Gold ATM: పసిడి ప్రియులకు శుభవార్త.. హైదరాబాద్ లో గోల్డ్ ఏటిఎంలు..

Gold ATM: ఏటిఎం అంటే సహజంగా.. డబ్బు విత్‌డ్రా(Cash Withdrawal) చేసుకునేందుకు లేదా ఎవరికైనా డబ్బు పంపించేందుకు వినియోగిస్తుంటాం. కానీ.. హైదరాబాద్ లో గోల్డ్ ఏటిఎంలు అందుబాటులోకి వస్తున్నాయి.

Gold ATM: పసిడి ప్రియులకు శుభవార్త.. హైదరాబాద్ లో గోల్డ్ ఏటిఎంలు..
Follow us

|

Updated on: Mar 18, 2022 | 7:05 AM

Gold ATM: ఏటిఎం అంటే సహజంగా.. డబ్బు విత్‌డ్రా(Cash Withdrawal) చేసుకునేందుకు లేదా ఎవరికైనా డబ్బు పంపించేందుకు వినియోగిస్తుంటాం. కానీ.. డబ్బు విత్‌డ్రాయల్స్, జమ చేసేందుకు వినియోగించే ఏటీఎంల తరహాలోనే బంగారం కోసం కూడా ఏటీఎంలు దేశీయంగా అందుబాటులోకి రానున్నాయి. గోల్డ్‌ సిక్కా సంస్థ(Goldsikka Company) ఈ మేరకు ఏర్పాట్లు చేస్తోంది. రానున్న నెలన్నర కాలంలో వీటిని ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ముందుగా వీటిని హైదరాబాద్ నగరంలోని చార్మినార్, సికింద్రాబాద్, అబిడ్స్ ప్రాంతాల్లో మెుదటివిడతగా బంగారు ఏటిఎంలను ప్రరంభిస్తోంది. వీటి నుంచి ఏకకాలలంలో 0.50 గ్రాముల నుంచి 500 గ్రాముల వరకు బంగారాన్ని కొనుగోలు చేయవచ్చని సంస్థ సీఈవో తరుజ్ వెల్లడించారు.

ఈ ఏటిఎంల నుంచి బంగారం కొనుగోలు చేయాలనుకునేవారు డెబిట్, క్రెడిట్‌ కార్డులు లేదా కంపెనీ అందిస్తున్న ప్రీపెయిడ్ కార్డులను ఇందుకోసం వినియోగించుకోవలసి ఉంటుంది. బంగారం స్వచ్ఛతకు సంబంధించిన వివరాలన్నింటితో ప్యూరిటీ సర్టిఫికెట్‌ కూడా కొనుగోలు సమయంలోనే పొందవచ్చని తరుజ్‌ వెల్లడించారు. ఒక్కో మిషన్‌లో ఒకేసారి రెండున్నర కోట్ల విలువైన 5 కేజీల బంగారు కాయిన్లను లోడ్‌ చేయవచ్చని సంస్థ వెల్లడించింది. భారత్‌లో గోల్డ్‌ మార్కెట్‌ వేళలకు అనుగుణంగా ఉదయం 9.50 నుంచి రాత్రి 11.30 వరకు ఈ గోల్డ్ ఏటీఎంలు పనిచేయనున్నాయి. ప్రస్తుతం ఇటువంటి ఏటిఎంలు దుబాయ్, బ్రిటన్లో మాత్రమే ఉన్నాయి.

ఇవీ చదవండి..

Crude Oil: రష్యా ఆఫర్ కు భారత చమురు కంపెనీలు ఫిదా.. భారీగా ముడి చమురు దిగుమతికి ఆర్డర్లు..

Gold Silver Price Today: పరుగులు పెడుతున్న బంగారం, వెండి ధరలు

ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ