాసన.. ఏంటా అని చూడగా దిమ్మతిరిగింది.!

పాతబస్తీ ఉప్పుగూడలో భారీగా గంజాయి పట్టుబడింది. సుమారు రూ. 5లక్షల విలువచేసే 14 కేజీల గంజాయిని శంషాబాద్ ఎస్ఓటీ పోలీసులు సీజ్ చేశారు. ఈ ఘటనలో ఇద్దరు మహిళలను అరెస్ట్ చేయగా.. మరో ప్రధాన నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు. వారి వద్ద నుంచి గంజాయి.. ఇంతకీ అసలేం జరిగిందంటే.?

Hyderabad: ఓ ఇంటిలో గుప్పుమన్న ఘాటైన వాసన.. ఏంటా అని చూడగా దిమ్మతిరిగింది.!
Representative Image
Noor Mohammed Shaik
| Edited By: |

Updated on: Apr 02, 2024 | 6:23 PM

Share

పాతబస్తీ ఉప్పుగూడలో భారీగా గంజాయి పట్టుబడింది. సుమారు రూ. 5లక్షల విలువచేసే 14 కేజీల గంజాయిని శంషాబాద్ ఎస్ఓటీ పోలీసులు సీజ్ చేశారు. ఈ ఘటనలో ఇద్దరు మహిళలను అరెస్ట్ చేయగా.. మరో ప్రధాన నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు. వారి వద్ద నుంచి గంజాయి, ఓ కారు, రెండు మోటర్ సైకిళ్లతో పాటు రెండు మొబైల్స్ సీజ్ చేశారు. గంజాయిని చిన్నచిన్న ప్యాకెట్స్ లో ప్యాకింగ్ చేసి సదరు మహిళలు విద్యార్ధులకు విక్రయిస్తున్నట్లుగా గుర్తించారు.

వివరాల్లోకి వెళ్తే.. చెడు వ్యసనాలకు బానిసై ఇంట్లో నుంచి వచ్చేసిన శ్రీనివాస్ చారి అనే వ్యక్తి.. గత కొద్దిరోజులుగా సంతోష్ నగర్‌లో ఓ అపార్ట్‌మెంట్‌లో అద్దెకు ఉంటున్నాడు. అతడు తరచూ ఏపీలోని మచిలీపట్నం వెళ్లి వస్తుండేవాడు. ఈ క్రమంలోనే ఈజీ మనీకి ఆశపడి గంజాయి దందాలో దిగాడు. ఇతర ప్రాంతాల నుంచి గంజాయిని హైదరాబాద్‌కు తరలించి.. యువతను టార్గెట్ చేసి విక్రయిస్తున్నాడు. ఇదిలా ఉండగా మంగళవారం ఉదయం గంజాయి కావాలని శ్రీనివాస్‌ను ఓ వ్యక్తి కలిశాడు. ఈ క్రమంలోనే అతడ్ని పాతబస్తీలో భయ్యాలాల్ నగర్‌లో ఉండే తలిదండ్రుల ఇంటికి రావాల్సిందిగా శ్రీనివాస్ చారి సూచించాడు. అనంతరం 14 కేజీల గంజాయి తీసుకుని అక్కడికి శ్రీనివాస్ చారి చేరుకున్నాడు. ఇంట్లో గంజాయి పెట్టి మాట్లాడుతుండగా పక్కింటి వ్యక్తి ఒకరు SOT పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందించాడు. వెంటనే శంషాబాద్ SOT పోలీసులు ఇంటిపై దాడి చేసి గంజాయి పట్టుకున్నారు. పోలీసుల రాకను గమనించిన శ్రీనివాస్ చారి ఇంటిపై నుంచి కిందకు దూకి పారిపోయాడు. శ్రీనివాస్ చారికి ఆశ్రయం ఇచ్చిన తల్లితో పాటు మరో యువతిని అదుపులోకి తీసుకుని ఛత్రినాక పోలీసులకు అప్పగించారు. కాగా, నిందితులపై ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.