Certificates: విద్యార్ధులు, నిరుద్యోగులకు అలర్ట్.. ఈ సర్టిఫికెట్లు మీ వద్ద ఉన్నాయా..? లేకుంటే బతుకు బస్టాండే..
వేసవి సెలవులు ముగుస్తున్నాయి. 2025-26 విద్యా సంవత్సరానికి విద్యా సంస్థలు ప్రారంభంకానున్నాయి. మరోవైపు పలు ప్రభుత్వ ఉద్యోగాలకు కూడా వరుస నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయి. ఈక్రమంలో విద్యార్ధులు, నిరుద్యోగులు చివరి నిమిషం వరకు వేచి చూడకుండా అవసరమైన ధ్రువీకరణ పత్రాలకు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని..

అమరావతి, మే 27: సాధారణంగా పాఠశాలలు, కాలేజీల్లో ప్రవేశాలకు, ఆయా ప్రభుత్వ ఉద్యోగాలకు కొన్ని రకాల సర్టిఫికెట్లు తప్పనిసరి. అయితే అనేక మంది అలసత్వమో, నిర్లక్ష్యమో తెలియదుగానీ చివరి నిమిషం వరకు వాటిని సమకూర్చుకునే ప్రయత్నం చేయరు. తీరా అత్యవసరమ్యే సమయంలో ఉరుకులు పరుగులు తీస్తూ కార్యాలయాల చుట్టూ చక్కర్లు కొడుతుంటారు. మరి కొందరు దళారులకు డబ్బు ఎరగా వేసి ఠంచన్‌గా సర్టిఫికెట్లను పొందుతుంటారు. ఇది ఎంత మాత్రం మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ప్రవేశాలకు విద్యార్థులకు అవసరమయ్యే ధ్రువీకరణ పత్రాలు ఎంత అవసరమో.. మెరిట్ ప్రాతిపదికన ఉద్యోగ నియామకాలు చేపట్టే సమయంలోనూ అంతే అవసరం. ఏ ఒక్క పత్రం లేకున్నా వచ్చిన అవకాశం చేజారి పోతుంది. ముందుగానే తీసుకుని అందుబాటులో ఉంచుకోవడం ఆందోళన ఉండదు. పనులు సులభంగా అయిపోతాయి. త్వరలో విద్యాసంస్థలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో అవసరమైన పత్రాలకు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
జాబ్, అడ్మిషన్లకు అత్యవసరమయ్యే పత్రాలు ఇవే..
- ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలి.
- అలాగే కుల, ఆదాయ, బర్త్ సర్టిఫికెట్లు కూడా ఉండాలి.
- నివాస ధ్రువీకరణ పత్రాలు సైతం అవసరమే.
- ఇక కేంద్ర విద్యాసంస్థలు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఓబీసీ ధ్రువీకరణ పత్రం, నాన్ క్రిమీలేయర్ పత్రాలు తప్పనిసరి.
- స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరిధిలోని ఉద్యోగాలకు డొమిసిల్ అనే శాశ్వత నివాస ధ్రువీకరణ పత్రం తప్పనిసరి. తహసీల్దార్ కార్యాలయంలో ఇది అందిస్తారు. ఏదైనా రాష్ట్రంలో 15 ఏళ్లు నివాసం ఉన్నవారు డొమిసిల్ ధ్రువీకరణ పత్రం సమర్పించాలి.
కొత్తగా దరఖాస్తు చేసుకుంటే ఎన్ని రోజులకు వస్తాయంటే..
అధికారిక నిబంధనల ప్రకారం పై పత్రాలు తీసుకోవాలంటే దరఖాస్తు చేసుకున్న తర్వాత 7 నుంచి 45 రోజుల సమయం పడుతుంది. కొన్నిచోట్ల ఒకటి, రెండు రోజుల్లో కూడా అందిస్తున్నారు. మరికొన్నిచోట్ల నెలలపాటు వేచి చూడవల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితి రాకూడదంటే ముందుగానే జాగ్రత్త పడటం మంచిది. ఈ ధ్రువపత్రాలకు మీసేవలో రూ.45 చొప్పున చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు.
- బర్త్, కుల సర్టికెట్లకు 30 రోజులు
- ఈబీసీ సర్టికెట్‌కు 7 రోజులు
- ఓబీసీ సర్టికెట్‌కు 30 రోజులు
- ఆదాయ సర్టికెట్‌కు 7 రోజులు
- ఫ్యామిలీ మెంబర్ సర్టికెట్‌కు 30 రోజులు
- నివాస సర్టికెట్‌కు 7 రోజులు
- లోకల్ సర్టికెట్‌కు 30
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.




