AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

100 కోట్ల రూపాయల లగ్జరీ కార్లు అన్ని ఇక్కడికే.. కట్‌ చేస్తే.. అలా మ్యాటర్‌ లీక్..!

ఒక్క సమాచారంతో కొద్దిరోజుల క్రితం అహ్మదాబాద్ లో ఉన్న హైదరాబాది కార్ డీలర్ బశరథ్ ను డిఆర్ఐ అహ్మదాబాద్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇతడు తీసుకొచ్చే కార్లను గచ్చిబౌలిలో ఉన్న కార్ లాంజ్ తో పాటు భాషరత్ స్నేహితుడు బిజినెస్ పార్ట్నర్ గా ఉన్న డాక్టర్ అహ్మద్ కి సంబంధించిన ఫామ్ హౌస్ లోనూ కార్లను ఉంచుతూ వచ్చారు. కార్ లాంజ్ షో రూమ్ గచ్చిబౌలిలో లో ఉంది..

100 కోట్ల రూపాయల లగ్జరీ కార్లు అన్ని ఇక్కడికే.. కట్‌ చేస్తే.. అలా మ్యాటర్‌ లీక్..!
Luxury Car Smuggling
Lakshmi Praneetha Perugu
| Edited By: Jyothi Gadda|

Updated on: May 27, 2025 | 2:22 PM

Share

100 కోట్ల రూపాయల లగ్జరీ కార్లు అన్ని ఇక్కడికే..

లగ్జరీ కార్ల దిగుమతి కేసులో డిఆర్ఐ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. హైదరాబాద్కు చెందిన కార్ల డీలర్ బశరత్ ఖాన్ ను ఇప్పటికే డిఆర్ఐ అధికారులు అరెస్టు చేశారు. ఇతడి వెనకాల ఉన్న వ్యక్తుల కోసం దర్యాప్తు ముమ్మరం చేశారు. మిగతా నిందితుల కోసం హైదరాబాద్ తో పాటు ఢిల్లీ ముంబై బెంగళూరులో అధికారులు గాలిస్తున్నారు. లగ్జరీ కార్ల దిగుమతి వ్యవహారం పై డిఆర్ఐ అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.. ఇప్పటికే ఈ కేసులో హైదరాబాద్కు చెందిన బషరత్ అహ్మద్ ఖాన్ ను అహ్మదాబాద్ లోని డిఆర్ఐ అధికారులు అరెస్టు చేయగా ఇతడి వద్ద కారులో కొనుగోలు చేసిన వ్యక్తుల వివరాలను డిఆర్ఐ అధికారులు సేకరిస్తున్నారు. హైదరాబాదుకు చెందిన భషరథ్  మొదట నాంపల్లిలోని విజయనగర్ కాలనీలో ఉండేవాడు. చిన్న కార్ల ను అనుకుంటూ వ్యాపారం చేసెవాడు. క్రమక్రమంగా అతడికి సర్కిల్ పెరగటంతో రాజకీయ నాయకులతో సంబంధాలు ఏర్పడ్డాయి. తద్వారా రాజకీయ నాయకులకు అవసరమైన లగ్జరీకారులను విదేశాల నుండి దిగుమతి చూపిస్తున్నాడు.. ఈ క్రమంలోనే కోట్ల రూపాయల పన్ను ఎగ్గొడుతున్నాడు.

విదేశాలలో తయారు అవుతున్న  లగ్జరీ కార్లను భారత్కు రప్పించేందుకు పలువురు డీలర్లు కలిసి ముఠాగా ఏర్పడి కోట్ల రూపాయల పన్ను ఎగ్గొడుతున్నారు. సాధారణంగా విదేశాల నుండి కారులను ఇండియాకి దిగుమతి చేసుకోవాలంటే టాక్స్ భారీగా ఉంటుంది. దిగుమతి చేసుకునే కార్ల ట్యాక్స్ ను ఎగ్గొట్టేందుకు వీరంతా స్కెచ్ వేశారు.అమెరికా జపాన్లో తయారవుతున్న కారులను నేరుగా ఇండియాలోకి దిగుమతి చేసుకోకుండా ప్లాన్ చేశారు. విదేశాల్లో తయారయ్యే కార్లకు లెఫ్ట్ హ్యాండ్ డ్రైవింగ్ స్టీరింగ్ ఉంటుంది. కాబట్టి విదేశాల నుండి వచ్చే కార్లను ఈజీగా గుర్తించవచ్చు. అలాంటి కార్లను దిగుమతి చేసుకునే క్రమంలో రెండింతలు అదనంగా ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. ఈ పరిస్థితులలో టాక్సును తప్పించుకునేందుకు అమెరికా జపాన్ నుండి కారులను దుబాయ్ శ్రీలంకకు సముద్రమార్గంలో పంపిస్తున్నారు. శ్రీలంక దుబాయ్ కి వచ్చిన తర్వాత లెఫ్ట్ హ్యాండ్ డ్రైవింగ్ స్టీరింగ్ ఉన్న వాటిని రైట్ హ్యాండ్ స్టీరింగ్ లోకి మార్చేస్తున్నారు. వాటితోపాటు మరికొన్ని సవరణలు చేసి శ్రీలంక దుబాయ్ నుండి ఇండియాకు దిగుమతి చేస్తున్నారు. అలా దిగుమతి అయిన సందర్భాల్లో నకిలీ ఇన్వాయిసులు పెట్టి స్పేర్ పార్ట్స్ మాత్రమే  అంటూ తప్పించుకుని కోట్ల రూపాయల ట్యాక్స్ ను ఎగొడుతునారు.

ఇవి కూడా చదవండి

విదేశాల నుండి దిగుమతి  చేసుకున్న కార్లకు ట్యాక్స్ దాదాపు 100 శాతం అధికంగా ఉంటుంది. దీన్ని తప్పించుకునేందుకు వివిధ రాష్ట్రాల్లో ఉన్న  కొందరు కార్ల డీలర్లు ముఠాగా ఏర్పడి ఈ ప్లాన్ ను అమలు చేస్తున్నారు. వీరిలో సౌత్ రాష్ట్రాలకు సంబంధించిన డీలింగ్స్ మొత్తం బషరతు ఏ చూస్తున్నాడు. ఇతడితోపాటు ఢిల్లీ ముంబై బెంగళూరు అహ్మదాబాద్ లాంటి ప్రాంతాల్లోనూ బశరథ లాంటి డీలర్లు ఉన్నారు.  విదేశాల నుండి కారులను దిగుమతి చేసేందుకు రెండు రకాల మోడస్ అపరెండి ను భషరత్ అండ్ కో పాటిస్తున్నారు. మొదటిది జపాన్ అమెరికన్ నుండి వచ్చే కార్లను శ్రీలంక దుబాయ్ కి పంపించి అక్కడ వాటికి సవరణలు చేసి ఇండియాలోకి దిగుమతి చేస్తూ తప్పుడు పత్రాలు చూపించి టాక్స్ ఎగొట్టడం.. ఇక మరోటి స్పేర్ పార్ట్స్ దిగుమతి చేసుకుంటున్నట్లు కస్టమ్స్ అధికారులను నమ్మించి దిగుమతి చేసుకుంటున్న కార్లకు చెల్లించాల్సిన భారీ పన్నును ఈజీగా ఎగ్గొడుతున్నారు. ఇదే మార్గం ద్వారా  కొన్ని సంవత్సరాల నుండి కారులను దిగుమతి చేసుకున్నట్లు డి ఆర్ ఐ దర్యాప్తులో బయటపడింది.

ఒక సమాచారంతో కొద్దిరోజుల క్రితం అహ్మదాబాద్ లో ఉన్న హైదరాబాది కార్ డీలర్ బశరథ్ ను డిఆర్ఐ అహ్మదాబాద్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇతడు తీసుకొచ్చే కార్లను గచ్చిబౌలిలో ఉన్న కార్ లాంజ్ తో పాటు భాషరత్ స్నేహితుడు బిజినెస్ పార్ట్నర్ గా ఉన్న డాక్టర్ అహ్మద్ కి సంబంధించిన ఫామ్ హౌస్ లోనూ కార్లను ఉంచుతూ వచ్చారు. కార్ లాంజ్ షో రూమ్ గచ్చిబౌలిలో లో ఉంది..భాషరత్ నుండి కార్లకు కొనుగోలు చేసిన వారి వివరాలు సైతం DRI సేకరిస్తుంది.ఇప్పటికే అహ్మదాబాద్ జైల్లో ఉన్న భాషరత్ ను కష్టడికి తీసుకుంటే అతను ముఠాలో సభ్యులుగా ఉన్న  వివరాలతో పాటు ఇతడి నుండి కార్లు కొనుగోలు చేసిన వారి వివరాలు తెలుసుకోవాలనీ DRI భావిస్తుంది.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

టూరిస్టులు ఎగిరి గంతేసే న్యూస్..! జనవరిలో విశాఖలో పండగే పండగ..
టూరిస్టులు ఎగిరి గంతేసే న్యూస్..! జనవరిలో విశాఖలో పండగే పండగ..
పగటి నిద్రతో కలిగే అద్భుత ప్రయోజనాలు!
పగటి నిద్రతో కలిగే అద్భుత ప్రయోజనాలు!
హైదరాబాద్‌లో తొలి తరహా లగ్జరీ మేకప్ స్టూడియో..
హైదరాబాద్‌లో తొలి తరహా లగ్జరీ మేకప్ స్టూడియో..
నెల్లూరు లేడీ డాన్‌ అరుణపై పీడీ యాక్ట్‌.. కడప జైలుకు తరలింపు
నెల్లూరు లేడీ డాన్‌ అరుణపై పీడీ యాక్ట్‌.. కడప జైలుకు తరలింపు
హృతిక్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. టీమిండియా తోపు క్రికెటర్ భార్య
హృతిక్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. టీమిండియా తోపు క్రికెటర్ భార్య
గుండెకు హాని చేసే ఆహారాలు.. ఈ 5 రకాల ఫుడ్స్‌కు దూరంగా ఉండండి!
గుండెకు హాని చేసే ఆహారాలు.. ఈ 5 రకాల ఫుడ్స్‌కు దూరంగా ఉండండి!
టేస్టీగా ఉన్నాయని ఆ ఫుడ్స్ అతిగా తినేశారంటే.. మీ కిడ్నీ షెడ్డుకే
టేస్టీగా ఉన్నాయని ఆ ఫుడ్స్ అతిగా తినేశారంటే.. మీ కిడ్నీ షెడ్డుకే
అఖండ 2 సినిమాలో బాలయ్య కూతురిగా నటించిన ఈ అమ్మాయి ఎవరంటే..
అఖండ 2 సినిమాలో బాలయ్య కూతురిగా నటించిన ఈ అమ్మాయి ఎవరంటే..
భారతీయులు 5201314 నంబర్‌ను ఎందుకు ఎక్కువ సెర్చ్‌ చేశారు?
భారతీయులు 5201314 నంబర్‌ను ఎందుకు ఎక్కువ సెర్చ్‌ చేశారు?
అనుష్కతో సినిమా చేస్తున్న డైరెక్టర్‌‌కు నాగార్జున వార్నింగ్
అనుష్కతో సినిమా చేస్తున్న డైరెక్టర్‌‌కు నాగార్జున వార్నింగ్