AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Peanuts: ఖరీదైన బాదం, పిస్తా కాదు.. రోజూ గుప్పెడు పల్లీలు తింటే చాలు..లెక్కకు మించి లాభాలు..!

పల్లీలు.. దాదాపు అందరికీ ఇష్టమైన స్నాక్‌ ఐటమ్. ఎక్కువగా ప్రయాణ సమయాల్లో చాలా మంది వీటిని ఇష్టంగా తింటూ ఉంటారు.. ప్రశాంతమైన సాయంత్రం వేళల్లో కూడా కొందరు పల్లీలను వేయించుకుని, ఉడికించుకుని తింటూ ఉంటారు. పల్లీలతో కూడా వెరైటీ వంటకాలు చాలానే తయారు చేస్తుంటారు. అయితే, పల్లీలు కేవలం టైమ్‌పాస్‌ స్నాక్‌ ఐటమ్‌గానే చూసే వాళ్లకు ఇదో షాకింగ్ న్యూస్‌..! ఎందుకంటే.. పల్లీలు కేవలం రుచికరమైనవి మాత్రమే కాదు.. ఎంతో ఆరోగ్యకరమైనవి అంటున్నారు పోషకాహార నిపుణులు. నిజం చెప్పాలంటే..ఖరీదైన కాజు, బాదం, పిస్తాల్లో ఉండే పోషకాలు పల్లీల్లో కూడా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. రోజూ గుప్పెడు పల్లీలు తినటం వల్ల మీరు ఊహించని లాభాలు ఉన్నాయని చెబుతున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం...

Jyothi Gadda
|

Updated on: May 27, 2025 | 8:42 AM

Share
కరోనా అనంతరం ప్రజల్లో ఆహారం, ఆరోగ్యం పట్ల అవగాహన పెరిగింది. దీంతో చాలా మంది ఆరోగ్యానికి అవసరమైన ఆహారాలపై ఎక్కువగా దృష్టిపెడుతున్నారు. ఇందులో భాగంగా పండ్లు, కూరగాయలతో పాటు నట్స్, సీడ్స్‌, డ్రైఫ్రూట్స్‌ని కూడా ఎక్కువగా తీసుకుంటున్నారు. బాదం, పిస్తా వంటి ఖరీదైన డ్రై ఫ్రూట్స్‌కి బదులుగా తక్కువ ధరకు లభించే పల్లీలు తింటే అంతే ప్రయోజనం అంటున్నారు నిపుణులు.

1 / 5
సరైన మోతాదులో ప్రతినిత్యం పల్లీలు తినటం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయని చెబుతున్నారు. శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ని కరిగించడంలో పల్లీలు అద్భుతంగా సహాయపడతాయి. గుండె ఆరోగ్యంగా పని చేయడానికి, ముఖ్యంగా గుండె ధమనుల్లో కొవ్వు పేరుకుపోకుండా నిరోధించడంలో పల్లీలు సహాయం చేస్తాయి. ఫలితంగా గుండె పోటు ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

2 / 5
పల్లీలు తినటం వల్ల ట్రిప్టోఫాన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. ఇది తరచుగా హ్యాపీ హార్మోన్ అని పిలువబడే సెరోటోనిన్ స్థాయిలను పెంచుతుంది. ఇది మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. నిరాశను తగ్గిస్తుంది. జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది. జింక్ పుష్కలంగా ఉండే వేరుశెనగలు తినటం జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది. అల్జీమర్స్ వ్యాధిని నివారిస్తుంది.

3 / 5
పల్లీలల్లో విటమిన్ ఈ పుష్కలంగా లభిస్తుంది. దీన్ని వల్ల మెదడు చురుగ్గా ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి చిన్నపిల్లలు, పెద్దలు పల్లీలను తినడం వల్ల మెదడును చురుగ్గా ఉంటుంది. గర్భిణులు నిత్యం పల్లీలు తీసుకుంటే అవసరమైన పోషకాలు అందుతాయని వైద్యులు చెబుతున్నారు. కాబట్టి పల్లీలను ఆహారంలో భాగం చేసుకోండి.

4 / 5
కీళ్ల నొప్పులు, నడుము నొప్పి, మెడ నొప్పి వంటి సమస్యలతో బాధపడే వారు పల్లీలు తినడం వల్ల ఉపశమనం లభిస్తుంది. ఇందులో ఉండే కాల్షియం, మెగ్నీషియం, ఎముకలను దృఢంగా తయారు చేస్తాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల జలుబ్బు, దగ్గు వంటి సమస్యల బారిన పడకుండా ఉంటాము. అయితే, పల్లీలు ఆరోగ్యకరమైన ఆహారం కావచ్చు.. కానీ వీటిని అతిగా తీసుకోవడం మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు.

5 / 5
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్

భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ

రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్

బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్

డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు

కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక

వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం

ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..