Hyderabad: నైటీలో వచ్చి చోరీ చేసిన టక్కులాడి.. చివరకు మాములు ట్విస్ట్ కాదు

దొంగలు ఈ మధ్య బాగా ఇస్మార్ట్ అయ్యారు. కొట్టేయడానికి కూడా క్రియేటివిటీ వాడుతున్నారు. అయితే పోలీసులు ఏమన్నా తక్కువా చెప్పండి. టెక్నికల్ సపోర్ట్‌తో మోనార్క్ గాళ్లను ఈజీగానే పట్టుకుంటున్నారు. తాజాగా.....

Hyderabad: నైటీలో వచ్చి చోరీ చేసిన టక్కులాడి.. చివరకు మాములు ట్విస్ట్ కాదు
Theft
Follow us
Ram Naramaneni

|

Updated on: May 31, 2023 | 7:33 PM

నైట్.. నైటీలో ఫేస్ కవర్ చేసి ఓ మహిళ  ఆ ప్రాంతానికి వచ్చింది.  సెల్​ఫోన్ల షాపులోకి దూరి  లక్షల విలువైన సెల్‌ఫోన్లను చోరీచేసింది. సికింద్రాబాద్‌లో ఈ ఘటన వెలుగుచూసింది. ఫిర్యాదు అందుకున్న అధికారులు దర్యాప్తు షురూ చేశారు. అయితే ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే.. ఈ ఘటన జరిగిన తర్వాత ఆ షాపు సెక్యూరిటీ గార్డ్ సెలవు పెట్టి సొంతూరు వెళ్లాడు. ఇంకేముంది పోలీసులకు మేజర్ క్లూ దొరికింది. అతడిని అదుపులోకి తీసుకుని.. విచారించగా తానే దొంగనని ఒప్పుకున్నాడు.

మహంకాళి పోలీస్​స్టేషన్ పరిధిలో ఎస్​డీ రహదారిలో ఉన్న మొబైల్ దుకాణంలో సెక్యూరిటీ గార్డ్​గా పనిచేస్తున్న యాకయ్య.. అమ్మాయి వేషధారణలో వచ్చి అదే షాపులో సెల్​ఫోన్లను కొట్టేశాడు. షాపు సీసీ కెమెరాలు పనిచేయకపోవడాన్ని అదునుగా మార్చుకుని పని కానిచ్చేశాడు. అయితే అతడు చేసిన తప్పు ఏంటంటే.. దొంగతనం అనంతరం.. తన సొంతూరు మహబూబాబాద్ జిల్లా తొర్రూర్​ వెళ్లాడు. దీంతో పోలీసులకు అతడిపై అనుమానం కలిగింది. అదుపులోకి తీసుకుని విచారించగా.. తాను ఆ ఫోన్లను చోరీ చేసినట్లు ఒప్పుకున్నాడు. అతడి వద్ద నుంచి రూ.8 లక్షల విలువైన సెల్​ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం