Khairatabad Ganesh: ఈ సారి ఖైరతాబాద్ వినాయకుడు ఎన్ని అడుగులో తెలుసా.. ఇతర విశేషాలు మీకోసం..

ఖైరతాబాద్‌ గణేషుడు వరల్డ్‌ ఫేమస్‌. గణేష్‌ ఉత్సవాల్లో ఖైరతాబాద్‌ స్పెషల్‌ అట్రాక్షన్‌. మరి ఈసారి ఖైరతాబాద్‌ గణపతి ఎలా ఉండబోతున్నారు? ఈ ప్రశ్న గత ఏడాది నుంచే మొదలైంది. 51 అడుగుల ఎత్తులో నిర్మించ‌నున్న ఈ విగ్రహాన్ని మ‌ట్టితో మాత్రమే రూపొందించ‌నున్నారు. ఖైర‌తాబాద్ గ‌ణేషుడిని మ‌ట్టితో రూపొందించ‌డం ఇదే రెండోసారి..

Khairatabad Ganesh: ఈ సారి ఖైరతాబాద్ వినాయకుడు ఎన్ని అడుగులో తెలుసా.. ఇతర విశేషాలు మీకోసం..
Khairatabad Ganesh
Follow us
Sanjay Kasula

|

Updated on: May 31, 2023 | 7:09 PM

తెలుగు రాష్ట్రాల్లో జరిగే గణేష్‌ ఉత్సవాల్లో స్పెషల్‌ అట్రాక్షన్‌ ఖైరతాబాద్‌ మహా గణపతి. ఇక్కడ ఏర్పాటు చేసే విఘ్నేశ్వరునికి ప్రత్యేక స్థానం ఉంటుంది. ఏటా వివిధ రూపాల్లో కొలువుదీరే లంబోదరుడు ఈ ఏడాది ఎలాంటి రూపంలో దర్శనమిస్తాడా అని భక్తులంతా ఎదురుచూస్తున్నారు. వినాయక చవితి సమీపిస్తున్న నేపథ్యంలో ఖైరతాబాద్ గణేశుడి నిర్మాణానికి ఇవాళ అంకురార్పణ జరగనుంది. బుధవారం సాయంత్రం 5 గంటలకు మహాగణపతి కర్ర పూజ నిర్వహించనున్నారు ఖైరతాబాద్‌ గణేష్‌ ఉత్సవ కమిటీ.

ఏటా ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌తో వినాయక ప్రతిమలను రూపొందించేవారు. కానీ ఈ ఏడాది తొలిసారిగా మట్టి విగ్రహాన్ని తయారుచేస్తున్నారు. పర్యావరణానికి ఎలాంటి హాని కలిగించకుండా ఎకో ఫ్రెండ్లీ గణేషుణ్ణి రూపొందిస్తున్నారు. ఇందుకోసం కర్ర పూజతో గణనాథుడి విగ్రహ తయారీ ప్రారంభిచారు నిర్వాహకులు.

ఈ పూజా కార్యక్రమంలో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి భగవంతరావు, దైవజ్ఞ శర్మ పాల్గొన్నారు. కాగా గతేడాది మట్టితో తయారుచేసిన 50 అడుగుల ఎత్తైన శ్రీ పంచముఖ మహాలక్ష్మి గణపతి విగ్రహాన్ని నిర్వాహకులు ప్రతిష్టించారు. ఓ అడుగు పెంచుతున్నారు.. 51 అడుగుల మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం