- Telugu News Photo Gallery These places are the best option for photographers and are ideal for photoshoots
Photography Places: ఫొటోగ్రాఫర్లకు ఈ ప్రదేశాలు బెస్ట్ ఆప్షన్.. ఫోటోషూట్లకు అనువైనవి..
ప్రస్తుతకాలంలో టూరిజం చాలామందికి ప్యాషన్‌గా మారిపోయింది. టూర్‌కి వెళ్లి అక్కడ దృశ్యాలను తమ కెమెరాల్లో మెమెరీస్గా భద్రపరుచుకుంటున్నారు. అయితే ఫొటోగ్రాఫర్లకు, ఫోటోగ్రఫీ ప్రేమికులకు అనువైనవి పర్యాటక ప్రదేశాలు చాల ఉన్నాయి. అందులో కొన్ని మాన్సూన్ సమయంలో అద్భుతమైన ఫోటోలను అందిస్తాయి. మరి మాన్సూన్ వేళా దేశంలో బెస్ట్ ఫొటోజెనిక్ టూరిస్ట్ స్పాట్స్ ఏంటి.? ఈరోజు తెలుసుకుందాం..
Updated on: May 27, 2025 | 10:50 AM

దేశంలోని అత్యంత ఆకర్షణీయమైన జలపాత ప్రదేశాలలో ఒకటైన గోవాలోని దూద్‌సాగర్ జలపాతాన్ని తప్పక చూడాలి. మాన్సూన్ వేళా ఈ ప్రదేశం మరింత అందంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇది ఫోటోగ్రఫీ ప్రేమికులకు ఇది స్వర్గధామం. మాన్సూన్ సమయంలో ఇక్కడ సినిమాటిక్ స్టైల్ ఫోటోలు తీసుకోవచ్చు.

పశ్చిమ కనుమలలో ఉన్న భగవాన్ మహావీర్ వన్యప్రాణుల అభయారణ్యం ప్రకృతిని ప్రేమికులతో పాటు ఫోటోగ్రాఫర్లను ఆకర్షిస్తుంది. వర్షాకాలంలో ఈ అభయారణ్యం సమృద్ధిగా వృక్షజాలం జంతుజాలంతో వికసిస్తుంది. అదే సమయంలో అడవి పువ్వులు, తడిసిన ఆకుల ద్వారా సూర్యకాంతి ప్రకాశించడం వల్ల ఆధ్యాత్మిక ఆకర్షణ ఏర్పడుతుంది. కెమెరాను చేతి పట్టుకొని సీతాకోకచిలుకలు, జింకలు, మకాక్‌లు, ప్రత్యేక పక్షి ఫోటో తీసుకోవచ్చు. ఈ ప్రదేశం ఫోటో మెమోరీస్ అందిస్తుంది.

గోవాలోని బాసిలికా ఆఫ్ బోమ్ జీసస్, సే కేథడ్రల్ వంటి చారిత్రాత్మక పాత చర్చిలు వర్షాకాలంలో ఆహ్లాదకరంగా ఉంటాయి. ఇక్కడ తేమతో కూడిన మార్గాలతో విశాలమైన భవనాల దృశ్యాలు ఆకట్టుకుంటాయి. ఈ చర్చిలు ఫొటోగ్రాఫర్లకు ఫోటోషూట్‌కి బెస్ట్ ఆప్షన్. ఇక్కడ క్లిక్స్ సూపర్బ్ అనిపిస్తాయి.

అరాంబోల్ కొండపై పచ్చని ప్రకృతి దృశ్యంతో పాటు విశాలమైన అరేబియా సముద్ర దృశ్యం వర్షాకాలంలో స్వరాన్ని తలపిస్తుంది. ఈ కొండపై వీక్షకులు మేఘాలతో పాటు సుందరమైన సముద్ర ప్రకృతి దృశ్యాన్ని ఆస్వాదించవచ్చు. ఇక్కడ ప్రశాంతమైన అలలు చెంత సుందరమైన ఛాయాచిత్రాలను మీ కెమెరాల్లో బందించవచ్చు.

పట్టణ జీవితం విడి విశ్రాంతి కోరుకునే ప్రజలకు సుందరమైన మాయెం సరస్సు అనువైనది. ఇది అద్భుతమైన కొండలు, కొబ్బరి తోటల మధ్య ఉంటుంది. వర్షాకాలం ఈ సరస్సు పూర్తిగా నిండి ఫోటోగ్రాఫర్లను ఆకర్షిస్తుంది. ఈ ప్రదేశం మీకు బెస్ట్ ఫోటోగ్రఫీ అనుభవాన్ని ఇస్తుంది.




