Car Accident: ప్రాణం తీసిన నిర్లక్ష్యం.. సంచలనంగా మారుతున్న జూబ్లీహిల్స్ కారు ప్రమాదం..
Jubilee Hills Car Accident: జూబ్లీహిల్స్‌లో పాదచారుల ప్రాణాలకు రక్షణ లేదా..? రోడ్డుపక్కకైనా నడవాలంటే భయపడాల్సివస్తోంది. ఇక రోడ్డు దాటే విషయంలో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గురువారం రాత్రి జరిగిన ప్రమాదం చూస్తే..
జూబ్లీహిల్స్‌లో పాదచారుల ప్రాణాలకు రక్షణ లేదా..? రోడ్డుపక్కకైనా నడవాలంటే భయపడాల్సివస్తోంది. ఇక రోడ్డు దాటే విషయంలో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గురువారం రాత్రి జరిగిన ప్రమాదం చూస్తే అక్కడి స్పీడ్‌స్టర్ల బలుపు డ్రైవింగ్ స్కిల్స్ బయటపడుతున్నాయి. కారు ఓవర్‌స్పీడుకు ముక్కుపచ్చలారని బాలుడు బలైపోయాడు. కారు వేగంగా ఢీకొట్టడంతో(Car Accident) చిన్నారి ఊపిరాగిపోవడంతో.. ఆ తల్లి గుండెలవిసేలా రోదించింది. నా చిన్నారిని నాకివ్వండి అంటూ కన్నీరుమున్నీరుగా విలపించింది. ఈ తల్లి గర్భశోకానికి కారణం ఎమ్మెల్యేనా..? ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్న ఆ కారులో ఉన్న బలుపుస్టార్‌దా..? ఇదిలావుంటే.. ఇంతకీ ఈ కారులో ఎవరు వెళ్తున్నారు..? కారు నడిపిన డ్రైవర్ ఎవరు..? అసలీ కారు ఎవరిది..? ఎమ్మెల్యే షకీల్ స్టిక్కర్ ఎందుకుంది..? ప్రమాదం జరగ్గానే కారు నడుపుతున్న డ్రైవర్ పరార్ అయ్యాడు.
నిజంగా ప్రొఫెషనల్ డ్రైవరే అయితే.. ఈ ప్రమాదానికి కారణమవుతాడా అన్న అనుమానాలున్నాయి. ప్రొఫెషనల్ కాదన్న సంగతి ప్రమాదం జరిగిన తీరుతో తెలిసిపోతుంది. మరి కారులో ఉన్నదెవరు..? నడిపిన ఆ స్పీడ్‌స్టర్ ఎవరు? ప్రమాదం జరిగి 12 గంటలపైనే అవుతోంది.
జరిగి కొన్ని గంటలు ఇంకా పోలీసులు గాలిస్తూనే ఉన్నారు. నిజానికి కారుపై ఉన్న స్టిక్కర్ ఎమ్మెల్యే షకీల్‌ది. ఎమ్మెల్యే మాత్రం తన కారు కాదంటున్నారు. ఆస్టిక్కర్‌ని తన అనుచరుడైన మీర్జాది అని స్పష్టం చేస్తున్నారు. మరి కారు నడిపింది మీర్జానా? ఇంకెవరైనా ఉన్నారా? రాజకీయ ఒత్తిళ్ల వల్లే నిందితుల గుర్తింపు లేటవుతోందా? ఎన్నో ప్రశ్నలు ఈ ప్రమాదంపై ఉన్నాయి.
ఈ ఘటనలో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. ఘటనాస్థలంలోని సీసీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. కారు నడిపింది బోధన్ ఎమ్మెల్యే షకీల్ డ్రైవర్‌గా అనుమానిస్తున్నారు. కారు ఓ ప్రైవేట్ కన్‌స్ట్రక్షన్ కంపెనీ పేరుతో రిజిస్టర్ అయినట్టుగా తెలుస్తోంది. రాత్రి ట్రాఫిక్ సిగ్నల్ దగ్గరు బుడగలు అమ్మకుంటున్నవారిపైకి దూసుకెళ్లింది కారు. ఈ ప్రమాదంలో రెండు నెలల పసికందు మృతి చెందింది. ఈ ఘటన తర్వాత కారు వదిలి పరారయ్యాడు డ్రైవర్. అతని కోసం గాలిస్తున్నారు పోలీసులు.
ప్రమాదం ఎప్పుడు..? ఎలా జరిగింది..?
గురువారం రాత్రి 9 గంటల ప్రాంతంలో హైదరాబాద్‌లోని మాదాపూర్ నుంచి టీఆర్ నంబరుతో ఉన్న వాహనం కేబుల్ బ్రిడ్జ్ మీదుగా జూబ్లీహిల్స్ రోడ్ నంబరు 1/45 జంక్షన్ వైపు వేగంగా దూసుకొచ్చింది. ఈ క్రమంలో బ్రిడ్జి దిగగానే ఒక్కసారిగా అదుపు తప్పిన కారు అక్కడే పిల్లలను ఎత్తుకొని బుడగలు అమ్మకుంటున్న మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన కాజల్‌చౌహాన్, సారిక చౌహాన్, సుష్మ భోంస్లేలను కారు ఢీకొట్టింది. దీంతో కాజల్ చౌహాన్ చేతిలో ఉన్న రెండున్నర నెలల పసికందు రణవీర్ చౌహాన్, సారిక చౌహాన్ చేతుల్లో ఉన్న ఏడాది వయసున్న అశ్వతోష్ ఎగిరి కిందపడ్డారు. ఈ ఘటనలో రణవీర్ చౌహాన్ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోగా మిగిలిన వారికి గాయాలయ్యాయి. కారు నడుపుతున్న వ్యక్తి వాహనాన్ని వదిలేసి రోడ్ నంబరు 1 వైపు పరారయ్యాడు అని అక్కడ ఉన్న పోలీపులు, ప్రత్యేక్ష సాక్షుల కథనం.
ఇవి కూడా చదవండి: ఈ ఫోటోలో పిల్లి స్టెప్స్ ఎక్కుతోందా? దిగుతోందా?.. కనుక్కుంటే మీరు జీనియస్.
Health Benefits: చిటికెడు నల్ల ఉప్పుతో ఎన్నో చిక్కు సమస్యలకు చెక్ పెట్టండి.. ఎలానో తెలుసా..