Hyderabad: యాపిల్ యాక్ససరీస్ సగం ధరకే కొంటున్నారా..? మీ కొంప కొల్లేరే బ్రో..!
జగదీష్ మార్కెట్ కు చాలామంది నగరవాసులు మొబైల్స్ రిపేర్ల కోసం సహజంగా వెళుతూ ఉంటారు. అలాంటివారు అక్కడ రిపేర్ జరిగేంతవరకు షాప్ నిర్వాహకులపై ఒక కన్ను వేసి ఉంచాలని పోలీసులు సూచిస్తున్నారు. లేనిపక్షంలో పలు సందర్భాల్లో స్పేర్ పార్ట్స్ను సైతం వారు మోసం చేసే ఆస్కారం ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు.

హైదరాబాదులో నకిలీ ఐఫోన్ పరికరాలను అమ్ముతున్న పలువురు మొబైల్ షాప్ ఓనర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాదుల జగదీశ్ మార్కెట్ తెలియని వారు ఉండరు. ఇక్కడ చిన్న ఫోన్ నుండి మొదలుపెట్టి పెద్ద ఫోన్ వరకు ప్రతి పరికరము ఇక్కడ లభిస్తుంది. దీంతోపాటు పెద్ద ఫోన్లు ఇక్కడ ఇస్తే దాని స్పేర్ పార్ట్స్ను తీసేస్తారు అని ముద్ర సైతం ఇక్కడ ఉంది. అయితే తాజాగా హైదరాబాద్ సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు మొబైల్ షాప్ లపై తనిఖీలు నిర్వహించారు.
ఆకస్మిక తనిఖీలలో పలువురు మొబైల్ షాప్ నిర్వాహకుల బాగోతం బయటపడింది. ఆపిల్ బ్రాండ్ కు సంబంధించిన నకిలీ పరికరాలను ఆపిల్ బ్రాండ్ పేరుతో విక్రయిస్తున్నట్లు పోలీసులు దర్యాప్తులో బయటపడింది. ఈ క్రమంలో జగదీష్ మార్కెట్ లో ఉన్న పలు షాపులపై పోలీసులు తనకి నిర్వహించి నలుగురిని అదుపులోక్తీi సుకున్నారు. నకిలీ పరికరాల మీద ఐఫోన్ ఆపిల్ లోగోలను ఫోటోలను పేస్ట్ చేసి ఆ బాక్స్లను ఒరిజినల్ ఐఫోన్లుగా విక్రయిస్తున్నారు.
శ్రీ మాతాజీ మొబైల్స్, ఆర్జి మొబైల్స్, రాజారాం మొబైల్స్ కు చెందిన విక్రమ్ సింగ్ ,సురేష్ కుమార్, నాతారం చౌదరి ,సర్ఫ్రాజ్, సురేష్ లను అరెస్టు చేశారు. వీరంతా నకిలీ ఐఫోన్ ప్రొడక్ట్ లను అమ్మడంతో పాటు కస్టమర్లను పెద్ద ఎత్తున మోసం చేస్తున్నట్లు గుర్తించారు. వీటిని ముంబై ఏజెంట్ల ద్వారా కొనుగోలు చేసి వీటికి ఆపిల్ స్టిక్కర్లను అంటిస్తున్నట్లు పోలీసులు దర్యాప్తులో బయటపడింది. వీరందరినీ పోలీసులు ఆ మెటీరియల్ తో పాటు అరెస్టు చేసి ఆబిడ్స్ పోలీసులకు అప్పగించారు. చిన్న ప్రొడక్ట్స్ ను ముంబై నుండి ఇంపోర్టు చేసుకుని వాటికి ఐఫోన్ స్టిక్కర్లు జతపరిచే ఆపిల్ ప్రోడక్ట్లు ఖరీదు చేసే రేటుకు వీటిని విక్రయిస్తూ ఈజీ గామనీ సంపాదిస్తున్నారని పోలీసుల దర్యాప్తులో బయటపడింది.
జగదీష్ మార్కెట్ కు చాలామంది నగరవాసులు మొబైల్స్ రిపేర్ల కోసం సహజంగా వెళుతూ ఉంటారు. అలాంటివారు అక్కడ రిపేర్ జరిగేంతవరకు షాప్ నిర్వాహకులపై ఒక కన్ను వేసి ఉంచాలని పోలీసులు సూచిస్తున్నారు. లేనిపక్షంలో పలు సందర్భాల్లో స్పేర్ పార్ట్స్ను సైతం వారు మోసం చేసే ఆస్కారం ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు.








