Crude Oil: రష్యా ఆఫర్ కు భారత చమురు కంపెనీలు ఫిదా.. భారీగా ముడి చమురు దిగుమతికి ఆర్డర్లు..
Crude Oil: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం(Russia Ukraine Crisis) కారణంగా అంతర్జాతీయంగా ముడి చమురు ధరలకు రెక్కలొచ్చాయి. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద చమురు సరఫరాదారైన(Crude Exporter) రష్యా నుంచి ఎగుమతులు చాలా వరకు నిలిచిపోయాయి.
Crude Oil: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం(Russia Ukraine Crisis) కారణంగా అంతర్జాతీయంగా ముడి చమురు ధరలకు రెక్కలొచ్చాయి. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద చమురు సరఫరాదారైన(Crude Exporter) రష్యా నుంచి ఎగుమతులు చాలా వరకు నిలిచిపోయాయి. క్రూడ్ ధరలు భారీగా పెరిగి ఏకంగ్ 130 డాలర్ల మార్క్ ను దాటాయి. ఈ కారణంగా అమెరికా, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, యూకే, స్పెయిన్ తో పాటు తదితర దేశాల్లో చమురు ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి. దేశంలోనూ పెట్రో భారీగా పెరిగే అవకాశం ఉందని అంచనాతో భారత ఇంధన సంస్థలు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించాయి. ఇదే సమయంలో క్రూడాయిల్‌ను డిస్కౌంట్‌పై ఇస్తామని రష్యా ఆఫర్ చేయటంతో దేశీయ కంపెనీలు వరుస ఆర్డర్లు పెడుతున్నాయి. గత వారం ప్రభుత్వరంగ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ రష్యా చమురు కొనుగోలు చేయగా.. తాజాగా హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ సైతం భారీ ఆర్డర్ ను పెట్టింది.
ఈ క్రమంలో హెచ్పీసీఎల్ సంస్థ.. రష్యా నుంచి 20 లక్షల బ్యారెళ్ల చమురును.. దిగుమతి చేసుకునేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. దీనివల్ల ప్రస్తుత బ్యారెల్ ధరతో పోలిస్తే.. 20 నుంచి 25 డాలర్ల కంటే తక్కువ రేటుకే రష్యా భారత్ కు క్రూడాయిల్ సరఫరా చేయనుంది. అటు మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్ కూడా ఒక మిలియన్ బ్యారెళ్ల చమురు కొనుగోలుకు టెండర్ వేయనున్నట్లు సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. గతవారం ఐఓసీ కొనుగోలు చేసిన 30లక్షల బ్యారెళ్లతో పాటు తాజా హెచ్పీసీఎల్ ఒప్పందంతో కలిపి మే నెలలో 50 లక్షల బ్యారెళ్ల చమురు భారత్ చేరే అవకాశముంది. మరోవైపు చమురు రవాణాతో పాటు బీమాకు సంబంధించిన అన్ని అంశాల విషయంలో రష్యా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. డాలర్ కు బదులుగా.. రూపాయి-రూబెల్ పద్ధతిలో చెల్లింపులకు ఇప్పటికే ఇరుదేశాల మధ్య ఒప్పందం కుదిరింది.
ఇదే సమయంలోనే దేశీయ ప్రైవేట్ చమురు రంగ దిగ్గజం రిలయన్స్.. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయాలనుకోవడం లేదని ప్రకటించింది. రష్యా చమురుపై పశ్చిమ దేశాలు విధించిన ఆంక్షలు కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ కంపెనీ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. చమురు కొనుగోలుకు అవకాశం ఉన్నప్పటికీ దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. రిలయన్స్ గత కొన్నేళ్లుగా తమ చమురు శుద్ధి కేంద్రాల కోసం రష్యా నుంచి ఉరల్స్ క్రూడ్ ఇంధనాన్ని కొనుగోలు చేస్తోంది.
ఇవీ చదవండి..
Gold Silver Price Today: పరుగులు పెడుతున్న బంగారం, వెండి ధరలు
Multibagger Returns: స్టాక్ మార్కెట్ గందరగోళంలోనూ దూసుకుపోతున్న స్టాక్ ఇదే.. ఎంత పెరిగిందంటే..