Hyderabad: స్పెషల్ అట్రాక్షన్‌గా వన్యప్రాణులు.. పబ్‌లో ఎక్స్‌ట్రాలు చేసినవారికి మూడింది

జోరా పబ్‌పై ఉక్కుపాదం మోపింది పోలీస్‌ డిపార్ట్‌ మెంట్‌. జంతు ప్రదర్శనను సీరియస్‌గా తీసుకుంది. నిర్వాహకులతోపాటు.. వణ్యప్రాణులను సప్లై చేసినవారిపైనా కేసులు నమోదు చేసింది.

Hyderabad: స్పెషల్ అట్రాక్షన్‌గా వన్యప్రాణులు.. పబ్‌లో ఎక్స్‌ట్రాలు చేసినవారికి మూడింది
Xora Pub
Follow us
Ram Naramaneni

|

Updated on: May 31, 2023 | 10:05 PM

జోరా పబ్‌ ఘటనలో కేసులు నమోదువుతున్నాయి. వణ్యప్రాణుల ప్రదర్శన విషయంలో ఏడుగురిపై కేసులు నమోదు చేశారు. వన్యప్రాణి సంరక్షణా చట్టం సెక్షన్ 9,39,49 కింద కేసులు నమోదు చేశారు జూబ్లీహిల్స్‌ పోలీసులు. పబ్ ఈవెంట్ ఆర్గనైజర్‌ వినయ్‌ రెడ్డి, మనేజర్లు పృధ్వి, వరహాల నాయుడు, పెంపుడు జంతువుల విక్రేతలు తరుణ్‌, వంశీ, పెంపుడు జంతువులు దుకాణాలు యజమానులు యాసిర్‌, కార్తిక్ లను బుక్‌ చేశారు.

ఈనెల 28న జూబ్లీహిల్స్‌లోని జోరా పబ్‌లో వణ్యప్రాణులను ప్రదర్శించింది పబ్‌. పాములు, తొండలతోపాటు.. కొన్ని రకాల అరుదైన పిల్లులు, జంతువులను పబ్‌లో ప్రదర్శించారు. అయితే వాటికి ముందే ఇంజెక్షన్లు చేసినట్లు పబ్‌ నిర్వాహకులే తెలిపారు. వణ్యప్రాణులను భయానకంగా ప్రదర్శించడమే కాకుండా.. ఇలా ప్రమాదకర ఇంజెక్షన్లు ఇవ్వడాన్ని పోలీసులు సీనియస్‌గా తీసుకున్నారు. దీంతో వారిపై కేసులు నమోదు చేశారు. అయితే.. వ్యక్తిగత పూచీకత్తుపై స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చారు.

కలర్‌ఫుల్‌ లైటింగ్‌ మధ్య చిమ్మ చీకట్లో మాస్‌ డ్యాన్స్‌ చేస్తూ ఎంజాయ్‌ చేస్తున్న టైమ్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా వన్యప్రాణుల్ని ప్రవేశపెట్టారు. అడవిలోనో.. జూలోనో మాత్రమే కనిపించే అరుదైన పాములు, తొండలు, అడవి పిల్లులను కస్టమర్ల మధ్యలోకి వదిలారు. వాటిని చూసి కొందరు థ్రిల్‌ ఫీలవుతే, మరికొందరు భయంతో బెంబేలెత్తిపోయారు. ఇదేదో కొత్త థ్రిల్‌ అనుకున్నారో ఏమో… కస్టమర్లు కూడా ఆ వన్యప్రాణులతో వికృతంగా ప్రవర్తించారు. కొందరు వాటితో ఫొటోలు దిగితే.. మరికొందరు డ్యాన్స్ చేస్తూ వీడియోలు తీసుకున్నారు. ఈ వీడియోలని పబ్‌ నిర్వాహకులు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. దీంతో కొందరు నెటిజన్లు పోలీసులకు, ఫారెస్ట్‌ అధికారులకూ ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన సైబరాబాద్‌ టీమ్‌ ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని వివిధ సెక్షన్ల కింద కేసులు పెట్టింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం