ఉదయాన్నే ఖాళీ కడుపుతో నేరేడు పండ్లు తింటున్నారా..? ఏమౌతుందో తెలుసుకోండి..
నేరేడు పండ్లలో ఎన్నో ఔషధ గుణాలు నిండివున్నాయి. అందుకే వీటిని ఆయుర్వేదం, హోమియోపతిలో కూడా ఉపయోగిస్తుంటారు. నేరేడు పండ్లను ఇండియన్ బ్లాక్‌బెర్రీ అని పిలుస్తారు. ఈ పండ్లు వేసవి కాలంలో ఎక్కువగా లభిస్తాయి. దీన్నే జావా ప్లం అని కూడా పిలుస్తారు. నేరేడు పండ్లలో ఔషధ గుణాలు సమృద్ధిగా నిండి ఉంటాయి. అనేక వ్యాధులకు నివారణగా పనిచేస్తాయి. నేరేడు పండ్లు తినడం వల్ల రోగనిరోధక శక్తి బలపడుతుంది. అయితే, ఉదయాన్నే ఖాళీ కడుపుతో నేరేడు పండ్లు తినటం మంచిదేనా..? నిపుణులు ఏం చెబుతున్నారో ఇక్కడ తెలుసుకుందాం..
Updated on: May 25, 2025 | 5:42 PM

నేరేడు పండ్లలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. అందుకే వీటిని ఆయుర్వేదం, హోమియోపతిలో కూడా ఉపయోగిస్తుంటారు. అయితే, ఖాళీ కడుపుతో నేరేడు పండు తినడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుంది. ఎందుకంటే ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, ముఖ్యంగా ఆంథోసైనిన్లు ఉంటాయి. ఈ పండ్లు జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తాయి. అలాగే, శరీరంలోని బ్లడ్ షుగర్ లెవల్స్‌ని కంట్రోల్ చేస్తుంది.

ఫైబర్ ఉన్న నేరేడు పండ్లు తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. విటమిన్ సి, ఐరన్ ఉన్న నేరేడు పండ్లు హిమోగ్లోబిన్ ను పెంచుతాయి. రక్తహీనతను నివారిస్తాయి. నేరేడు పండ్లలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ. ఫైబర్ ఎక్కువ. ఇవి రక్తంలో చక్కెరను తగ్గిస్తాయి.

యాంటీఆక్సిడెంట్లు ఉన్న నేరేడు పండ్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. విటమిన్ సి, ఎ ఉన్న నేరేడు పండ్లు కంటి ఆరోగ్యానికి మంచివి. ఫైబర్ ఎక్కువ, కేలరీలు తక్కువగా ఉన్న నేరేడు పండ్లు ఆకలి తగ్గించి.. బరువును నియంత్రిస్తాయి. నేరేడు పండ్లు.. చర్మ ఆరోగ్యానికి సహాయపడతాయి.

నేరేడు పండ్లను అధికంగా తినడం వల్ల జ్వరం, గొంతు సమస్యలు వస్తాయి. శ్వాస సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు.. నేరేడు పండ్లు శరీరంలోని వాత దోషాన్ని తీవ్రతరం చేస్తాయి. కాబట్టి వీటిని అధికంగా తినకపోవడమే మంచిదని అంటున్నారు.

గుండె, క్యాన్సర్ ముప్పును తగ్గించే గుణం నేరేడు పండ్లకు ఉంది. నేరేడు పండు గింజలను ఎండబెట్టుకొని పొడి చేసి రోజూ గ్లాసు నీటిలో కలుపుకొని తాగితే మధుమేహం నియంత్రణలో ఉంటుంది. వాపు కూడా తగ్గిస్తుంది. కొలస్ట్రాల్‌ను కూడా అదుపులో ఉంచుతుంది. మెదడుకు ఔషధంగా పని చేస్తాయి.




