- Telugu News Photo Gallery Drinking beetroot juice early in the morning can help from digestion acne and more
Beetroot Juice: ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ జ్యూస్ తాగితే బోలెడన్నీ బెనిఫిట్స్.. తెలిస్తే..
బీట్‌రూట్ జ్యూస్.. ఇది ఒక అద్భుతమైన ఆరోగ్య నిధి. బీట్‌రూట్‌లో ఉండే పోషకాలు శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తాయి. బీట్‌రూట్‌లో విటమిన్ సి, ఇతర యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి. అంతేకాదు..బీట్‌రూట్‌లోని యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నుండి రక్షించి.. ఆరోగ్యంగా, మెరిసే అందంతో కనిపించేలా చేయడానికి సహాయపడతాయి. అయితే ఉదయం ఖాళీ కడుపుతో బీట్‌రూట్ జ్యూస్ తాగితే శరీరంలో కలిగే మార్పులేంటో ఇక్కడ తెలుసుకుందాం..
Updated on: May 27, 2025 | 8:28 AM

బీట్‌రూట్‌లో నైట్రేట్లు అధికంగా ఉంటాయి. ఇవి రక్తనాళాలను విశాలం చేసి, రక్తపోటును తగ్గించడానికి సహాయపడతాయి. ఇది గుండె జబ్బులను తగ్గించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. బీటాసైనిన్ అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ ఉంటుంది. ఇది ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి, క్యాన్సర్ కణాల పెరుగుదలను తొలగిస్తుంది.

బీట్‌రూట్‌లో ఉండే విటమిన్లు, ఖనిజాలు చర్మం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఇది చర్మాన్ని మృదువుగా, మెరిసిపోయేలా చేస్తుంది. ఇందులో ఐరన్ అధికంగా ఉంటుంది. ఇది రక్తహీనతను నివారించడంలో సహాయపడుతుంది. బీట్‌రూట్‌లో ఉండే పోషకాలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి.

బీట్‌రూట్ రసం - ఉదయం ఖాళీ కడుపుతో బీట్‌రూట్ రసం త్రాగాలి. మీరు అందులో ఆమ్లా జ్యూస్ కూడా కలపవచ్చు. ఇలా చేస్తే రోజంతా తాజాగా ఉంటారు.

బీట్‌రూట్‌లో నైట్రేట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తనాళాలను వెడల్పు చేసి రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. తద్వారా రక్తపోటు తగ్గుతుంది. ఉదయం ఖాళీ కడుపుతో బీట్‌రూట్ జ్యూస్ తాగడం వల్ల శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. ఇందులో ఉండే సహజ చక్కెరలు రోజంతా ఉత్సాహంగా ఉంచుతాయి.

బీట్‌రూట్ జ్యూస్ గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. బీట్‌రూట్‌లో ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. మలబద్ధకం వంటి సమస్యలను నివారిస్తుంది. బీట్‌రూట్‌లో ఐరన్ ఉంటుంది. ఇది శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచడానికి సహాయపడుతుంది. రక్తహీనతను నివారిస్తుంది.




