Telangana: డాక్టర్ అయుండి హెల్త్ డిపార్ట్మెంట్ బిల్ ఆపడమా? గవర్నర్‌పై మంత్రి హరీష్‌ షాకింగ్ కామెంట్స్..

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్యరాజన్ పై మరోసారి విమర్శలు చేశారు మంత్రి హరీష్ రావు. గవర్నర్ తమళిసై నిర్ణయాలు బాధాకరమన్నారు. గవర్నర్ స్వయాన డాక్టర్ అయుండి.. హెల్త్ డిపార్ట్మెంట్ ఉద్యోగుల వయో పరిమితి బిల్ ఆపడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని అన్నారు.

Telangana: డాక్టర్ అయుండి హెల్త్ డిపార్ట్మెంట్ బిల్ ఆపడమా? గవర్నర్‌పై మంత్రి హరీష్‌ షాకింగ్ కామెంట్స్..
Harish Rao Vs Tamila Sai
Follow us
Shiva Prajapati

|

Updated on: Jun 01, 2023 | 5:21 AM

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్యరాజన్ పై మరోసారి విమర్శలు చేశారు మంత్రి హరీష్ రావు. గవర్నర్ తమళిసై నిర్ణయాలు బాధాకరమన్నారు. గవర్నర్ స్వయాన డాక్టర్ అయుండి.. హెల్త్ డిపార్ట్మెంట్ ఉద్యోగుల వయో పరిమితి బిల్ ఆపడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని అన్నారు.

మరోవైపు కాంగ్రెస్ నేతలపై ఘాటుగా స్పందించారు మంత్రి హరీష్. కాంగ్రెస్ నేతలకు ధీమాక్ పనిచేయడం లేదంటూ విమర్శించారు. వీళ్లు చేయకపోగా.. చేసే వారిని విమర్శించి కోడిగుడ్డుమీద ఈకలు పీకే ప్రయత్నాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఒకప్పుడు కాలేశ్వరం ప్రాజెక్టు విషయంలోను ఇలాగే విమర్శలు చేశారంటూ గుర్తు చేశారు మంత్రి. కాంగ్రెస్ పాలన వస్తే.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీసం సూదులు కూడ ఉండని పరిస్థితి వస్తుందన్నారు.

వరంగల్‌లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 24 అంతస్తుల హెల్త్ సిటీ భవన నిర్మాణ పనులను .. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి పరిశీలించారు హెల్త్ మినిస్టర్ హరీష్ రావు. ఆస్పత్రి నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు. కేంద్రం నిర్మిస్తున్న ఎయిమ్స్ పనులకు.. రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న మెడికల్ కాలేజీలకు వ్యత్యాసం చూడాలన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..